బాలీవుడ్ నటి. ఆమె హిందీ సిసిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. From Wikipedia, the free encyclopedia
ప్రీతి జింటా (జననం 1975 జనవరి 31) [1] ప్రముఖ బాలీవుడ్ నటి. ఆమె హిందీ సిసిమాలతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించారు. క్రిమినల్ సైకాలజీ విభాగంలో డిగ్రీ చదివాకా, సినిమాల్లోకి వచ్చారు ప్రీతీ. 1998లో దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె అదే సంవత్సరం సోల్జర్ సినిమాలో కూడా నటించారు. దిల్ సే సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత 2000లో ఆమె నటించిన క్యా కెహనా సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఆమె తన పాత్రలతో బాలీవుడ్ హీరోయిన్ పాత్రలనే మార్చేశారు ఆమె. ఆమె వివిధ రకాలైన పాత్రలను పోషించడం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, ఎన్నో పురస్కారాలు పొందారు ప్రీతీ.
ప్రీతి జింటా | |
---|---|
జననం | సిమ్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం | 1975 జనవరి 31
విద్యాసంస్థ | సెయింట్ బెడేస్ కాలేజ్, సిమ్లా |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1998 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | జీన్ గూడెనఫ్ |
పిల్లలు | 2 |
సంతకం | |
2003లో ఆమె నటించిన కల్ హో న హో సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు ప్రీతి. అదే ఏడాది మరో బ్లాక్ బస్టర్ కోయీ మిల్ గయాలో నటించారు ఆమె. ఆ సంవత్సరానికిగానూ ఈ రెండు సినిమాలు అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన చిత్రాలుగా నిలవడం విశేషం.[2] 2004లో ఆమె నటించిన వీర్-జీరా సినిమాతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందారు ఆమె. ఆ తరువాత ఆమె నటించిన సలాం నమస్తే (2005), కభీ అల్విదా నా కెహనా (2006) సినిమాలు ఓవర్ సీస్ లో అతి పెద్ద హిట్లుగా నిలిచాయి.[3] ఈ భారీ విజయాలతో ప్రీతీ బాలీవుడ్ లో టాప్ కథానాయికగా మారారు.[4][5] 2008లో కెనడా చిత్రం హెవెన్ ఆన్ ఎర్త్ సినిమాతో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చిత్రంలో నటించారు ప్రీతీ. ఈ సినిమాలోని నటనకు చికాగో అంతర్జాతీ ఫిలిం ఫెస్టివల్ లో ఆమె సిల్వర్ హ్యూగో ఉత్తమ నటి పురస్కారం అందుకున్నారు.
నటే కాక, ప్రీతీ ఒక సమాజిక సేవకురాలు కాడా. ఆమె కొన్నాళ్ళు దక్షిణ ఆసియా బిబిసి న్యూస్ ఆన్ లైన్ లో కాలమ్ నిర్వహించారు. ప్రీతీ ఒక మంచి వ్యాఖ్యాత, స్టేజ్ పర్ఫార్మర్ కూడా. తన మాజీ ప్రియుడు నెస్ వాదియాతో కలసి పి.జెడ్.ఎన్.జెడ్ మీడియా అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు. భారత ప్రీమియర్ లీగ్ లోని కింగ్స్ XI పంజాబ్ టీంకు సహ యజమాని ప్రీతీ. ఏదైనా ఉన్నదున్నట్టు మాట్లాడే ప్రీతీ పేరు ఎక్కువగా మీడియాలో ఉంటూనే ఉండేవారు. ఆమె ఎన్నో వివాదాల్లోనూ చిక్కుకున్నారు.[6][7] 2003లో భారత్ షా కేసు సమయంలో భారత మాఫియా గురించి ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల కోర్టులో ఏకైక సాక్షిగా నిలిచి నిర్భయంగా తన సాక్ష్యం చెప్పారు ఆమె. ఈ సందర్భంగా ప్రీతీకి జాతీయ గాడ్ఫ్రే ఫిలిప్స్ బ్రేవరీ అవార్డు కూడా అందుకున్నారు.
1975 జనవరి 31న హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా జిల్లాలో రొహ్రు ప్రాంతంలో జన్మించారు ప్రీతీ.[1] ఆమె తండ్రి దుర్గానంద్ జింటా సైన్యంలో అధికారిగా పనిచేసేవారు.[8] ఆమె 13వ ఏట ఒక కార్ ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ ప్రమాదంలో ఆమె తల్లి నీల్ ప్రభ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆమె రెండేళ్ళు మంచం మీదే ఉన్నారు. తన తండ్రి మరణంతో అన్నీ ముందే గ్రహించి, పెద్దరికంగా ఆలోచించడం అలవాటు అవ్వటమే తన జీవితంలో మొదటి, అతిపెద్ద మలుపు అని అంటారు ఆమె.[9] ఆమెకు ఒక అన్నయ్య దీపాంకర్, ఒక తమ్ముడు మనీష్. ప్రస్తుతం దీపాంకర్ భారత సైన్యంలో కమిషన్డ్ అధికారిగా పనిచేస్తుండగా, మనీష్ కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు.[10]
ప్రీతీ చిన్నప్పుడు అబ్బాయిలాగానే పెరిగాననీ, అయితే తండ్రిది సైన్యంలో ఉద్యోగం కాబట్టీ ఇంట్లో చాలా క్రమశిక్షణగా ఉండేవారనీ, పిల్లలు కూడా క్రమశిక్షణగానే ఉండేలా జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతారు ఆమె.[11] సిమ్లాలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో హాస్టల్ లో చదువుకున్నారు. హాస్టల్లో కుటుంబానికి దూరంగా ఉండటం కష్టంగానే ఉన్నా, తనకంటూ మంచి స్నేహితులను సంపాదించుకోవడానికి మంచి అవకాశం కుదిరిందని వివరిస్తారు ప్రీతీ.[8][12] చదువుకునేప్పట్నుంచే సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న ఆమె విలియం షేక్స్పియర్ రచనలను ఎక్కువగా చదివేవారు.[8] బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా బాగా రాణించేవారు ఆమె.[9]
సనవర్ లోని ది లారెన్స్ పాఠశాలలో చదువుకున్న తరువాత సిమ్లాలోని సెయింట్ బెడె కళాశాల నుండి ఇంగ్లీష్ ఆనర్స్ లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఆ తరువాత సైకాలజీలో కోర్సులో చేరారు ప్రీతీ.[13] క్రిమినల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఆమె తరువాత మోడలింగ్ చేయడం మొదలుపెట్టారు.[8] 1996లో ఒక స్నేహితుల పుట్టినరోజు పార్టీలో ఆమెను కలసిన ఒక దర్శకుడు మోడలింగ్ లోకి రమ్మని సలహా ఇచ్చారు. ఆ తరువాత ఆమె మొదటిసారి నటించిన పెర్క్ ప్రకటన పెద్ద హిట్ అయింది.[8] తర్వాత ఆమె లిరిల్ సబ్బు ప్రకటనలోనూ కనిపించారు.[9][13]
1997లో వేరే ఆడిషన్ కు వెళ్ళిన ప్రీతీని దర్శకుడు శేఖర్ కపూర్ చూసి ఆడిషన్స్ నిర్వహించి ఆమెను నటిని అవ్వమని సలహా ఇచ్చి, తన సినిమా తర రం పంలో నటించేందుకు ఒప్పించారు. హృతిక్ రోషన్ తో కలసి నటించిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత ఆమెను దర్శకుడు మణిరత్నం దిల్ సే సినిమాలోకి తీసుకున్నారు. అలా దిల్ సే సినిమాతో తెరంగేట్రం చేశారు ఆమె.[14] సినిమాల్లో నటించిడం మొదలు పెట్టిన కొత్తల్లో తెల్లచీర కట్టుకుని, వానలో డాన్సులు చేస్తూ ఉంటావంటూ వెక్కిరించారట. వారి నుండి ప్రేరణ పొంది వివిధ రకాలైన సినిమాల్లో నటించానని చెబుతారు ప్రీతీ.
ఆ తరువాత ఆమె నటించిన క్యా కెహనా సినిమా 2000 వరకు విడుదల కాలేదు. అలాగే తర్వాత చేసిన సోల్జర్ సినిమా విడదల కూడా ఆలస్యమవడంతో, షారుఖ్ ఖాన్, మనీషా కోయిరాలతో కలసి చేసిన దిల్ సే సినిమా మొదట విడుదలైంది. ఈ సినిమాలో ఆమె కేవలం 20 నిమిషాల పాత్ర. కానీ ఆమె నటన మాత్రం ఎన్నో ప్రశంసలు పొందింది. ఈ సినిమాతో ఆమె ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకున్నారు. ప్రధాన కథానాయికగా ఆమె మొదటి చిత్రం సోల్జర్ (1998) మంచి విజయం సాధించింది.[15].దిల్ సే, సోల్జర్ రెండు సినిమాలకూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం లభించింది.
ఆ తరువాత ప్రీతీ తెలుగులో వెంకటేష్ సరసన ప్రేమంటే ఇదేరా (1998), మహేష్ బాబుతో కలసి రాజకుమారుడు (1999) సినిమాల్లో నటించారు. హిందీలో అక్షయ్ కుమార్ తో సంఘర్ష్ సినిమాలో హంతకుడైన హీరోను ప్రేమించే సిఐడి ఆఫీసర్ పాత్రలో నటించారు ఆమె. ఆమె నటనకు మంచి పేరొచ్చినా, సినిమా మాత్రం ఆడలేదు.[16][17][9]
2000లో క్యా కెహనా సినిమాతో విజయం అందుకున్నారు ప్రీతీ.[18] ఈ సినిమాలో టీనేజ్ లోనే తల్లి అయిన పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు పొందారు ఆమె.[9][19] ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకున్నారు ప్రీతీ.[19]
ఆ తరువాత సంవత్సరం సంజయ్ దత్, హృతిక్ రోషన్ లతో కలసి మిషన్ కాశ్మీర్ సినిమాలో నటించారు ప్రీతీ. భారత్-పాక్ గొడవల్లో కాశ్మీర్ లోయ పరిస్థితిపై వచ్చిన ఈ సినిమాలో టివి రిపోర్టర్ గా నటించారు ఆమె. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కావడమే కాక, ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.[20][21]
ఆమె షూటింగ్ లేనప్పుడు ఎక్కువగా తన స్వంత ఊరు సిమ్లాలోనే గడిపేవారు. 2006లో తన కుటుంబంతో పాటు ముంబైకు మారిపోయారు ఆమె.[22] తన మతం ఏదో ఎప్పుడూ చెప్పని ప్రీతీ ఒక ఇంటర్వ్యూలో మాత్రం తాను దేవుడి కంటే కర్మ ఫలితాలనే ఎక్కువగా నమ్ముతాననీ, గుడికి వెళ్ళి పూజలు చేస్తేనే భక్తి కాదు, అది వ్యక్తిగతమైనది అని వివరించారు.[23] 2004లో కొలొంబోలోని ఒక కచేరీ సమయంలో జరిగిన పేలుడు ప్రమాదంలోనూ, హిందూ మహాసముద్రంలో వచ్చిన భూకంపం సమయంలోనూ రెండుసార్లూ తృటిలో చావును తప్పించుకున్నారు ప్రీతీ.
29 ఫిబ్రవరి 2016న లాస్ ఏంజెల్స్ లోని ఒక వ్యక్తిగత వేడుకల్లో తన అమెరికన్ భాగస్వామి జీన్ గూడెనఫ్ ను వివాహం చేసుకున్నరు. ఆయన యుఎస్ కు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సంస్థలో ఫైనాన్స్ ఉపాధ్యక్షునిగా పనిచేస్తున్నారు.[24] వీరికి సరోగసి విధానంలో కవల పిల్లలు ఉన్నారు.[25]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.