![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/Ron_Howard_Cannes_2018.jpg/640px-Ron_Howard_Cannes_2018.jpg&w=640&q=50)
రాన్ హోవార్డ్
అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు / From Wikipedia, the free encyclopedia
రోనాల్డ్ విలియం హోవార్డ్ (జననం మార్చి 1, 1954) అమెరికన్ సినిమా దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ ప్లే రచయిత, నటుడు. ది ట్విలైట్ జోన్ ఎపిసోడ్తోపాటు అనేక టెలివిజన్ సీరియళ్ళలో అతిథిగా నటించి, బాల నటుడిగా గుర్తింపు పొందాడు. 1960 నుండి 1968 వరకు సిట్కామ్ ది ఆండీ గ్రిఫిత్ షోలో షెరీఫ్ ఆండీ టేలర్ (ఆండీ గ్రిఫిత్ పోషించాడు) కుమారుడు ఓపీ టేలర్ పాత్రను పోషించాడు.1962లో వచ్చిన ది మ్యూజిక్ మ్యాన్ నటించాడు, ఇది విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించింది. 1959 నుండి 1973 వరకు తన సినిమా, టెలివిజన్ లలో రోనీ హోవార్డ్గా పేరు పొందాడు. 1973లో వచ్చిన అమెరికన్ గ్రాఫిటీలో హావార్డ్ ప్రధాన పాత్రలలో ఒకదానిలో నటించాడు. 1974 నుండి 1980 వరకు సిట్కామ్ హ్యాపీ డేస్లో రిచీ కన్నింగ్హామ్ పోషించాడు.[1]
త్వరిత వాస్తవాలు రాన్ హోవార్డ్, జననం ...
మూసివేయి