ముఅజ్జిన్
From Wikipedia, the free encyclopedia
ముఅజ్జిన్ :
'ముఅజ్జిన్ (/[invalid input: 'icon']muːˈɛzɪn/; మూస:Lang-tr from అరబ్బీ: మూస:Script/Arabic, mu’aḏḏin), లేదా ముజీమ్, సాధారణంగా పల్లెటూరి ప్రాంతాలలో "మౌజన్" అని సంబోధిస్తారు. ఈ ముఅజ్జిన్ మసీదు యందు, ప్రార్థనా సమయాన, ప్రార్థనల కొరకు ముస్లింలను సాంప్రదాయ బద్ధంగా పిలిచేవాడు. ఈ ముఅజ్జిన్ అంత ప్రముఖుడు గాకపోయిననూ, ముస్లిం సమాజం నమాజు సమయాలను ఇతని పిలుపు (అజాన్) ఆధారంగా తెలుసుకుంటారు. అజాన్ (ఆంగ్లం : Adhan (Athaan)) (అరబ్బీ : أَذَان) అనునది, ఇస్లామీయ ప్రార్థనల పిలుపు లేదా ప్రకటన. ఈ ప్రకటనను చిన్న మసీదుల్లో నయితే భవనం పక్కతలుపు దగ్గరనుండి పెద్ద మసీదుల్లోనయితే స్తంభంపైనుండి ముఅజ్జిన్ బిగ్గరగా అందరికీ వినబడేలా అరుస్తాడు. ముఅజ్జిన్ అంటే అరిచేవాడు లేదా పిలిచేవాడు. కొంతమంది ముఅజ్జిన్ లు అజాన్ ను రాగయుక్తంగా శ్రావ్యంగా పాడుతారు కూడా.
చారిత్రకంగా ముఅజ్జిన్ మీనార్ పై నిలబడి అజాన్ ఇస్తాడు. దీని ద్వారా, మస్జిద్ చుట్టు ప్రాంతాలలో ఉన్నవారికి ఈ అజాన్ (పిలుపు) వినబడుతుంది. నేటి కాలంలో లౌడ్ స్పీకర్లు వచ్చాయి, వీటి ద్వారా అజాన్ పిలుపు ఇవ్వబడుచున్నది, మస్జిద్ చుట్టుప్రక్కలవారికి, మస్జిద్ కు దూరంగా వున్నవారికినూ ఈ వినిపించడం ఉద్దేశం.