మంజుల్ భార్గవ
From Wikipedia, the free encyclopedia
మంజుల్ భార్గవ (జననం: 08-08-1974) ఒక ఇండియన్ కెనడియన్ అమెరికన్ గణిత శాస్త్రవేత్త. సియోల్ లో జరిగిన అంతర్జాతీయ గణిత కాంగ్రెస్-2014లో 13-08-2014 న ఇతను గణిత నోబెల్ పురస్కారంగా పిలుచుకొనే "ఫీల్డ్స్ మెడల్"ను అందుకున్నాడు. గణిత శాస్త్రంలో అసమాన ప్రతిభ చూపిన వారికి ఈ ఫీల్డ్స్ మెడల్ లభిస్తుంది, దీని విజేత వయస్సు 40 సంవత్సరాలు దాటకూడదు, నాలుగు సంవత్సరాలకి ఒకసారి మాత్రమే ఈ బహుమతిని ఇస్తారు. సంఖ్యా జ్యామితిలో శక్తిమంతమైన కొత్త విధానాలను అభివృద్ధి పరచినందుకు ఫీల్డ్స్ మెడల్ పురస్కారం భార్గవకు దక్కింది. ఈయన చిన్న శ్రేణి వలయాలను లెక్కించడానికి, దీర్ఘవృత్తాకార వంపుల సరాసరి శ్రేణి అవధిని నిర్ధరించడానికి సంఖ్యా జ్యామితిలో ఈ శక్తిమంతమైన కొత్త విధానాలను ఉపయోగించాడు. గణిత శాస్త్రంలో అపార నైపుణ్యమున్న ఇతను అనేక ప్రపంచస్థాయి బహుమతులను సొంతం చేసుకున్నాడు.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
త్వరిత వాస్తవాలు మంజుల్ భార్గవ, జననం ...
మంజుల్ భార్గవ | |
---|---|
జననం | (1974-08-08) 1974 ఆగస్టు 8 (వయసు 49) హామిల్టన్, ఒంటారియో |
జాతీయత | కెనడా, యునైటెడ్ స్టేట్స్ |
వృత్తిసంస్థలు | ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం లైడెన్ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | ఆండ్రూ విలెస్ |
డాక్టొరల్ విద్యార్థులు | మైఖేల్ వోల్పటో మెలనీ వుడ్ |
ప్రసిద్ధి | గాస్ కూర్పు చట్టాలు 15, 290 సిద్ధాంతాలు ఫ్యాక్టోరియల్ ఫంక్షన్ దీర్ఘవృత్తాకార వక్ర రేఖల ర్యాంకులు |
ముఖ్యమైన పురస్కారాలు | ఫీల్డ్స్ మెడల్ (2014) ఇన్ఫోసిస్ బహుమతి (2012) ఫెర్మాట్ బహుమతి (2011) కోల్ బహుమతి (2008) క్లే రీసెర్చ్ అవార్డు (2005) SASTRA రామానుజన్ బహుమతి (2005) హస్సీ బహుమతి (2003) మోర్గాన్ బహుమతి (1996) హోపెస్ బహుమతి (1996) |
మూసివేయి