![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5d/Prabhudeva_at_Wanted_press_meet.jpg/640px-Prabhudeva_at_Wanted_press_meet.jpg&w=640&q=50)
ప్రభుదేవా
నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
ప్రభుదేవా ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు, నటుడు, దర్శకుడు. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఇరవై ఐదు సంవత్సరాల పైగా సినీ జీవితంలో ప్రభుదేవా పలు రకాలైన నృత్య రీతులకు రూపకల్పన చేశాడు, ప్రదర్శించాడు. ఉత్తమ నృత్య దర్శకుడిగా రెండు జాతీయ సినీ పురస్కారాలను అందుకున్నాడు.[1] అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.[2] తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం చేయనారంభించాడు. తర్వాత నటుడిగా మారి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా, సహనటుడిగా కనిపించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) చిత్రంతో దర్శకుడిగా మారి పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే.
త్వరిత వాస్తవాలు ప్రభుదేవా, జననం ...
ప్రభుదేవా | |
---|---|
![]() | |
జననం | ప్రభుదేవా సుందరం (1973-04-03) 1973 ఏప్రిల్ 3 (వయసు 51) |
వృత్తి | నటుడు, దర్శకుడు, నృత్య కళాకారుడు, నృత్య కళా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1988 - ప్రస్తుతం |
బిరుదు | ఇండియన్ మైఖేల్ జాక్సన్ |
జీవిత భాగస్వామి | రామలత, (1995-2010) |
తల్లిదండ్రులు | సుందరం మాస్టర్ |
బంధువులు | రాజు సుందరం (సోదరుడు) నాగేంద్ర ప్రసాద్ (సోదరుడు) |
మూసివేయి