ప్రపంచంలోనే అతి పెద్ద గొడ్డలి
From Wikipedia, the free encyclopedia
ప్రపంచంలోనే అతి పెద్ద గొడ్డలి (World's largest axe) నాకేవిక్, న్యూ బ్రున్స్విక్, కెనడాలో ఉంది.[1] ఈ గొడ్డలి 15 మీటర్ల (49 అడుగులు) పొడవు, 55 టన్నుల బరువు ఉంటుంది. గొడ్డలి తల 7 మీటర్ల (23 అడుగులు) వెడల్పు ఉంటుంది. దీని కాంక్రీటు స్టంప్ వ్యాసం 10 మీటర్లు (33 అడుగులు). ఇది 1991లో కెనడాలోని వుడ్స్టాక్ పట్టణంలోని ఒక కంపెనీచే రూపొందించబడి నిర్మించబడింది. ఈ గొడ్డలి తల భాగంలో దీని ప్రారంభ సమయ శిలాఫలకం ఇమడ్చబడివుంది.[2]
ఈ భారీ గొడ్డలి భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో అడవుల ప్రాముఖ్యతను సూచిస్తుంది.[3]