ముంబై శివారు జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్ర రాష్ట్ర 51 జిల్లాలలో ముంబై పరిసరం జిల్లా ఒకటి. బంద్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 369 చ.కి.మీ జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి ( కుర్ల, అంధేరి, బొరివలి).[1] ముంబై పరిసరం జిల్లా, ముంబై నగరం జిల్లా, ఇతర ప్రాంతాలు కలిసి ముంబై మహానరాన్ని రూపొందిస్తున్నాయి.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. జిల్లా కొంకణ్ డివిషన్లో భాగంగా ఉంది. ముంబై పరిసర జిల్లా న్యాయపరిధి బంద్రా నుండి దహిసర్, కుర్ల నుండి ములంద్, కుర్ల నుండి ట్రాంబే వరకు విస్తరించి ఉంది. ముంబై పరిసర జిల్లా దేశంలో అత్యధిక జనసాంధ్రత కలిగిన జిల్లాలో ఒకటిగా గుర్తించబడుతుంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 9,332,481. ముంబై పరిసర జిల్లా జనసాంధ్రత పరంగా దేశంలో 5 వ స్థానంలో ఉంది.[3] జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో మిథినది ప్రధానమైనది.
త్వరిత వాస్తవాలు ముంబై శివారు జిల్లా मुंबई उपनगर जिल्हा, దేశం ...
ముంబై శివారు జిల్లా
मुंबई उपनगर जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | కొంకణ్ |
ముఖ్య పట్టణం | Bandra |
మండలాలు | 1. Kurla, 2. Andheri, 3. Borivali, |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Mumbai North, 2. Mumbai North West 3. Mumbai North East 4. Mumbai North Central, 5. Mumbai South Central (shared with Mumbai City district) |
• శాసనసభ నియోజకవర్గాలు | 26 |
విస్తీర్ణం | |
• మొత్తం | 369 కి.మీ2 (142 చ. మై) |
జనాభా (2001/2011) | |
• మొత్తం | 93,32,481 |
• జనసాంద్రత | 25,000/కి.మీ2 (66,000/చ. మై.) |
ప్రధాన రహదార్లు | NH-3, NH-8, |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి