బరాక్ (హీబ్రూలో మెరుపు అని అర్థం) ఇజ్రాయిల్ అబివృద్ధి చేసిన భూమి నుండి గాల్లోకి ప్రయోగించే క్షిపణి. ఇది విమానాలు, నౌకావ్యతిరేక క్షిపణులు, మానవరహిత ఆకాశ వాహనాలకు వ్యతిరేకంగా నౌకలనుండి ప్రయోగించే క్షిపణి.
బరాక్ I | |
---|---|
రకం | తక్కువ పరిధి భూమి నుండి గాల్లోకి క్షిపణి |
అభివృద్ధి చేసిన దేశం | ఇజ్రాయిల్ |
ఉత్పత్తి చరిత్ర | |
తయారీదారు | Israel Aerospace Industries & Rafael Advanced Defense Systems |
విశిష్టతలు | |
బరువు | 98 కి.గ్రా.[1] |
పొడవు | 2.1 మీ.[1] |
వ్యాసం | 170 మి.మీ.[1] |
వార్‌హెడ్ | 22 కి.గ్రా.[1] శకలాలతో కూడిన వార్‌హెడ్ |
పేలుడు మెకానిజమ్ | ప్రాక్సిమిటీ ఫ్యూజు[1] |
వింగ్‌స్పాన్ | 685 మి.మీ.[1] |
ఆపరేషను పరిధి | 0.5-12 కి.మీ.[1] |
ఫ్లైటు ఎత్తు | 5.5 కి.మీ.[1] |
వేగం | మ్యాక్ 2.1 (720 m/s)[1] |
గైడెన్స్ వ్యవస్థ | Radar CLOS guidance |
లాంచి ప్లాట్‌ఫారం | Surface Ship |
స్థూలంగా
నౌకలకు అతి దగ్గరగా వచ్చిన దాడిని ఎదుర్కొనే ఆయుధ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, దాని స్థానంలో ఉపయోగించేందుకూ బరాక్-1 క్షిపణిని రూపొందించారు.ఈ క్షిపణులను 8 సెళ్ళ కంటెయినరులో ఉంచి, నిట్టనిలువుగా పైకి ప్రయోగిస్తారు. దీని C3I రాడారు వ్యవస్థ 360-డిగ్రీల కవరేజి ఇస్తుంది. నౌకకు 500 మీ. దగ్గరగా వచ్చిన శత్రు క్షిపణిని కూడా ఇది కూల్చగలదు. ఒక్కో బరాక్ వ్యవస్థ వెల $2.4 కోట్లు. విమానాలు, క్షిపణులతో పాటు అలల్ని రాసుకుంటూ దూసుకొచ్చే క్షిపణులను కూడ ఇది కూల్చగలదు.[2]
వివాదం
భారత్ బరాక్-1 కొనుగోలు అవినీతి, అధిక ధరల కారణంగా వివాదాస్పదమైంది. ఆరోపణలపై 2006 లో సీబీఐ విచారణ జరిపి అనేక మందిని అరెస్టు చేసింది. 2013 నాటికి అగు సాక్ష్యాల లేమి కారణంగా దర్యాప్తు అసంపూర్తిగానే ఉంది. కేసును మూసివేసే స్థాయికి చేరుకుంది..[2][3] 2013 డిసెంబరు 23 న రక్షణ కొనుగోళ్ళ మండలి రు. 880 కోట్ల విలువైన 262 బరాక్-1 క్షిపణుల కొనుగోలుకు ఆమోదముద్ర వేసింది.[4]
ఆపరేటర్లు
వాడుతున్న దేశాలు
- Chile
- భారతదేశం - శివాలిక్ తరగతి యుద్ధ నౌకలు, ఐ.ఎన్.ఎస్ విరాట్ విమాన వాహక నౌకతో సహా మొత్తం 14 యుద్ధనౌకలపై మోహరించింది.[4] దీన్ని భారత రెండవ విమాన వాహక నౌక, ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యపై కూడా మోహరించారు.[5]
- ఇజ్రాయిల్
- Singapore
మూలాలు
బయటి లింకులు
Wikiwand in your browser!
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.