From Wikipedia, the free encyclopedia
మానభంగం లేదా అత్యాచారం లేదా లైంగిక దాడి అనగా ఒక వ్యక్తి యొక్క మానానికి భంగం కలిగించడం. చట్టపరంగా ఒక వ్యక్తి యొక్క అనుమతి (Consent) లేకుండా సంభోగం జరుపడాన్ని మానభంగంగా పరిగణిస్తారు. ఇదొక రాక్షసరతి విధానం. ఇది చాలా కౄరమైన సాంఘిక నేరంగా పరిగణిస్తారు.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన. |
మానభంగం ఎక్కువగా స్త్రీలపై పురుషులు జరిపే ప్రక్రియ. అయితే ఇవి చాలా దేశాలలో వివిధ కారణాల వలన చాలా తక్కువగా రక్షకభటుల దృష్టికి వస్తాయి. ఇంకా కొద్ది మందికి మాత్రమే నేరస్థులుగా శిక్షలు విధించబడతాయి.[1] మానభంగానికి పాల్పడిన వ్యక్తి సాధారణంగా పరిచయం ఉన్నవారే చేస్తారని అమెరికా పరిశోధనల మూలంగా తెలిసింది. చాలా తక్కువగా అంటే 2 % సందర్భాలలో మాత్రమే కొత్త వ్యక్తులతో జరిగింది.[2]
మానభంగాన్ని జరిగిన సందర్భాన్ని బట్టి, వ్యక్తి లక్షణాలను బట్టి విభజిస్తారు.[3]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.