బాహుబలి
జైన్ డైటి / From Wikipedia, the free encyclopedia
ఇదే పేరుతో ఉన్న చలనచిత్రం గురించి బాహుబలి:ద బిగినింగ్ చూడండి
బాహుబలి | |
---|---|
జైన విగ్రహం | |
ఇతర పేర్లు | గోమఠేశ్వరుడు |
అనుబంధం | జైన మతము |
తోబుట్టువులు | భరత చక్రవర్తి 98 మంది సోదరులు |
తండ్రి | వృషభ నాధుడు |
తల్లి | సునంద |
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
మూస:Jainism
జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు లేదా వృషభనాథుడు, సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడని కొన్ని సారస్వత ఆధారాలు చెబుతున్నాయి. ఆయన కాలంలో జైనమతం ఇప్పటి రూపాన్ని సంతరించుకోలేదు. నిజానికి అప్పట్లో జైన మతం అనే పేరే లేదు. మొదట్లో అంటే సింధునాగరికతా కాలం వరకు బాహుబలి జీవిత కాలంలో ఆయన తండ్రి స్థాపించిన మతాన్ని రిషభధర్మం అని వ్యవహరించారు. వేదకాలంలో వ్రత్యధర్మం అన్నారు. ఉపనిషత్తుల కాలం వచ్చే నాటికి అర్హంత్ ధర్మం అనీ, మౌర్యుల కాలంనాటికి నిగ్రంథి అనీ, ఆ తరువాతి కాలంలో జైనం అని పిలిచారని అనేక సారస్వత ఆధారాల వల్ల తెలుస్తోంది. బాహుబలి ఒక చారిత్రక పురుషుడని కానీ, లేక పౌరాణిక పురుషుడని కానీ ఇదమిత్థంగా చెప్పటం సాధ్యం కాదు