మంగలి
From Wikipedia, the free encyclopedia
కేశఖండన, కేశాలంకరణ చేసే వ్యక్తిని క్షురకుడు లేదా మంగలి అంటారు. సామాన్యంగా వీరిలో నాయీ బ్రాహ్మణ కులస్తులు ఎక్కువగా ఉంటారు. మంగళ వాయిద్యాలు వాయించేవారు కనుక మంగళ అని పేరు వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ముస్లింలు కూడా నాయీ (క్షౌర) వృత్తి చేస్తున్నారు. మనదేశంలో ఎక్కువగా మంగలి కులస్తులే మంగలివృత్తిని ఆచరించినా కూడా ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. హైదరాబాదు, నెల్లూరు లోని కొన్ని ప్రాంతాలలో మహమ్మదీయులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు. అలాగే కొన్ని అరబిక్ దేశాలలో కూడా ఇతర మతస్తులు ఈ వృత్తిని ఆచరిస్తున్నారు.[1]
త్వరిత వాస్తవాలు వృత్తి, పేర్లు ...
వృత్తి | |
---|---|
పేర్లు | మంగలి, హెయిర్డ్రెస్సర్ |
వృత్తి రకం | వృత్తి |
వివరణ | |
సామర్ధ్యాలు | హెయిర్ డ్రెస్సింగ్, సంగీతకారులు |
ఉపాధి రంగములు | మంగలి అంగళ్ళు, సలూన్లు, క్షౌరశాలలు |
మూసివేయి