రెండవ అక్బర్
From Wikipedia, the free encyclopedia
రెండవ అక్బర్ (1760 ఏప్రిల్ 22- 1837 సెప్టెంబరు 28) (రెండవ అక్బర్ షా అని కూడా పిలువబడ్డాడు) మొఘల్ చక్రవర్తిలలో చివరి నుండి రెండవవాడు. రెండవ షా ఆలం కుమారుడైన రెండవ అక్బర్ 1806-1837 వరకు పాలనసాగించాడు. ఆయన కుమారుడు " రెండవ బహదూర్ షా " కుమారుడు.
Akbar II | |||||
---|---|---|---|---|---|
16th Mughal Emperor | |||||
పరిపాలన | 19 November 1806 – 28 September 1837 | ||||
Coronation | 19 November 1806 at Red Fort, Delhi | ||||
పూర్వాధికారి | Shah Alam II | ||||
ఉత్తరాధికారి | Bahadur Shah II | ||||
జననం | 22 April 1760 (1760-04-22) Mukundpur, Mughal Empire | ||||
మరణం | 1837 సెప్టెంబరు 28(1837-09-28) (వయసు 77) Delhi, Mughal Empire | ||||
Burial | Mehrauli, Delhi | ||||
వంశము | 14 sons including Bahadur Shah II Mirza Jahangir shah Mirza Jahan Shah Mirza Babur Mirza Salim Shah Mirza Nazim Shah 8 daughters | ||||
| |||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Shah Alam II | ||||
తల్లి | Qudsia Begum (3rd wife of Shah Alam II) | ||||
మతం | Islam |
బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో భారతదేశం లోని అత్యధికభాగం యునైటెడ్ కింగ్డం స్వాధీనం చేసుకున్నందున బ్రిటిష్ అధికారం అధికమౌతూ రెండవ అక్బర్ అధికారం పరిమితంగా మారింది. ఆయన మరణించడానికి కొంతకాలానికి ముందు ఆయన రాజారాంమోహన్ రాయ్‌ను బ్రిటన్‌కు దూతగా పంపాడు. ఆయన పాలనాకాలంలో 1835లో ఈస్టిండియా కంపెనీ తనకుతాను మొఘల్ చక్రవర్తి లెఫ్టినెంట్జుగా పేర్కొనడం నిలిపివేసింది. తరువాత మొఘల్ చక్రవర్తి పేరుతో నాణ్యాలను ముద్రించడం నిలిపివేసింది. కంపెనీ ముద్రించే నాణ్యాలలో పర్షియన్ అక్షరాలను ముద్రించడం నిలుపబడింది.
రెండవ అక్బర్ మరణం తరువాత ఆయన ఢిల్లీ లోని మెహరౌలి వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి సమీపంలో మొదటి బహదూర్ షా, షా ఆలం, రెండవ షా ఆలం సమాధుల సమీపంలో సమాధి చేయబడ్డాడు.