దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ నగరంలో చారిత్రాత్మక భవనం From Wikipedia, the free encyclopedia
మైసూర్ రాజభవనం ఒకప్పుడు మైసూరును పరిపాలించిన ఒడయార్లు నివసించిన భవనం. భారతదేశంలోకెల్లా అతి పెద్ద భవనాల్లో ఒకటి.[1] దీన్ని ఇప్పుడు పురావస్తు సంగ్రహాలయంగా మార్చారు. ఒడయార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచారు. ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశము.[2] బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కల్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. ప్రధాన ద్వారం దగ్గర భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉన్నాయి.ప్రతి ఆదివారం సాయంత్రం, పండగ రోజుల్లో విద్యుద్దీపాలంకరణలతో మరింత శోభాయమానంగా ఉంటుంది.
1399 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు మైసూర్ సామ్రాజ్యాన్ని ఒడయార్ వంశస్థులు పరిపాలించారు. ఈ రాజులు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారు. కానీ రాజా ఒడయార్ తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూరు అధికారిక పీఠానికి కొంచెం ప్రాభవం తగ్గింది. 1638లో మెరుపుల వలన భవనం పాక్షికంగాదెబ్బతినింది.[3] రణధీర కంటీరవ నరసరాజా ఓడయార్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించాడు. 1762లో హైదర్ ఆలీ మైసూర్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రాభవం మరింత సన్నగిల్లింది.
ప్రతి సంవత్సరం మైసూరులో ఘనంగా జరిగే దసరా ఉత్సవాలకు ఈ భవనం ప్రధాన వేదిక. ప్రముఖ కళాకారులంతా ఈ భవన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక మీద ప్రదర్శనలిస్తారు. పదవ రోజైన విజయదశమి రోజున ఘనంగా అలంకరించిన ఏనుగులు ఇతర కళా బృందాలతో ఊరేగింపు జరుగుతుంది.
భవన ప్రాంగణంలో మొత్తం 12 దేవాలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనవి
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.