బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్
From Wikipedia, the free encyclopedia
బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు. ఈయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10, 11వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో జన్మించారు. బొమ్మగాని ధర్మబిక్షం తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు.[2]
త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్ | |||
మాజీ ఎంపీ, నల్గొండ | |||
నియోజకవర్గం | నల్గొండ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1922-02-15) 1922 ఫిబ్రవరి 15 (వయసు 102)/1922, ఫిబ్రవరి, 15 మునుగోడు మండలం ఊకొండి గ్రామం నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్[1] | ||
మరణం | మార్చి 26, 2011 | ||
రాజకీయ పార్టీ | కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | ||
జీవిత భాగస్వామి | అవివాహితుడు | ||
సంతానం | బొమ్మగాని ప్రభాకర్(దత్తత) | ||
మతం | హిందూ మతం |
మూసివేయి