ముస్లింల ఆచారాలు
From Wikipedia, the free encyclopedia
ముస్లింల ఆచారాలు. ముస్లిం అనగా ఇస్లాంను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు. ఇస్లాం సూచనలకు మూలాధారాలు: ఖురాన్, సున్నహ్, హదీసులు, షరియా.
నిర్మాణాలు |
అరబ్ · అజేరి |
కళలు |
నాట్యము |
దుస్తులు |
అబాయ · అగల్ · బౌబౌ |
శెలవు దినాలు |
ఆషూరా · అర్బయీన్ · అల్ గదీర్ |
సాహిత్యము |
అరబ్బీ · అజేరి · బెంగాలి |
సంగీతము |
దస్త్గాహ్ · గజల్ · మదీహ్ నబవి |
థియేటర్ |
ఇస్లాం పోర్టల్ |
ముఖ్య గమనిక: ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు.
ఆచారాలకూ చేష్ఠలకూ మూఢవిశ్వాసాలకూ తేడాలు:
- ఆచారం: ముస్లింలు పరస్పరం 'సలాము' చేసుకోవడం ఆచారం. ఈ ఆచారం ఎంతో పరిశుధ్ధమైనది. దీని ఉదాహరణ ముస్లిమేతరులుకూడా ఇస్తారు.
- చేష్టలు: ఉదాహరణకు అరేబియాలో కొందరు అరబ్బులు ఒంటెల పందెం లో, ఒంటెలను ఉత్సాహపరచేందుకో లేక బెదిరించి పరుగులంకించుకొనేం దుకో, ఒంటెలకు పసిపిల్లలను కట్టేశారట. పసిబిడ్డలు చేసే అర్తనాదాలకు ఆ ఒంటెలు బెదిరి పరుగులంకించేవట. ఈ మధ్య ఈ వార్త ప్రపంచమంతా గుప్పుమంది. ఆ అరబ్బులు ముస్లింలు, వారు చేసిన చేష్టలు ఇస్లాం బోధించినవికావు.
- మూఢ విశ్వాసం: కొందరు మౌల్వీలు, జిన్ లు తమ వశంలో ఉన్నాయని, వాటి ద్వారా ఏలాంటి కార్యాలైనా సిధ్ధింపజేస్తామని పామరులకు నమ్మబలికి వారివద్దనుండి డబ్బులు రాబట్టడం తరచూ చూస్తూంటాము. ముస్లింలై ఉండీ అల్లాహ్ పై బలమైన విశ్వాసంలేని వారు, ఇలాంటి మూఢనమ్మకాల షికారు అవుతారు. షికారుచేయువాడు ధార్మికవిషయాలు తెలిసినవాడేనని మరువకూడదు. కానీ ఇతనికి తెలిసింది అసత్యమనేది సత్యం.
ఈ చేష్టలు, మూఢవిశ్వాసాలనుండి ప్రజలను బయటపడవేయడానికే ఇస్లాం అవతరించింది. ఇస్లాం సదాచారాలకు పుట్టినిల్లు. ఇస్లాం సూచించినవన్నీ ముస్లిం ఆచరించడం లేదు. ముస్లిం ఆచరించేవన్నీ ఇస్లాం సూచించినవి గావు. అందరూ అంగీకరించే ముస్లిం ఆచారాలు కొన్ని క్రింద ఇవ్వబడ్డాయి.