From Wikipedia, the free encyclopedia
మైఖేల్ మ్యాడ్సన్ (ఆంగ్లం: Michael Madsen; జననం 1958 సెప్టెంబరు 25) అమెరికన్ నటుడు.[1] క్వెంటిన్ టరాన్టినో రూపొందిచిన రిజర్వాయర్ డాగ్స్ (1992), కిల్ బిల్: వాల్యూమ్ 2 (2004), ది హేట్‌ఫుల్ ఎయిట్ (2015), వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్ (2019) వంటి చిత్రాలలో నటించిన ఆయన ప్రసిద్ధి చెందాడు.
మైఖేల్ మాడ్సెన్ | |
---|---|
జననం | చికాగో, ఇల్లినాయిస్, యు.ఎస్. | 1958 సెప్టెంబరు 25
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి |
|
పిల్లలు | 5, క్రిస్టియన్ మాడ్సెన్ తో సహా |
తల్లిదండ్రులు |
|
బంధువులు | వర్జీనియా మ్యాడ్సన్ (సోదరి) |
ది నేచురల్ (1984), ది డోర్స్ (1991), థెల్మా & లూయిస్ (1991), ఫ్రీ విల్లీ (1993), స్పీసీస్ (1995), డోనీ బ్రాస్కో (1997), డై అనదర్ డే (2002), సిన్ సిటీ (2005), స్కేరీ మూవీ 4 (2006) వంటి ఇతర చిత్రాలలో కూడా ఆయన నటించాడు. అలాగే, ఆయన గ్రాండ్ తెఫ్ట్ ఆటో III (2001), డిషనోర్డ్ సిరీస్ (2012–2017), కాల్ ఆఫ్ డ్యూటీ: మాబ్ ఆఫ్ ది డెడ్ (2013) వంటి వీడియో గేమ్‌లలో కూడా నటించాడు.
2021లో విడుదలైన క్రైమ్ థిల్లర్ సినిమా నిశ్శబ్దంలో ఆయన రిచర్డ్ డాకిన్స్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో నిర్మించి మలయాళం, కన్నడ భాషల్లోనూ దుబ్బింగ్ చేసి విడుదల చేశారు.[2]
మైఖేల్ మ్యాడ్సన్ 1958 సెప్టెంబరు 25న ఇల్లినాయిస్లోని చికాగోలో జన్మించాడు. అతని తల్లి, ఎలైన్ (నీ మెల్సన్), చిత్రనిర్మాత, రచయిత్రి. అతని తండ్రి, కాల్విన్ క్రిస్టియన్ మ్యాడ్సన్, రెండవ ప్రపంచ యుద్ధంలో నేవీ అనుభవజ్ఞుడు, చికాగో అగ్నిమాపక శాఖలో అగ్నిమాపక ఉద్యోగి.[3] అయితే, ఆయన తల్లిదండ్రులు 1960లలో విడాకులు తీసుకున్నారు.
అతని తోబుట్టువులలో చెరిల్ మ్యాడ్సన్ వ్యవస్థాపకుడు, వర్జీనియా మ్యాడ్సన్ అకాడమీ అవార్డు నామినీ.[4] ఆయన తండ్రి తరఫు తాతలు డానిష్ కాగా, అతని తల్లి తరఫు వారు ఇంగ్లీష్, జర్మన్, ఐరిష్, స్థానిక అమెరికన్, స్కాటిష్ వంశానికి చెందినవారు.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.