రోమన్ హాలిడే
రోమన్ హాలిడే అనేది 1953 లో నిర్మింపబడి అనేక పురస్కారాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తం గా అనుసరణలు ప / From Wikipedia, the free encyclopedia
రోమన్ హాలిడే అనేది 1953 లో నిర్మింపబడి అనేక పురస్కారాలు గెలుచుకుని ప్రపంచవ్యాప్తం గా అనుసరణలు పొందిన ఒక అమెరికా శృంగార హాస్యభరిత చలన చిత్రం.
[[వర్గం:{{{year}}}_ఆంగ్లం, ఇటాలియన్_సినిమాలు]]
రోమన్ హాలిడే ఒక అమెరికన్ రొమాంటిక్ కామెడీ చిత్రం. దీనికి 1953లో నిర్మించారు. విలియం వైలర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఆడ్రీ హెప్బర్న్ రోమ్ ను చూడటానికి బయలుదేరిన యువరాణిగా నటించింది. గ్రెగొరీ పెక్ విలేకరిగా నటించాడు. హెప్బర్న్ నటనకు ఆమె ఉత్తమ నటిగా అకాడమీ అవార్డు గెలుచుకుంది. ఇంకా ఈ చిత్రం కథకు, దుస్తుల రూపకల్పన కూడా పురస్కారాలు గెలుచుకుంది.
ఈ కధా రచయతలు జాన్ డైటన్, డాల్టన్ ట్రుంబో. అయితే హాలీవుడ్ నిషిద్ధ జాబితాలో ఉన్నందు వలన ట్రుంబోకి గుర్తింపు లభించలేదు. ఇయాన్ మెక్లెల్లాన్ హంటర్ అతని కంటే ముందంజలో ఉన్నాడు. 2003లో ఈ చిత్రం DVD విడుదలైనప్పుడు ట్రుంబో పేరు తిరిగి చేర్చారు, డిసెంబర్ 19, 2011న, ట్రుంబో పనికి పూర్తి గుర్తింపు లభించింది. నిషిద్ధ జాబితాలో ఉన్న దర్శకుడు బెర్నార్డ్ వోర్హాస్ ఈ చిత్రానికి మారుపేరుతో సహాయ దర్శకుడిగా పనిచేశాడు.[1][2]
ఈ చిత్రం "హాలీవుడ్ ఆన్ ది టైబర్" తీస్తున్న సమయంలో సినీసిట్టా స్టూడియోలలో ఇంకా రోమ్ చుట్టూ ఉన్న ప్రదేశంలో చిత్రీకరించారు. 14వ వెనిస్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ అధికారిక కార్యక్రమం ఈ చిత్రంతో నాంది పలికింది.
1999లో యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఫిల్మ్ రిజిస్ట్రీలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు రోమన్ హాలిడే చలన చిత్రాన్ని "సాంస్కృతికంగా, చారిత్రాత్మకంగా లేదా సౌందర్యపరంగా ముఖ్యమైనది" గా భావించి సంరక్షణ కోసం ఎంపిక చేసారు. ఈ చిత్రాన్ని సినిమా చరిత్రలో శృంగార చిత్రాలలో ఒకటిగా పరిగణిస్తారు.[3][4][5]