భద్రాచలం
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
భద్రాచలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం లోని రెవెన్యూ గ్రామం,[3] జనగణన పట్టణం. ఇక్కడ భక్త రామదాసు నిర్మించిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము వలన పుణ్యక్షేత్రం. ఇది గోదావరి నది దక్షిణ తీరాన ఉంది. దీనిని భద్రాద్రి, శ్రీరామ దివ్యక్షేత్రం అనే పేర్లుతో కూడా పిలుస్తారుఇది పూర్వపు జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, పేరొందింది. జిల్లాలోని పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 40 కి.మీ. దూరంలోను ఉన్నాయి. భద్రాచలం తప్ప మిగిలిన పుణ్యక్షేత్రాలన్ని పోలవరం ముంపు ప్రాంతాలుగా మారాయి. భద్రాచలం రెవెన్యూ డివిజను మొదట తూర్పుగోదావరి జిల్లాలో ఒక భాగంగా ఉండేది. అంధ్ర, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై, కొత్తగా ఖమ్మం జిల్లా ఏర్పడిన సమయంలో దీనిని ఖమ్మం జిల్లాలో విలీనం చేయటం జరిగింది. తెలంగాణ ఉద్యమం తీవ్రముగా ఉన్న రోజులలో ఇది వివాదాస్పదం అయ్యింది.
భద్రాచలం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం భద్రాచలం (అయోమయ నివృత్తి) చూడండి. |
భద్రాచలం
భద్రాద్రి | |
---|---|
Coordinates: 17.67°N 80.88°E / 17.67; 80.88 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా |
Government | |
• Body | పురపాలకసంఘం |
విస్తీర్ణం | |
• Total | 12.00 కి.మీ2 (4.63 చ. మై) |
Elevation | 50 మీ (160 అ.) |
జనాభా (2011)[2] | |
• Total | 50,087 |
• Rank | తెలంగాణలో 40వ పట్టణం |
• జనసాంద్రత | 7,121/కి.మీ2 (18,440/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 507111 |
టెలిఫోన్ కోడ్ | 08743 |
Vehicle registration | టిఎస్-28 |
Sex ratio | 1:1 ♂/♀ |
కొత్తగూడెం నుండి దూరం | 40 కిలోమీటర్లు (25 మై.) |
హైదరాబాదు నుండి దూరం | 325 కిలోమీటర్లు (202 మై.) |
Website |