![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Portrait_Michelle_Bachelet.jpg/640px-Portrait_Michelle_Bachelet.jpg&w=640&q=50)
మిచెల్లీ బచెలేట్
From Wikipedia, the free encyclopedia
వెరోనికా మిచెల్లీ బచెలేట్ జెరియా (జననం 1951 సెప్టెంబరు 29) చిలీ దేశానికి చెందిన ప్రముఖ రాజకీయవేత్త. ఆమె ఆ దేశానికి 2006-2010, 2014-2018 సంవత్సరాల కాలంలో రెండుసార్లు అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు. ఆమె చిలీ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి, చరిత్ర సృష్టించారు. 2010లో దేశాధ్యక్ష పదవికాలం పూర్తయిన తరువాత అప్పుడే కొత్తగా స్థాపించబడిన యు.ఎన్ మహిళా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ విభాగం స్త్రీ, పురుషుల మధ్య అసమానతలు, మహిళా సాధికారతల సాధించడం కోసం ఏర్పాటు చేయబడింది. 2013 డిసెంబరులో, ఆమె చిలీ దేశాధ్యక్షురాలిగా రెండోసారి గెలిచారు. మొదటిసారి 2006లో 53.5% ఓట్లు సంపాదించిన ఆమె, రెండోసారి 62% ఓట్లు గెలుచుకోవడం విశేషం. చిలీలో 1932 తరువాత రెండోసారి దేశాధ్యక్ష పదవికి ఎన్నికైన రెండో వ్యక్తి మిచెల్లీనే.[1]
మిచెల్లీ బచెలేట్ | |
---|---|
![]() | |
చిలీ దేశాధ్యక్షురాలు | |
అంతకు ముందు వారు | సెబస్టైన్ పినేరా |
తరువాత వారు | సెబస్టైన్ పినేరా |
అంతకు ముందు వారు | రికర్డో లాగోస్ |
తరువాత వారు | సెబస్టైన్ పినేరా |
యు.ఎన్ మహిళా విభాగానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | |
తరువాత వారు | లక్ష్మి పూరి |
వ్యక్తిగత వివరాలు | |
జననం | వెరోనికా మిచెల్లీ బచెలేట్ జెరియా (1951-09-29) 1951 సెప్టెంబరు 29 (వయసు 72) సాంటైగో, చిలీ |
రాజకీయ పార్టీ | సోషలిస్ట్ పార్టీ ఆఫ్ చిలీ |
ఇతర రాజకీయ పదవులు | కాన్సన్ట్రేషన్ (1988–2013) న్యూ మెజారిటీ (2013–present) |
జీవిత భాగస్వామి | జార్జ్ డేవలస్ కార్టస్ (1979–1984) |
సంతానం | 3 |
తల్లి | ఏంజెలా జెరియా గోమెజ్ |
తండ్రి | బ్రిగేడ్ జనరల్ ఆల్బర్టో బచెలేట్ మర్టినెజ్ |
కళాశాల | యూనివర్శిటీ ఆఫ్ చిలీ కార్ల్ మార్క్స్ యూనివర్శిటీ, లైప్జిగ్ ఇంటర్-అమెరికన్ డిఫెన్స్ కళాశాల |
సంతకం | ![]() |
వృత్తిపరంగా డాక్టర్ అయిన మిచెల్లీ, ఆరోగ్య, రక్షణ శాఖల మంత్రిగా కూడా పనిచేసింది. మిచెల్లీ, ఆమె భర్త విడాకులు తీసుకున్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలు. తనను తాను నాస్తికురాలిగా ప్రకటించుకుంది మిచెల్లీ.[2] ఆమె మాతృభాష అయిన స్పానిష్ మాత్రమే కాక, ఆంగ్లం, జర్మన్, పోర్చుగీసు, ఫ్రెంచి, ఇటాలియన్ భాషలు కూడా అనర్గళంగా మాట్లాడగలదు.[3][4] ఆమె సోషలిస్ట్ పార్టీ ఆఫ్ చిలీలో సభ్యురాలు.