From Wikipedia, the free encyclopedia
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW or Research and Analysis Wing) భారత గూఢచార సంస్థ. 1962 లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965న జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచేందుకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది.[1][2][2][3][4] 1968 సెప్టెంబరులో రాను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుచేసి ఒక సంస్థగా ఏర్పాటుచేసారు. ఇంటెలిజన్స్ బ్యూరో అప్పటికి భారతదేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమాలు చూసేది. రా ముఖ్యకార్యాలయం ఢిల్లీలోని, లోధిరోడ్ లో ఉంది.
రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (R&AW) | |
---|---|
విభాగం అవలోకనం | |
స్థాపనం | 21 సెప్టెంబరు 1968 |
ప్రధాన కార్యాలయం | సిజిఓ కాంప్లెక్స్, న్యూఢిల్లీ, భారతదేశం |
నినాదం | धर्मो रक्षति रक्षितःपरमो धरम (Sanskrit) (law protects, when it is protected) |
Parent విభాగం | క్యాబినెట్ సెక్రటేరియట్ |
Child agencies | ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నికల్ సర్వీసెస్ (ETS) రేడియో రీసెర్చ్ సెంటర్ స్పెషల్ గ్రూప్ |
వెబ్సైటు | |
http://www.allgov.com/india/departments/ministry-of-youth-affairs-and-sports/research-and-analysis-wing?agencyid=7606 |
ఇంటలిజెన్స్ బ్యూరోని బ్రిటీష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సంజీవి పిళ్ళై డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకొన్న తరువాత అనుభవజ్ఞులైన గూఢచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత - చైనా,1965 భారత - పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది.
1966 తరువాత ప్రత్యేక విదేశీ నిఘా సంస్థ ప్రారంభానికి గట్టి చర్యలు తీసుకొన్నారు. 1968 లో ఇందిరా గాంధీ హయాంలో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్.ఎన్. కావ్ అప్పటికి ఇంటలిజెన్స్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్. అతను ఇటువంటి సంస్థకు గల వివరాలతో గల బ్లూప్రింట్ ను ప్రధానికి ఇచ్చాడు. అప్పుడు 'రా' ఏర్పడి, అతనే 'రా' కు చీఫ్ గా నియమించబడ్డాడు.
రా గూఢచారులు బహుళజాతి సంస్థల్లో, వార్తా సంస్థల్లో పనిచేస్తూ తమ పని చేసుకొంటూ ఉంటారు. రా ఇతర దేశపు నిఘా సంస్థలతో కూడా సత్సంబంధాలు ఉంచుకొంటుంది. రష్యా ఎఫ్.ఎస్.బి, ఖాడ్, ద అఫ్ఘన్ ఏజెన్సి, మొస్సాద్ (ఇజ్రాయిల్), సి.ఐ.ఏ., ఎం.ఐ.6, వంటి సంస్థలతో సంబంధాలు ఉంచుకుంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అణుకార్యక్రమాలగూర్చి ఈ సంబంధాలు ఉంచుతుంది. రా మూడో దేశం ద్వారా కూడా సమాచారం సంపాదిస్తుంటుంది, ఆ దేశాల ద్వారా తన కార్యక్రమాలను సాగిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ కింగ్డమ్, హాంగ్‌కాంగ్, మయన్మార్, సింగపూర్ వాటిలో కొన్ని.
రాకు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పజెప్పారు. జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ - రా, ఇంటలిజెన్స్ బ్యూరో, రక్షణ ఇంటలిజెన్స్ సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. కానీ జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తరువాత జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ దానిలో విలీనం అయ్యింది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఏజెన్సీ కాదు ఒక "వింగ్". కేంద్ర కేబినెట్ లో ఒక భాగం. రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు శాసనం నుంచి దానికి మినహాయింపు ఉంది. అయితే, దాని కార్యకలాపాలను అంతర్గతంగా ఆడిట్ చేస్తారని సూచన ఉంది.[5]
ప్రస్తుతంరా గూఢచారులు ప్రతీ పెద్ద ఎంబసి, హైకమిషన్ లోనూ ఉన్నారు. ఇప్పటికి రాకు సుమారు 10000 మంది గూఢచారులు కేవలం పాకిస్తాన్ లోనే ఉన్నారు. రాకు ఆర్క్-వైమానిక (ARC-Aviation Reasearch Centre) నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థలో అత్యాధునిక విమానాలను హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
క్రమ సంఖ్య. | డైరెక్టరు | నుండి | వరకు | పని కాలంలో ముఖ్య ఆంశాలు |
---|---|---|---|---|
01 | ఆర్. ఎన్. కావ్ | 1968 | 1977 | RAW, ARC అరంభ డైరెక్టరు • బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం • ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ |
02 | ఎన్.సంతూక్ | 1977 | 1983 | RRC, ETS ఆరంభ డైరెక్టరు |
03 | గిరీష్ చంద్ర సక్సేనా | 1983 | 1986 | అ.సం.రా., సోవియట్ యూనియన్, చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల గూఢచారి విభాగాలతో ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారాలు • 'కనిష్క' విమానం బాంబింగ్ ఉదంతం |
04 | ఎ.కె.వర్మ | 1986 | 1989 | |
05 | జి.ఎస్. బాజ్‌పాయి | 1989 | 1991 | విద్రోహ వ్యతిరేక కార్యక్రమాలు |
06 | ఎన్. నరసింహన్ | 1991 | 1993 | ఆపురేషన్ చాళుక్య |
07 | జె.ఎస్. బేడి | 1993 | 1994 | 1993 ముంబై పేలుళ్ళు • చైనా, పాకిస్తాన్ వ్యవహారాలపైనా, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపైనా నిపుణుడు. |
08 | ఎ.ఎస్. స్యాలి | 1994 | 1996 | ఆర్థిక నేరాలపై పెరిగిన నిఘా • సంస్థలో క్రొత్త ఉద్యోగులను చేర్చుకోవడం, శిక్షణనివ్వడం పై ప్రత్యేక శ్రద్ధ. |
09 | రంజన్ రాయ్ | 1996 | 1997 | ఫార్ఖొర్ అయిర్ బేస్ చర్చలు |
10 | అరవింద్ దేవె | 1997 | 1999 | కార్గిల్ యుద్ధం • ఆపురేషన్ శక్తి |
11 | విక్రమ్ సూద్ | 1999 | 2003 | IC 814 హైజాకర్లతో చర్చలు • National Technical Facilities Organisation స్థాపన |
12 | సి.డి.సహాయ్ | 2003 | 2005 | ఆపరేషన్ లీచ్ • ARC పునర్వవస్థీకరణ • ఢిల్లీ లోఢీ రోడ్లో RAW కేంద్ర కార్యాలయం ఏర్పాటు. |
13 | పి.కె.హెచ్.తారకన్ | 2005 | 2007 | Nuclear Command Authority (India) ఆరంభం |
14 | అశోక్ చతుర్వేది | 2007 | 2012 | 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళు పరిశోధన |
15 | ఎస్ కె త్రిపాఠి | 2012 | (ప్రస్తుత డైరెక్టరు) |
రాకు దేశవ్యాప్తంగా పది స్పెషల్ బ్యూరోలు ఉన్నాయి. ఈ స్పెషల్ బ్యూరోలు భారతదేశ సరిహద్దుల్లో ఉన్న దేశాల్లో ఒక దానిని లక్ష్యం చేసుకుని పనిచేస్తూ ఉంటాయి. సాధారణంగా ఆ దేశపు సరిహద్దుకు దగ్గరలోని నగరంలో ఆయా స్పెషల్ బ్యూరోల ప్రధాన కేంద్రం ఉంటుంది.[6]
జోన్ | ప్రధాన కేంద్రం | జోన్ ఉన్నతాధికారి ర్యాంకు | రా నిర్మాణంలో వారి హోదా |
---|---|---|---|
ఉత్తర జోన్ | జమ్మూ | అడిషనల్ సెక్రటరీ | అడిషనల్ సెక్రటరీ |
తూర్పు జోన్ | కోల్‌కాతా | కమిషనర్ | జాయింట్ సెక్రటరీ |
వాయువ్య జోన్ | ముంబై | కమిషనర్ | జాయింట్ సెక్రటరీ |
ఈశాన్య జోన్ | షిల్లాంగ్ | కమిషనర్ | జాయింట్ సెక్రటరీ |
దక్షిణ జోన్ | చెన్నై | అదనపు కమిషనర్ | డైరెక్టర్ |
సెంట్రల్ జోన్ | లక్నో | అదనపు కమిషనర్ | డైరెక్టర్ |
పశ్చిమ జోన్ | జోధ్‌పూర్ | డిప్యూటీ కమిషనర్ | డిప్యూటీ సెక్రటరీ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.