బారువ
ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా గ్రామం / From Wikipedia, the free encyclopedia
బారువ, శ్రీకాకుళం జిల్లా, సోంపేట మండలం లోని గ్రామం.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 18.8842389°N 84.5788993°E /, రాష్ట్రం ...
బారువ | |
— రెవిన్యూ గ్రామం — | |
1917 షిప్పింగ్ ప్రమాదానికి గుర్తుగా బారువా వద్ద నిర్మించిన స్థంభం. | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18.8842389°N 84.5788993°E / 18.8842389; 84.5788993 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండలం | సోంపేట |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 5,795 |
- పురుషుల సంఖ్య | 2,768 |
- స్త్రీల సంఖ్య | 3,027 |
- గృహాల సంఖ్య | 1,518 |
పిన్ కోడ్ | 532263 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి
ఇది మండల కేంద్రమైన సోంపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఇచ్ఛాపురం నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1518 ఇళ్లతో, 5795 జనాభాతో 629 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2768, ఆడవారి సంఖ్య 3027. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 445 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 50. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 580503[1].పిన్ కోడ్: 532263.[2]
ఈ ఊరిని ఆలయాల గ్రామంగా చెపుతారు. ఇక్కడ ఎటు చూసినా దేవాలయాలే కనిపిస్తాయి. వీటికి తోడు అందమైన ప్రకృతి శోభలతో కూడిన ఈ ప్రదేశం అభివృద్ధి చేయగల మంచి పర్యాటక ప్రాంతం. ఇక్కడ ఆలయాలలో ప్రసిద్ధి చెందినవి శ్రీ కోటిలింగేశ్వర ఆలయం, జనార్ధనస్వామి ఆలయాలు. ప్రకృతి శోభతో అలరారే కవిటి అనే ప్రదేశం ఇక్కడ బహు ప్రసిద్ధం.