![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/54/Bhagat_Singh_1929.jpg/640px-Bhagat_Singh_1929.jpg&w=640&q=50)
భగత్ సింగ్
భారతీయ విప్లవకారుడు / From Wikipedia, the free encyclopedia
భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 27[1] [2]- 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్యోద్యమం లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో అతను ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.
భగత్ సింగ్ | |
---|---|
![]() 1929 లో భగత్ సింగ్ | |
జననం | 28 సెప్టెంబరు 1907 బంగా, జారన్వాలా తహ్సీల్, ఫైసలాబాద్ జిల్లా(ల్యాల్పుర్ జిల్లా), పంజాబ్, బ్రిటిష్ పాలిత భారతదేశం (నేడు పాకిస్తాన్) |
మరణం | 1931 మార్చి 23(1931-03-23) (వయసు 23) లాహోర్, పంజాబ్, బ్రిటిష్ పాలిత భారతదేశం, (నేడు పాకిస్తాన్) |
నవజవాన్ భారత సభ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ కీర్తి కిసాన్ పార్టీ. | |
ఉద్యమం | భారత స్వాతంత్ర ఉద్యమం |
హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఆయన ఒకడు. ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో అతను జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం, సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.[3] అనేక విప్లవాత్మక సంస్థల్లో అతను చేరాడు. గణతంత్ర సంఘం (HRAS)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన అతను, ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (Siuuu)గా మార్చాడు. భారత, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ 64 రోజులు చేపట్టడం ద్వారా సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు అతనిని ఉరితీశారు. అతను ఉత్తరదాయిత్వం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది.[4]