బులుసు లక్ష్మణ దీక్షతులు (జననం 1936 అక్టోబరు 31) డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, కంట్రోల్ థియరీకి ముఖ్యమైన కృషి చేసిన భారతీయ విద్యావేత్త. అతను వరల్డ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఫెలో ఆఫ్ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, IEEE లలో ఫెలోగా ఉన్నాడు.
అతను భారత ప్రభుత్వం ప్రదానం చేసే పద్మశ్రీ పురస్కార గ్రహీత. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్‌గా, విశిష్ట శాస్త్రవేత్తగా పనిచేశాడు. సెంటర్ ఫర్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇన్ ఆసియా & పసిఫిక్ - వ్యవస్థాపక డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి బోర్డ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్నాడు.
అతను డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్, రిమోట్ సెన్సింగ్, కంట్రోల్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ విజన్, మెషిన్ లెర్నింగ్, గేమ్ థియరీ, పవర్ సిస్టమ్స్, ప్యాటర్న్ రికగ్నిషన్, న్యూరల్ నెట్ వర్క్స్ రంగాలలో తనవంతు కృషి చేసాడు.[1] కంప్యూటర్ పిక్చర్ ప్రాసెసింగ్ కోసం అతను భారతదేశంలో మొదటిసారిగా గ్రే స్కేల్, కలర్ డ్రమ్ స్కానర్లను రూపొందించాడు. అది అతనికి NRDC అవార్డును తెచ్చిపెట్టింది.
దీక్షితుయ్లు కింది సంస్థలలో పనిచేసాడు
రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ మిషన్స్ ఇండియా చైర్మన్ 1987–1995.
1981లో UN/FAO కన్సల్టెంట్ & 1996లో బీజింగ్‌లో సీనియర్ కన్సల్టెంట్
UN/ESCAP/RSSPలో ప్రభుత్వ ప్రతినిధి
విజిటింగ్ సైంటిస్ట్, IBM థామస్ J. వాట్సన్ రీసెర్చ్ సెంటర్, యార్క్ టౌన్ హైట్స్, న్యూయార్క్