బనిహాల్-ఖాజీగుండ్ రైల్వే సొరంగం
From Wikipedia, the free encyclopedia
బనిహాల్-ఖాజీగుండ్ రైల్వే సొరంగం 11.215 కిలోమీటర్లు (6.969 మై.) పొడవున్న రైల్వే సొరంగం. దీన్ని పీర్ పంజాల్ రైల్వే సొరంగం అని కూడా అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని మధ్య హిమాలయాలలోని పిర్ పంజాల్ శ్రేణిలో ఖాజిగుండ్ పట్టణానికి దక్షిణంగా ఉంది. ఇది జమ్మూ-బారాముల్లా రైలు మార్గంలో భాగం.
త్వరిత వాస్తవాలు అవలోకనం, వరుస ...
అవలోకనం | |
---|---|
వరుస | జమ్మూ తావి-ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా రైలు మార్గం |
ప్రదేశం | జమ్మూ కాశ్మీర్ |
స్థితి | పనిచేస్తోంది |
మొదలు | బనిహాల్ |
చివర | ఖాజీగుండ్ |
నిర్వహణ వివరాలు | |
ప్రారంభం | 2013 జూన్ |
యజమని | భారతీయ రైల్వేలు |
నిర్వాహకుడు | భారతీయ రైల్వేలు |
ట్రాఫిక్ | రైళ్ళు |
సాంకేతిక వివరాలు | |
లైన్ పొడవు | 11.21 కి.మీ. (6.97 మై.) |
ట్రాక్ల సం. | ఒకటే ట్రాకు |
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) (బ్రాడ్ గేజి) |
కార్యాచరణ వేగం | 75 km/h (47 mph) దాకా |
మూసివేయి
రైల్వే సొరంగం ఉత్తర ప్రవేశం 33.5617942°N 75.1988626°E / 33.5617942; 75.1988626 వద్ద, దక్షిణ ప్రవేశం 33.463203°N 75.193992°E / 33.463203; 75.193992. వద్ద ఉన్నాయి.