From Wikipedia, the free encyclopedia
బేరియం ఆక్సైడ్ ఒక రసాయనిక సమ్మేళన పదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సంయోగ పదార్థం.ఈ సమ్మేళన పదార్థం యొక్క రసాయన ఫార్ములా BaO.బేరియం, ఆక్సిజన్ మూలకాల పరమాణువుల సంయోగం వలన ఏర్పడిన సంయోగ పదార్థం ఇది.
పేర్లు | |
---|---|
ఇతర పేర్లు
Barium monoxide Barium protoxide Calcined baryta Baria | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [1304-28-5] |
పబ్ కెమ్ | 62392 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | CQ9800000 |
SMILES | [Ba]=O |
| |
ధర్మములు | |
BaO | |
మోలార్ ద్రవ్యరాశి | 153.326 g/mol |
స్వరూపం | white solid |
సాంద్రత | 5.72 g/cm3, solid |
ద్రవీభవన స్థానం | 1,923 °C (3,493 °F; 2,196 K) |
బాష్పీభవన స్థానం | ~ 2,000 °C (3,630 °F; 2,270 K) |
నీటిలో ద్రావణీయత |
3.48 g/100 mL (20 °C) 90.8 g/100 mL (100 °C) Reacts to form Ba(OH)2 |
ద్రావణీయత | soluble in ethanol, dilute mineral acids and alkalies; insoluble in acetone and liquid ammonia |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం |
cubic, cF8 |
Space group |
Fm3m, No. 225 |
కోఆర్డినేషన్ జ్యామితి |
Octahedral |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−582 kJ·mol−1[1] |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
70 J·mol−1·K−1[1] |
ప్రమాదాలు | |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | మూస:R20/22 |
S-పదబంధాలు | (S2), S28 |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Calcium oxide Strontium oxide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
బేరియం ఆక్సైడ్ తెల్లని ఘన పదార్థం.బేరియం ఆక్సైడ్ యొక్క అణుభారం 153.326 గ్రాములు/మోల్. ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 5.72 గ్రాములు/సెం.మీ3. బేరియం ఆక్సైడ్ యొక్క ద్రవీభవన స్థానం 1,923 °C (3,493 °F; 2,196 K).దీని బాష్పీభవన స్థానం ~ 2,000 °C (3,630 °F; 2,270 K).బేరియం ఆక్సైడ్ నీటిలో కరుగుతుంది. నీటి ఉష్ణోగ్రత పెరుగు కొలది, నీటిలో బేరియం ఆక్సైడ్ ద్రావణీయత పెరుగుతుంది.100 మి.లీ నీటిలో 20 °C వద్ద 3.48 గ్రాములు,100°Cవద్ద 90.8 గ్రాములు కరుగును. బేరియం ఆక్సైడ్ఇథనాల్, సజల ఖనిజ ఆమ్లాలలో, క్షారాలలో కరుగును.అసిటోన్ లో, ద్రవ అమ్మోనియాలో మాత్రం కరుగదు.
బేరియం కార్బోనేట్ ను కోక్, (coke, కార్బన్ బ్లాక్ లేదా తారుతో కలిపి వేడి చెయ్యడం ద్వారా ఉత్పత్తి చెయ్యుదురు[2].బేరియం నైట్రేట్‌ను ఉష్ణవియోగం చెందించడం ద్వారా కూడా ఉత్పత్తి చెయ్యవచ్చును. తరచుగా బేరియం లవణాలను వియోగం చెందించడం వలన ఉత్పత్తి చెయ్యుదురు:[3] 2Ba + O2 → 2BaO
బేరియం ఆక్సైడ్‌ను కేథోడ్ కిరణ నాళిక (cathode ray tubes) వంటి పరికరాలలో వేడి కేథోడుకు పూతగా ఉపయోగిస్తారు.ఆప్టికల్ క్రౌన్ గ్లాస్ (optical crown glass) వంటి గాజు వస్తువులలో లెడ్ (II) ఆక్సైడ్ కు ప్రత్నామ్యాయంగా ఉపయోగిస్తారు[4]. బేరియం ఆక్సైడ్ ను ఇథైలిన్, ఆల్కహాల్ లరసాయన చర్యలో ఎథొక్సాలెసన్ (ethoxylation ) ఉత్పేరకంగా ఉపయోగిస్తారు. ఈ రసాయన చర్య 150-200°Cమధ్య జరుగును.[5]
శుద్ధమైన ఆక్సిజన్ ఉత్పత్తికి బేరియం ఆక్సైడ్ నువనరుగా ఉపయోగిస్తారు.బేరియం ఆక్సైడ్ సమ్మేళనం BaO1+xగా ఆక్సీకరణ చెందటం వలన పెరాక్సైడ్ అయాన్ ఏర్పడును.ఒక మోస్తరు/తగుమాత్రం ఉషోగ్రత వద్ద బేరియం ఆక్సైడ్, పెరాక్సిడేసన్ వలన బేరియం పెరాక్సైడ్ (Bao2) గా ఏర్పడును.1175K[6] వద్ద ఈ పెరాక్సైడ్ ఆక్సిజన్ (O2, బేరియం ఆక్సైడ్ గా వియోగం చెందును.
బేరియం ఆక్సైడ్ ఇరిటె సన్ కల్గించు పదార్థం.కళ్ళను, లేదా చర్మాన్ని తాకినప్పుడు లేదా పీల్చినపుడు నొప్పి కలగడం, ఎరుపెక్కడం జరుగును.అన్నకోశం చేరిన మరింత ప్రమాదకరం. దీని వలన వాంతులు, డోకులు, విరేచనాలు, కండరాల పక్షవాతం, హృదయానికి సంబంధించిన ఇబ్బందులు కలిగి, మరణం సంభవించే అవకాశం ఉంది. అందు వలన పొరపాటున తినిన వెంటనే వైద్య చికిత్స అందించ వలెను.
బేరియం ఆక్సైడ్ ను వాతావరణంలో విడుదల చెయ్యరాదు.అలాచేయ్యడం వలన జలసంబంధమైన, జలచరమైనమరియు సూక్ష్మసంయోగాలు, సూక్ష్మజీవులఉనికికి ప్రమాదం.[7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.