From Wikipedia, the free encyclopedia
తోకచుక్కపై దిగిన తొలి ల్యాండర్ ఫీలే ల్యాండర్. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) కు చెందిన రోసెట్టా వ్యోమనౌక 2004లో నింగిలోకి వెళ్లి పదేళ్లుగా ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కను వెంటాడుతూ 2014 సెప్టెంబరులో దాని సమీపంలోకి చేరి దాని చుట్టూ తిరుగుతూ నవంబరు 12, 2014 న ఈ ల్యాండర్ ను తోకచుక్కపై జారవిడిచింది. ఖగోళ చరిత్రలో తొలిసారిగా తోకచుక్కను చేరుకున్న ఈ ఘటన ఒక అద్భుత ఘట్టంగా ఆవిష్కృతం అయింది. ఈ ఘటనతో ఒక తోకచుక్కపై తొలిసారిగా వ్యోమనౌకను చేర్చిన ఘనతను ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈసా) సొంతం చేసుకుంది. 450 కోట్ల ఏళ్ల క్రితం సౌరకుటుంబం ఏర్పడినప్పటి పరిస్థితుల గురించి తెలుసుకొనేందుకు తోకచుక్కలపై అధ్యయనం సహకరిస్తుందని ఈసా సుమారు 160 కోట్ల డాలర్ల ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది.
మిషన్ రకం | తోకచుక్క లాండర్ |
---|---|
ఆపరేటర్ | యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ |
COSPAR ID | PHILAE |
మిషన్ వ్యవధి | 1–6 వారాలు (ప్రణాళిక) |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
లాంచ్ ద్రవ్యరాశి | 100 కి.గ్రా. (220 పౌ.)[1] |
పే లోడ్ ద్రవ్యరాశి | 21 కి.గ్రా. (46 పౌ.)[1] |
కొలతలు | 1 × 1 × 0.8 మీ. (3.3 × 3.3 × 2.6 అ.)[1] |
శక్తి | 3 ఆస్ట్రోనామికల్ యూనిట్ (AU) వద్ద 32 వాట్స్[2] |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 2 March 2004, 07:17 UTC |
రాకెట్ | అరైన్ 5G+ V-158 |
లాంచ్ సైట్ | గుయానా స్పేస్ సెంటర్ ELA-3 |
కాంట్రాక్టర్ | ఏరియానిస్పేస్ |
67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో ల్యాండర్ | |
ల్యాండింగ్ తేదీ | 12 నవంబరు 2014 15:35 UTC |
Instruments | |
APX Alpha: Alpha Particle X-ray Spectrometer ÇIVA: Comet nucleus Infrared and Visible Analyzer CONSERT COmet Nucleus Sounding Experiment by Radiowave Transmission COSAC: COmetary SAmpling and Composition MUPUS: Multi-Purpose Sensors for Surface and Subsurface Science PTOLEMY: gas chromatograph and medium resolution mass spectrometer ROLIS: ROsetta Lander Imaging System ROMAP: ROsetta lander MAgnetometer and Plasma monitor SD2: Sample and Distribution Device SESAME: Surface Electric Sounding and Acoustic Monitoring Experiment | |
ప్రతి ఆరున్నరేళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తున్న 67పీ తోకచుక్క సెకనుకు 18 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 గంటలకు ఒకసారి తనచుట్టూ తాను తిరుగుతోంది. 67పీ తోకచుక్కపై ల్యాండర్ ను దించడానికి రోసెట్టా వ్యోమనౌక దాని చుట్టూ తిరుగుతూనే తోకచుక్క సమీపానికి వెళ్లి ఈ ల్యాండర్ ను జారవిడిచింది. తోకచుక్కను చేరుకున్న ఈ ల్యాండర్ తోకచుక్కపై తన మరలను దించి గట్టిగా పట్టుకున్నది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.