దక్షిణ అమెరికా దేశం From Wikipedia, the free encyclopedia
పెరూ (ఆంగ్లం Perú), ( స్పానిష్ : పెరూ ; క్వెచువా : పెరు లేదా Piruw ; ( ఐమారా : పిర్యూ) అధికారికంగా పెరూ రిపబ్లిక్ ( స్పానిష్ : రిపబ్లికా డెల్ పెరూ ") దక్షిణ అమెరికా వాయువ్యభాగంలో ఉన్న ఒక దేశం. పెరూ దక్షిణ సరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం, ఆగ్నేయ సరిహద్దులో బొలీవియా, తూర్పు సరిహద్దులో బ్రెజిల్, ఉత్తర సరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి. పెరూ వైవిధ్యమైన భౌగోళికస్థితి, పర్యావరణం కలిగి ఉంటుంది. పశ్చిమంలో పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న శుష్క మైదానాలు ఉన్నాయి. ఉత్తరం నుండి ఆగ్నేయం వరకు ఆండీస్ పర్వతశ్రేణులు విస్తరించి ఉన్నాయి. తూర్పున ఉన్న అమెజాన్ నదీముఖద్వారంలో ఉష్ణమండల వర్షారణ్యాలు విస్తరించి ఉన్నాయి.
República del Perú (in Spanish) Republic of Peru |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Lima 12°2.6′S 77°1.7′W | |||||
అధికార భాషలు | Spanish | |||||
ప్రజానామము | Peruvian | |||||
ప్రభుత్వం | Unitary presidential republic | |||||
- | President | Ollanta Humala | ||||
- | Prime Minister | Pedro Cateriano | ||||
Independence | from Spain | |||||
- | Declared | July 28, 1821 | ||||
- | Consolidated | December 9, 1824 | ||||
- | Recognized | August 14, 1879 | ||||
- | జలాలు (%) | 0.41 | ||||
జనాభా | ||||||
- | 2010 అంచనా | 29,496,000 (40th) | ||||
- | 2007 జన గణన | 28,220,764 | ||||
జీడీపీ (PPP) | 2011 అంచనా | |||||
- | మొత్తం | $299.648 billion[1] | ||||
- | తలసరి | $9,985[1] | ||||
జీడీపీ (nominal) | 2011 అంచనా | |||||
- | మొత్తం | $167.846 billion[1] | ||||
- | తలసరి | $5,593[1] | ||||
జినీ? (2010) | ▼ 0.46 (high) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2010) | 0.723[2] (high) (63rd) | |||||
కరెన్సీ | Nuevo Sol (PEN ) |
|||||
కాలాంశం | PET (UTC-5) | |||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .pe | |||||
కాలింగ్ కోడ్ | ++51 | |||||
1 | Quechua, Aymara and other indigenous languages are co-official in the areas where they are predominant. |
కొలంబియన్ పూర్వ అమెరికా ఖండాలలో అతిపెద్ద దేశం. అత్యాధునికమైన ఇంకా సామ్రాజ్యంలో క్రీ.పూ 32వ శతాబ్ధంలో పెరూలో అమెరికా ఖండాలలో పురాతన సంస్కృతులలో ఒకటి అయిన ఉత్తర చికో నాగరికత విస్తరించి ఉంది. 16 వ శతాబ్దంలో స్పానిష్ సామ్రాజ్యం ఈప్రాంతాన్ని గెలుచుకుని తన దక్షిణ అమెరికా కాలనీగా చేసుకుని "లిమా"ను రాజధానిగా చేసుకుని వైస్రాయల్టీ ఏర్పాటు చేసింది. 1821 లో పెరూ స్వాతంత్ర్యం సాధించిన తరువాత డీ శాన్ మార్ట్న్, సైమన్ బొలివర్ నాయకత్వంలో సైనిక తిరుబాటు, అయాకుచో మోసపూరిత యుద్ధం తరువాత 1824 వరకు పెరూ స్వాతంత్ర్యం సురక్షితంగా ఉంది. తరువాత సంవత్సరాలలో పెరూ ఆర్ధిక, రాజకీయ స్థిరత్వం అనుభవించింది. స్వల్పకాలం కొనసాగిన స్థిరత్వం చిలీతో సంభవించిన పసిఫిక్ యుద్ధంకారణంగా ముగింపుకు వచ్చింది. 20వ శతాబ్ధం అంతా పెరూ సరిహద్దు వివాదాలు, తిరుగుబాట్లు, సాంఘిక అశాంతి, అంతర్గత యుద్ధాల వంటి సమస్యలను ఎదుర్కొన్నది.
పెరూ ప్రజాస్వామ్య గణతంత్రం 25 ప్రాంతాలుగా విభజించబడింది. పెరూ అత్యున్నత మానవ అభివృద్ధి సూచిక కలిగి ఉంది. 25.8% ప్రజలు పేదరికం అనుభవిస్తున్న అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఆర్థిక కార్యకలాపాలలో మైనింగ్, తయారీ రంగం, వ్యవసాయం, చేపలు పట్టడం ప్రధానంగా ఉన్నాయి. 2015 గణాంకాల ఆధారంగా పెరువియన్ జనాభా 31.2 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీరిలో అమెరిన్డియన్లు, ఐరోపియన్లు, ఆఫ్రికన్లు, ఆసియన్లు ఉన్నారు. ప్రధానంగా మాట్లాడే భాష స్పానిష్. అయినప్పటికీ గణనీయమైన సంఖ్యలో పెరువియన్లు క్వెచువా లేదా ఇతర స్థానిక భాషలను మాట్లాడతారు. సాంస్కృతిక సంప్రదాయాల మిశ్రమం ఫలితం కళ, వంటకాలు, సాహిత్యం, సంగీతం వంటి రంగాలను ప్రభావితం చేస్తూ వ్యక్తీకరణలో విస్తృత వైవిధ్యం కలిగి ఉంది.
పెరూ పేరుకు "బిరూ" అనే పదం మూలంగా ఉంటుందని భావిస్తున్నారు. 16వ శతాబ్ధంలో బిరూ అనే ప్రాంతీయ పాలకుడు " బే ఆఫ్ శాన్ మైక్వెల్ " పనామా సముద్రతీరంలో నివసించాడు.[3] 1522లో ఆయన రాజ్యంలో స్పెయిన్ అన్వేషకులు ప్రవేశించారు.[4] ఫ్రాంసిస్కో పిజారి ఈ ప్రాంతాన్ని సందర్శించి దీనిని బర్డ్ లేక పెరూ అని పేర్కొన్నాడు.[5] ఇంకా రాకుమారుడు, అన్వేషకుని కుమారుడు చరిత్రకారుడు " ఇంకా గార్సియాస్ డి లా వేగా " మరొక విభిన్న కథనాన్ని అందించాడు. గవర్నర్ పెడ్రో అరియాస్ డి ఆవియా కొరకు అన్వేషణ కార్యక్రమంలో పాల్గొన్న నౌకను స్వాధీనం చేసుకున్న స్థానిక ఇండియన్ల మద్య అనుసంధాన భాష కొరవడినందువలన ఏర్పడ్డ అపోహ కారణంగా 'బిర్యు' అనే పేరు వచ్చిందని ఆయన అన్నారు.[6] 1529లో స్పానిష్ సామ్రాజ్యం ఈ ప్రాంతానికి అధికారికంగా " కాపిట్యులాక్షన్ డీ టొలెడో " అని నామకరణం చేసారు. ఇది కొత్తగా రూపొందించిన ఇంకా సామ్రాజ్యంలో ఒక భూభాగంగా ఉండేది.[7] స్పానిష్ పాలనలో దేశానికి " వైశ్రాయిలిటీ ఆఫ్ పెరూ " అని పేరు వచ్చింది. పెరూ స్వాతంత్రసమరం ద్వారా ఇది స్వతత్రదేశం అయిన తరువాత ఇది " రిపబ్లిక్ ఆఫ్ పెరూ " అయింది.
పెరూ ప్రాంతంలో మానవుల ఉనికి క్రీ.పూ.9,000 సంవత్సరాలకు పూర్వం ఆరంభం అయిందనడానికి ఆధారాలు లభించాయి.[8] ఆండెన్ సముదాయం జీవనవిధానంలో వ్యవసాయం, నీటిపారుదల , సోపానవ్యవసాయం వంటి పద్ధతులను ఉపయోగించి ఒంటెల పెంపకం, చేపల పెంపకం కూడా ముఖ్యమైనవి. ఈ సంఘాలలో విఫణి , ధనం లేనికారణంగా వీరికి వస్తుమార్పిడి విధానం మీద ఆధారపడింది.[9] పెరూలో ఉన్న పురాతన సంక్లిష్ట సమాజం " నోర్టే చికో నాగరికత " పసిఫిక్ మహాసముద్రం తీరం వెంట క్రీ.పూ. 3,000 - 1,800 మధ్యకాలం వృద్ధి చెందింది.[10] ఈ ప్రారంభ పరిణామాలు తరువాత భవననిర్మాణాల సంస్కృతులు అధికంగా పెరూ అంతటా తీరప్రాంత , అండీన్ ప్రాంతాల చుట్టూ అభివృద్ధి చెందాయి. కప్సనిక్ సంస్కృతి క్రీ.పూ 1000 నుండి 200 వరకు వృద్ధిచెందింది.[11] ప్రస్తుత పెరూ పసిఫిక్ సముద్రతీరం ప్రారంభంలో ఇంకన్ సంస్కృతికి ఉదాహరణగా ఉండేది. చావిన్ డి హువాన్తార్లో వారి మతపరమైన కేంద్రంగా క్రీ.పూ.1500 నుండి 300 BC వరకు అభివృద్ధి చెందింది. చావిన్ సంస్కృతి బహుశా ఒక రాజకీయసముదాయంలా కాక మతపరమైన సముదాయంగా ఉండేదని భావిస్తున్నారు.[12] చువాన్ సంస్కృతి క్షీణించిన తరువాత క్రిస్టియన్ సహస్రాబ్దం ప్రారంభం తరువాత వేల సంవత్సరాలలో సముద్రతీరం , పర్వత ప్రాంతాలలో ప్రాంతీయ , ప్రత్యేక సంస్కృతుల వరుస వృద్ధి , పతనం సంభవించాయి. ఈ తీరంలో " పారాకాస్ సంస్కృతి, నజ్కా సంస్కృతి, వర్రి సంస్కృతి, అత్యుత్తమమైన చిమ్యు సంస్కృతి నాగరికతలు మోచికా కల్చర్ వృద్ధిచెందాయి. సా.శ.తొలి సహస్రాబ్దిలో వారి శిఖరాగ్రం చేరుకున్న చేరుకున్న మొచికా నీటిపారుదల వ్యవస్థకు ప్రసిద్ధి చెందింది. వారు శుష్క భూభాగంలో ఎరువులను ఉపయోగించి వ్యవసాయం అభివృద్ధి చేసారు, అధునాతన సిరామిక్ మట్టిపాత్రలు, గంభీరమైన భవనాలు, తెలివైన లోహపు పనిముట్లు పెంపొందించింది జీవనం సాగించారు. చిమూప్రజలు ఇంకా నాగరికత కంటే ముందుగా గొప్ప భవననిర్మాతలుగా ప్రసిద్ధి చెందారు. వారు ఉత్తర పెరూ, దక్షిణ ఈక్వెడార్ తీరం వెంట చెల్లాచెదురుగా ఉన్న నగరాల చిమూ ప్రజలప్రతిభకు నిదర్శనంగా ఉన్నాయి. చిమ్ సుమారు సా.శ. 1150 నుండి 1450 వరకు వృద్ధిచెందింది. వారి రాజధాని " చాన్ చాన్ " (ప్రస్తుత ట్రుజిల్లో, పెరు) వెలుపల ఉంది. పెరూలో, బొలీవియా లలోని ప్రాంతాలలో ఉన్న టిటికాకా సరోవర సమీపంలో " తివనాకు సంస్కృతి ", ప్రస్తుత " అయకుచో " సమీపంలో వారి సంస్కృతి " వృద్ధి చెందాయి. వీరు సరోవరప్రాంతంలో క్రీ.పూ. 500 , 1000 మధ్య పెద్ద పట్టణ స్థావరాలు , విస్తృతమైన రాజ్య వ్యవస్థలను అభివృద్ధి చేసారు.[13]
15 వ శతాబ్దంలో ఇంకాలు ఒక శక్తివంతమైన రాజ్యంగా ఉద్భవించింది. ఒక శతాబ్దం వ్యవధిలో వీరు కుస్కో రాజధానిగా చేసుకుని కొలంబియా కొలంబియన్ పూర్వ అమెరికాలో అతిపెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించారు.[14] కుస్కో లోని ఇంకాలు మొదట చిన్న చిన్న సంప్రదాయ సమూహాలుగా ఉన్న ప్రజలు సంఘటితంగా క్యుచూవా ప్రజలుగా పిలువబడ్డారు. క్రమంగా 13 శతాబ్దం ప్రారంభంలో వారు విస్తరిస్తూ పొరుగువారిని తమలో విలీనం చేసుకోవడం ప్రారంభించారు. పదిహేనవ శతాబ్దం మధ్యభాగం వరకు ఇంకా విస్తరణ నెమ్మదిగా జరిగింది.తరువాత మహాచక్రవర్తి పచాకుటి పాలనలో దిగ్విజయయాత్ర వేగవతం అయింది. ఆ సమయంలో విజయం సాధించిన పేస్ ముఖ్యంగా గొప్ప వేగవంతమైంది. అతని పాలనలో , అతని కుమారుడు టోపా ఇన్కా యుపాంకీ కాలంలో ఇంకాస్ పాలనలో 9 నుండి 16 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్న ఆండీ ప్రాంతంలో అధికభాగాన్ని వారి నియంత్రణలోకి తీసుకువచ్చారు. పచాకుటి తన సుదూర సామ్రాజ్యాన్ని పరిపాలించటానికి ఒక విస్తారమైన నియమావళిని కూడా ప్రవేశపెట్టాడు. సూర్యదేవుని దేవుడు ఆరాధ్యదైవంగా పూర్తిస్థాయి భౌగోళిక , ఆధ్యాత్మిక అధికారాన్ని సమకూర్చుకున్నాడు. అతను ఘనంగా పునర్నిర్మించిన కుస్కో నుండి పాలన సాగించాడు.[15] 1438 నుండి 1533 వరకు అగాస్ శాంతిభరిత సమైక్యత నుండి పశ్చిమ దక్షిణ అమెరికాలో అధిక భాగాన్ని చేర్చడానికి అనేక రకాల పద్ధతులను ఉపయోగించి దక్షిణ కొలంబియా నుండి " ఆండీస్ పర్వత శ్రేణులు " చిలీ పశ్చిమప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం , తూర్పున అమెజాన్ వర్షారణ్యం మధ్య విస్తరించింది. సామ్రాజ్యం అధికారిక భాష " క్వెచువా భాష " , వందలాది స్థానిక భాషలు , మాండలికాలు వాడుకలో ఉన్నాయి. ఇంకా వారి సామ్రాజ్యాన్ని "తవాన్తింసుయు"గా పిలిచేవారు.దీనిని "నాలుగు ప్రాంతాలు" లేదా "ది ఫోర్ యునైటెడ్ ప్రొవిన్స్స్" అని అర్ధం. సామ్రాజ్యంలో అనేక స్థానిక ప్రార్థనలు కొనసాగాయి. వాటిలో హువాకా ఎక్కువ మందికి పవిత్రమైన ఆరాధనాప్రదేశంగా ఉండెది. అయినప్పటికీ ఇంకా నాయకత్వం సూర్య భగవానుడి ఆరాధనను ప్రోత్సహించింది. " పచమమా " వంటి ఇతర సంప్రదాయాల మీద సూర్యారాధన ఆధిక్యత కలిగి ఉండేది.[16] ఇంకాలు సపా ఇంకాను రాజుగా భావిస్తుంటారు. రాజును ఇంకా ప్రజలు సూర్యుని కుమారునిగా భావిస్తారు.[17]
ఇంకా హువాన కాపాక్ మరణం తరువాత ప్రారంభం అయిన అంతర్యుద్ధంలో అతహువల్పా తన పాత అర్ధ-సోదరుడు " హుస్కాకర్"ను ఓడించి " సాప ఇంకా " ఇంకాల చివరి చక్రవర్తి అయ్యాడు. 1532 డిసెంబరులో " కాన్క్విసిడర్ " పార్టీకి చెందిన " ఫ్రాన్సిస్కో పిజారో " నాయకత్వంలో " కజమర్కా యుద్ధంలో " ఇకా చక్రవర్తి అతహువల్పాని ఓడించి ఇంకా సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకా సామ్రాజ్యం స్పానిష్ విజయం " అమెరికాలో స్పానిష్ వలసల " అతి ముఖ్యమైన చారిత్రాత్మక సంఘటనలలో ఒకటిగా గుర్తించబడుతుంది. అనేక సంవత్సరాల ప్రాథమిక అన్వేషణ , సైనిక విభేదాలు తరువాత దశాబ్దాలుగా పోరాటాల తరువాత అమెరికాలలో స్పానిష్ కాలనీ స్థాపన సాధ్యం అయింది. స్పానిష్ విజయం , లిమా రాజధానిగా " వైస్రాయల్టీ ఆఫ్ పెరూ " ఏర్పాటుతో ముగింపుకు వచ్చింది. దీనిని "ది సిటీ ఆఫ్ కింగ్స్"గా పిలిచేవారు. ఇంకా సామ్రాజ్యం మీద విజయం తరువాత ఏర్పాటు చేయబడిన వైస్రాయిలిటీ అంతా అమెరిండియన్ నిరోధకత అణిచివేసేందుకు స్పానిష్ ప్రయత్నాలలో భాగంగా అమెజాన్ బేసిన్ వైపున జరిపిన దాడులకు దారితీసింది. స్పెయిన్ దేశస్థులు 1572 లో " విలాపంబ ( పెరులో) నియో-ఇన్కా రాజ్యాన్ని నిర్మూలించినప్పుడు చివరి ఇంకా నిరోధం అణిచివేయబడింది.స్పెయిన్ ద్వారా ప్రవేశపెట్టిన దోపిడీ సామాజిక ఆర్థిక మార్పు, అంటురోగ వ్యాధుల కారణంగా స్థానిక జనాభా నాటకీయంగా కుప్పకూలింది.[18] 1570 లలో " వైస్రాయి ఫ్రాన్సిస్కో డి టోలెడో " బంగారు, వెండి గనులు ప్రధాన ఆర్థిక వనరుగా ఉంటుందని గ్రహించి అమెరిన్డియన్ మిటా ఇంకాలను బలవంతంగా కార్మిక శక్తిగా చేసి పనులు ప్రారంభించాడు.[19] పోటోసి (ప్రస్తుత బొలీవియా), హున్కావెలికాలోని ప్రాంతాలలో బృహత్తరమైన వెండి, బంగారు నిక్షేపాలను కనుగొనడంతో వైస్రాయిలిటీ ఖనిజ వనరుల ప్రధానకేంద్రంగా వృద్ధి చెందింది. పెరువియన్ బులియన్ స్పానిష్ క్రౌన్ కోసం ఆదాయాన్ని అందించింది, యూరోప్, ఫిలిప్పీన్స్ వరకు విస్తరించిన ఒక సంక్లిష్ట వాణిజ్య నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది.[20] శ్రామిక శక్తి కొరత కారణంగా కార్మిక జనాభాకు ఆఫ్రికన్ బానిసలు చేర్చబడ్డారు. వలసరాజ్య పరిపాలనా యంత్రాంగాన్ని, అధికారాన్ని విస్తరించడం ఆర్థిక పునర్వ్యవస్థీకరణకు సమాంతరంగా సాగాయి. యురేపియన్ల విజయంతో దక్షిణ అమెరికాలో క్రైస్తవ మతం వ్యాప్తి ప్రారంభమైంది. ఎక్కువమంది ప్రజలు బలవంతంగా కాథలిక్కులుగా మారారు. వారు జనాభాను క్రైస్తవానికి మార్చేందుకు ఒక తరం మాత్రమే తీసుకున్నారు. వారు ప్రతి నగరంలో చర్చిలను నిర్మించారు, కుస్కో నగరంలోని కొరికిచా వంటి చర్చిలతో పాటు కొన్ని దేవాలయాలను భర్తీ చేశారు. కొత్తగా మార్పిడి చేయబడిన కాథలిక్కులు ఇతర మతాలు లేదా నమ్మకాలకు విరుద్ధంగా లేరని నిర్ధారించడానికి చర్చి నియమించిన సిబ్బంధి హింసను ఉపయోగించింది.పెరూవియన్ కాథలిక్కులు అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో కనిపించే సమన్వయవాదాన్ని అనుసరించాయి దీనిలో మతపరమైన ఆచారాలు క్రైస్తవ వేడుకలకి విలీనం చేయబడ్డాయి.[21] స్థానికుల సంస్కృతిని దిగజార్చి వారిని స్పెయిన్ కాలనీ సంస్కృతిలో చేర్చడానికి చర్చి ప్రధానపాత్ర పోషించింది.18వ శతాబ్ధానికి వెండి, బంగారం నిల్వలు క్షీణించడం, ఆర్థికవనరుల వైవిధ్యత రాజరిక ఆదాయం పతనానినికి దారితీసింది.[22] ప్రతిస్పందనగా " బౌర్బన్ సంస్కరణలు " రూపొందించి వైశ్రాయిల్టీని విభజించి అనేక నూతన పన్నులను విధించింది.[23] కొత్త చట్టాలను రూపొందించి " టుపాక్ అమరు 2", ఇతర తిరుగుబాట్లు అణిచివేయబడ్డాయి. [24] ఈ, ఇతర మార్పుల ఫలితంగా స్పెయిన్ దేశస్థులు, స్పెయిన్ క్రియోల్ వారసులు భూమి మీద నియంత్రణను ఏకచ్ఛత్రాధిపత్యం చేయడానికి వచ్చారు.భారీసంఖ్యలో ఉన్న స్థానికప్రజలు వదిలివేసిన సారవంతమైన భూభాగాలను క్రియోల్ ప్రజలు ఆక్రమించుకున్నారు. అయినప్పటికీ బ్రెజిల్ భూభాగాలలో మెరిడియన్ అంతటా పోర్చుగీసు విస్తరణను స్పెయిన్ నిరోధించలేదు. " ట్రెడీ ఆఫ్ ట్రెడీసిలాస్ " ఒప్పందాన్ని అర్ధరహితం చేస్తూ 1580, 1640 మధ్యకాలంలో స్పెయిన్ పోర్చుగల్‌ను నియంత్రించింది. స్పెయిన్‌తో పరస్పర సమాచారవినియోగం, వాణిజ్యం తగ్గించాల్సిన అవసరం పెరూ వైస్రాయల్టీని విభజించి కొత్తగా "న్యూ గ్రెనడా ", "రియో డి లా ప్లాటా" వైస్రాయితాలిటీల ఏర్పాటుకు దారితీసింది. ఇది లిమి రాజధానిగా వైస్రాయిలిటీ అధికారం ప్రాముఖ్యత, అధికారాన్ని తగ్గించింది, లాభదాయకమైన ఆన్డియన్ వ్యాపారాన్ని బ్యూనస్ ఎయిర్స్, బొగోటాకు మార్చబడింది. మైనింగ్, వస్త్ర ఉత్పత్తి పతనం పెరూ వైస్రాయల్టీ ప్రగతిని క్షీణతను వేగవంతం చేసింది.చివరకు 19 వ శతాబ్దం ప్రారంభంలో జాతీయ స్వాతంత్ర్య ఉద్యమాలచే సవాలు చేసినప్పుడు స్పానిష్ సామ్రాజ్యంలోని అత్యధిక భూభాగాలను కోల్పోవడంతో సహా వైస్రాయితీ రద్దు ఐంది. ఈ ఉద్యమాలు దక్షిణ అమెరికాలోని పలు ఆధునిక దేశాలు రూపొందించడానికి కారణంగా మారింది. ఈ సమయంలో పెరూ వైస్రాయల్టీని ఏర్పాటు చేయబడింది.[25] ఆక్రమణ, కాలనీ పాలన స్పానిష్ ఆక్రమణకు ముందు పెరూ భూభాగంలో లేని మిశ్రితసంస్కృతి, పంప్రదాయాల రూపొందించింది. అనేక ఇంకా సంప్రదాయాలు తుడిచిపెట్టుకుని పోవడం లేక కరిగించబడడంతో క్రొత్త ఆచారాలు, సంప్రదాయాలు, విజ్ఞానం చేర్చబడ్డాయి. ఇది ఒక గొప్ప మిశ్రమ పెరువియన్ సంస్కృతిని సృష్టించింది.[21]
19 వ శతాబ్దం ప్రారంభంలో దక్షిణ అమెరికాలో స్వాతంత్ర్య యుద్ధాలు అధికరించినప్పటికీ పెరూ మాత్రం బలమైన రాజరికవ్యవస్థగా మిగిలింది. స్పానిష్ రాచరికానికి విశ్వాసపాత్రంగా ఉంది. " జోస్ డి శాన్ మార్టిన్ ", " సిమోన్ బొలివర్ " సైనికతిరుగుబాటు తరువాత మాత్రమే పెరూ స్వాత్రదేశంగా అవతరించింది.
యూరోప్‌లో స్పెయిన్ శక్తి క్షీణించడం, ఆర్థిక సంక్షోభాలు, ఉత్తర అమెరికాలో స్వతంత్ర పోరాటాలు, స్థానిక తిరుగుబాట్లు అన్ని " క్రియోల్ " ప్రజలలో విమోచన ఆలోచనలు అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి దోహదపడ్డాయి. దక్షిణ అమెరికాలో. అయినప్పటికీ పెరూలోని క్రియోల్ ప్రజలు విశేషాధికాలతో సామ్రాజ్యాధిపత్యం ప్రత్యేక హక్కులను అనుభవిస్తూ స్పానిష్ కిరీటకు విశ్వాసపాత్రంగా ఉంది. అర్జెంటీనాలో స్వేచ్ఛా ఉద్యమం ప్రారంభమైంది. సైనికప్రభుత్వాలు స్వయంప్రతిపత్తితో స్పానిష్ ప్రభుత్వంన్ని ధిక్కరించిన కారణంగా కాలనీల్లో స్పానిష్ ప్రభుత్వం తమకాలనీలలో అధికారం కోల్పోయింది.
రియో డి లా ప్లాటా వైస్రాయల్టీ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తరువాత " జోస్ డి శాన్ మార్టిన్ " ఆర్మీ ఆఫ్ ది ఆండెస్ను సృష్టించి 21 రోజుల్లో అండీస్ పర్వతాలను అధిగమించడం సైన్య చరిత్రలో గొప్ప సాధనగా గుర్తించబడింది.చిలీలో అతను చిలీ సైనిక జనరల్ " బెర్నార్డో ఓ'కిగ్గిన్స్" సైన్యంతో చేరాడు. 1818 లో " చాచుబుకో యుద్ధం ", " మైఫు యుద్ధం " యుద్ధాల్లో దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. జనరల్ జోస్ డి శాన్ మార్టిన్, థామస్ కొచ్రేన్ (చిలీ నావికాదళంలో పనిచేసాడు)1820 సెప్టెంబరులో ఎనిమిది యుద్ధనౌకల సముదాయం పరాకాస్ (పురపాలక) పరాకాస్ నౌకాశ్రయం చేరుకున్నాయి. అక్టోబరు 26 న వారు "పిస్కో" పట్టణంపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నాడు. నవంబరు 12 న శాన్ మార్టిన్ " హుచో "లో స్థిరపడి అక్కడ అతను ప్రధాన కార్యాలయాన్ని స్థాపించాడు. క్రోచాన్ ఉత్తరదిశగా సముద్రయానంచేసి లిమాలోని కాల్లౌ నౌకాశ్రయాన్ని ఉత్తరప్రాంతాన్ని కోచ్రాన్ ఆక్రమించుకున్నాడు.ఉత్తరభూభాగం " గ్వాయాక్విల్ గ్రెగోరియో ఎస్కోబెడో " ఆదేశంతో గుయాక్విల్ తిరుగుబాటు దళాలచే ఆక్రమించబడింది. అందువలన దక్షిణ అమెరికాలో పెరూ స్పానిష్ ప్రభుత్వ బలమైన స్థానంగా ఉన్నందున పెరూను విడుదల చేయడానికి శాన్ మార్టిన్ దౌత్య వ్యూహం ఉపయోగించాడు. ఆయన పెరూకు స్వాతంత్య్రం కల్పించాలని వైస్రాయిని కోరడానికి లిమాకు ప్రతినిధులు పంపాడు. అయితే చర్చలు అన్నీ విఫలం అయ్యాయి.
లిమాకు హినోజో శాన్ మార్టిన్ నుండి ముట్టడి బెదిరింపును ఎదుర్కొనడానికి పెరు వైస్రాయ్ " జాక్విన్ డి లా పజెలే " విశ్వాసపాత్రుడైన సైనిక కమాండర్-ఇన్-చీఫ్ కమాండర్‌గా ఉన్న " జోస్ డి లా సెర్నా " లిమా రక్షకుడిగా నియమినచాడు. జనవరి 29 న " డి లా సెర్నా " డి లా పజెలాలపై తిరుగుబాటును నిర్వహించి స్పెయిన్ చేత పెరూ వైస్రాయ్గా గుర్తించబడ్డాడు.ఈ అంతర్గత అధికారశక్తి పోరాటం స్వేచ్ఛాయుత సైన్యం విజయానికి దోహదం చేసింది. సైనిక వివాదాలను నివారించడానికి శాన్ మార్టిన్ నూతనంగా నియమించిన వైస్రాయ్" జోస్ డి లా సెర్నాను " కలుసుకుని ఒక రాజ్యాంగ రాచరికాన్ని రూపొందించడానికి ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది. 1821 జూలై 12న డి లా సేర్నా ఈ నగరాన్ని వదిలివేసాడు. శాన్ మార్టిన్ లిమాను ఆక్రమించి 1821 జూలై 28న పెరూవియన్ స్వతంత్రాన్ని ప్రకటించారు. ఆయన మొదటి పెరువియన్ జెండాను సృష్టించాడు. మూడు సంవత్సరాల తరువాత సిమోన్ బొలీవర్ సైన్యం విముక్తి కలిగించే వరకు ఆల్మో పెరూ (బొలీవియా) స్పానిష్ ఆధీనంలోనే ఉంది. జోస్ డి శాన్ మార్టిన్ పెరూ రక్షకుడుగా ప్రకటించబడ్డాడు.ఈసమయంలో పెరూవియన్ జాతీయ గుర్తింపుకు నకిలీ చేయబడింది. " లాటిన్ అమెరికన్ కాన్ఫెడరేషన్ " కారణంగా బొలీవియన్ ప్రాజెక్టు రిరస్కరించబడింది. బొలీవియాతో " పెరూ-బోలివియన్ కాన్ఫెడరేషన్ " అశాశ్వతమని నిరూపించబడింది.
[26] 1821 లో జరిగిన పోరాటంలో న్యూ గ్రెనడాకు చెందిన వైస్రాయల్టీని ఉత్తరాన నుండి తన ప్రచారాన్ని ప్రారంభించాడు, ఇది ఒక సంవత్సరం తర్వాత 1821 లో కరబొబొ యుద్ధం , ఒకసంవత్సరం తరువాత 1822 జూలై 22 న " పిచిన్చా యుద్ధం "పోరాటాలలో ఉత్తరప్రాంతాల నుండి సైమన్ బోలివర్ " న్యూ గ్రెనడా వైశ్రాయల్టీ " స్వతంత్రం కొరకు ప్రచారయుద్ధం ప్రారంభించాడు. 1822 జూలైలో బోలివర్ , శాన్ మార్టిన్ " గుయావాక్విల్ కాన్ఫరెన్స్ "లో సమావేశమయ్యారు. మొట్టమొదటి పార్లమెంటు సమావేశమైన తరువాత శాన్ మార్టిన్ రాజకీయాల్లో పదవీ విరమణ చేసిన తరువాత బొలీవర్ పూర్తిగా పెరూను విముక్తం చేయాలని నిర్ణయించాడు. పెరూలో కొత్తగా స్థాపించబడిన " పెరువియన్ కాంగ్రెస్ " బిలియర్ను పెరూ సైనిక నియంతగా చేసి సైన్యాలను నిర్వహించడానికి అధికారం ఇచ్చారు.
" ఆంటోనియో జోస్ డి సుక్రే " సహాయంతో 1824 ఆగస్టున " జూనియస్ యుద్ధం" లో అతిపెద్ద స్పానిష్ సైన్యాన్ని ఓడించారు , అదే సంవత్సరం డిసెంబర్ 9 న నిర్ణయాత్మకమైన " అయాకుచో యుద్ధం " పెరూ , ఆల్టో పెరూ స్వాతంత్ర్యం నిర్ణయించబడింది. ఆల్టో పెరు తరువాత బొలీవియాగా స్థాపించబడింది. రిపబ్లిక్ ప్రారంభ సంవత్సరాల్లో సైనిక నాయకుల మధ్య అధికారం జరిగిన కోసం పోరాటాలు రాజకీయ అస్థిరత్వాన్ని సృష్టించాయి.[27]
1840 నుండి 1860 వరకు అధ్యక్షుడు " రామన్ కాస్టిలియా " పాలనలో పెరూ స్థిరత్వాన్ని అనుభవించింది. గుయానో ఎగుమతుల ద్వారా దేశ ఆదాయం అభివృద్ధి చెందింది.[28] 1870 నాటికి ఇది తగ్గింది. దేశానికి ఋణభారం , రాజకీయ సంఘర్షణలు అధికమైంది. [29] పెరు రైల్రోడ్-నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది సహకరించినా దేశం ఆర్ధికంగా దివాలా తీసింది. 1879 లో పెరూ " పసిఫిక్ యుద్ధం " లో పాల్గొన్నది. యుద్ధం 1884 వరకు కొనసాగింది. బొలీవియా పెరూతో సంకీర్ణమై చిలీకు వ్యతిరేకంగా పోరాడింది. చిలీ ప్రభుత్వంతో చర్చలు జరపడానికి రాజ్యాంగ బృందాన్ని పంపించడం ద్వారా " పెరూవియా ప్రభుత్వం " మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కమిటీ యుద్ధం చేయడమే తుది నిర్ణయం అని నిర్ధారించింది. 1879 ఏప్రెల్ 5 న చిలీ యుద్ధాన్ని ప్రకటించారు.5 సంవత్సరాల యుద్ధం తరువాత పెరూ " తారాపకా డిపార్ట్మెంట్ ఆఫ్ పెరూ " , టాకా ప్రొవింస్ , అరికా ప్రావిన్స్, అటకామ ప్రాంతాలను కోల్పోవడంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. యుద్ధం అంతటా ఇద్దరు అత్యుత్తమ సైనిక నాయకులు " ఫ్రాన్సిస్కో బోలోనసి " , మిగ్యుఎల్ గ్రే సెమినారి తమసామర్ధ్యం ప్రదర్శించారు. కొన్ని సంవత్సరాల తరువాత చిలీ, అరికా , టాకా నగరాలలో ప్రజాభిప్రాయ సేకరణకు కట్టుబడి వారి జాతీయ అనుబంధాన్ని నిర్ణయించడానికి ప్రయత్నించింది.అయినప్పటికీ చిలీ ఒప్పందాన్ని వర్తింపజేయడానికి తిరస్కరించింది. దేశాలు కూడా చట్టబద్ధమైన ప్రణాళికను నిర్ణయించలేకపోయాయి. పసిఫిక్ యుద్ధం తరువాత పునర్నిర్మాణం ప్రయత్నం ప్రారంభమైంది. యుద్ధం కలిగించిన నష్టం నుండి పునరుద్ధరించడానికి ప్రభుత్వం అనేక సాంఘిక , ఆర్థిక సంస్కరణలను ప్రారంభించింది. 1900 ల ప్రారంభంలో మాత్రమే రాజకీయ స్థిరత్వం సాధించబడింది.యుద్ధం తరువాత దీర్ఘకాలం కొనసాగిన స్థిరత్వం తరువాత " అగస్టో బి. లెగ్యుయా " ఆధ్వర్యంలో ఉన్న ప్రాంతంలో సివిలిస్టా పార్టీలో అంతర్గత కలహాలు మొదలైయ్యాయి.లెగ్యుయా పతనం " గ్రేట్ డిప్రెషన్ " కు దారితీసింది.రాజకీయ కలహాలు , " అమెరికన్ పాపులర్ రివల్యూషనరీ అలయంస్ " తిరిగి తలెత్తాయి. [30] రెండు సంస్థల నడుమ వైరం , సైన్యం , ప్రముఖుల సంకీర్ణం మూడుదశాబ్ధాలకాలం దేశరాజకీయాలను ప్రభావితం చేసాయి. 1929 లో చివరిగా చిలీ , పెరూ మద్య " ట్రీటీ ఆఫ్ లిమా " ఒప్పందం నెరవేరింది.టకనా ప్రాంతం తిరిగి పెరూకు ఆధీనం అయింది.1932-1933 మద్య అమెజాన్ డిపార్టుమెంటు , కొలంబియా రాజధాని లెటీషిషియా భూవివాదాల కారణంగా కొలబియాతో సంవత్సరకాల యుద్ధం కొనసాగించింది. 1941లో పెరూ " ఎకుయాడోరియన్, పెరువియన్ యుద్ధంలో పాల్గొన్నది.1948 అక్టోబరు 29న జనరల్ " మాన్యుయల్ ఎ. ఆర్డిలా " అధ్యక్షుడు అయ్యాడు.ఆర్డియా పాలన " ఒచెనియో " అని అభివర్ణించబడింది.
ఆర్డిలా పాలన రైట్‌వింగ్ ఒలిగార్ఛికి, ఇతరులను ఆహ్లాదంగా ఆనందపరచింది. అంతేకాక పేద, దిగువ తరగతులతో ఆయనకు గొప్ప మద్దతు లభించింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ అతన్ని ఖరీదైన ప్రజలకు-ఆనందకరమైన సామాజిక విధానాలను అధికరించడానికి అనుమతించింది. అయినప్పటికీ ఆయన పాలనలో పౌర హక్కులు తీవ్రంగా నిషేధించబడ్డాయి, అవినీతి ప్రబలమైంది. ఒడ్రియాను తరువాత మాన్యువల్ ప్రాడో అధికారబాధ్యతలు వహించాడు. అయినప్పటికీ మోసాల ఆరోపణలు అధికరించడం కారణంగా పెరువియన్ సైన్యం పెడోను నిషేధించి " రికార్డో పెరెజ్ గొడోయ్ " నాయకత్వంలో ఒక సైనిక సైనికాధికారిని అధికారపీఠంలో నియమించడానికి ప్రేరేపించాయి. గోడొయ్ ఒక చిన్న ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడిపించాడు. 1963 లో నిర్వహించబడిన నూతన ఎన్నికలను అధ్యక్షపదవి వహించిన ఫెర్నాండో బెలాండే టెర్రీ 1968 వరకు అధ్యక్షత వహించాడు. బెలాండే పాలన ప్రజాస్వామ్య విధానానికి, నిబద్ధతకు గుర్తింపు పొందింది. 1968 లో జనరల్ జువాన్ వెలస్కో అల్వరాడో నాయకత్వంలోని సాయుధ దళాలు బెలాండేపై తిరుగుబాటును నిర్వహించారు. అల్వారాడో పాలన అభివృద్ధిని పెంపొందించే లక్ష్యమైన రాడికల్ సంస్కరణలను చేపట్టింది కానీ విస్తృతంగా మద్దతు పొందడంలో విఫలమైంది. 1975 లో జనరల్ ఫ్రాన్సిస్కో మోరల్స్ బెర్ముడెజ్ బలవంతంగా వెలస్కో స్థానంలో సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజాస్వామ్యం పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించారు.
రెండు దేశాల మధ్య భూభాగ వివాదం ఫలితంగా పెరువియన్ యుద్ధంలో ఈక్వడార్తో పెరూ పాల్గొన్న చిన్న పోరాటం విజయవంతమైంది. దేశం దీర్ఘకాలిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొన్న తరువాత పెరూవియన్ కరెన్సీ ది సోల్ స్థానంలో 1985 మధ్యకాలంలో " ఇంటి " ప్రవేశపెట్టబడింది. ఇంటి తిరిగి 1991 జూలైలో " న్యూవో సోల్ " చేత భర్తీ చేయబడింది. ఈ సమయంలో నూతనంగా ప్రవేశపెట్టబడిన " న్యూ సోల్ " మొత్తం విలువ ఒక బిలియన్ పాత " సోల్ " విలువకు సమానం అయింది. పెరువియన్ తలసరి వార్షిక ఆదాయం 720 అమెరికన్ డాలర్లు (1960 స్థాయికి కంటే తక్కువ). పెరూ జి.డి.పి.పడిపోయింది 20% పడిపోయింది జాతీయ నిల్వలు ప్రతికూల $ 900 మిలియన్ ఉన్నాయి. పెరూలో సాంఘిక ఉద్రిక్తతలు కాలానుగుణంగా జరిగాయి., సెండ్రో ల్యూమింసొ (మెరిసే దారి) ఆంగ్లంలో -షైనింగ్ పాత్), ఎం.ఆర్.టి.ఎ. వంటి హింసాత్మక తిరుగుబాటు (గ్రామీణ తిరుగుబాటు) ఉద్యమాల పెరుగుదలకు ఇది దోహదపడింది. ఇది దేశవ్యాప్తంగా గొప్ప వినాశనాన్ని కలిగించింది. ఆర్థిక వ్యవస్థ గురించి భయపడి సెండ్రో నుండి, ల్యూమింసొ, ఎం.ఆర్.టి.ఎ నుండి పెరుగుతున్న తీవ్రవాద ముప్పు, అధికార అవినీతి ఆరోపణలు " అల్బెర్టో ఫ్యుజిమోరి " 1990 లో అధ్యక్ష పదవిని చేపట్టడానికి దారితీసాయి.ద్రవ్యోల్భణం తగ్గించడానికి ఫ్యుజిమోరి తీవ్రంగా ప్రవేశపెట్టిన ఆర్థికసంస్కరణల ఫలితంగా 1990 లో 7,650% ఉన్న ద్రవ్యోల్బణం 199 నాటికి 139%కు పడిపోయింది. అతని సంస్కరణల ప్రయత్నాలకు ఎదురైన వ్యతిరేకత ఫలితంగా ఫ్యూజిమోరి 1992 ఏప్రిల్ 5 న "స్వీయ-తిరుగుబాటు "లో కాంగ్రెస్‌ను రద్దు చేసిన తర్వాత ఆయన రాజ్యాంగంను సవరించారు. నూతన కాంగ్రెస్ ఎన్నికలు , అనేక ప్రభుత్వ-యాజమాన్యంలోని కంపెనీల ప్రైవేటీకరణ, పెట్టుబడి-స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడం , బలమైన ఆర్ధిక వ్యవస్థ నిర్వహణతో సహా గణనీయమైన ఆర్థిక సంస్కరణను అమలు చేయబడ్డాయి. ఫ్యుజిమోరి పరిపాలన తిరుగుబాటు గ్రూపులు ముఖ్యంగా సెండ్రొ ల్యూమింసొ " 1980, 1990 లలో దేశవ్యాప్తంగా తీవ్రవాద ప్రచారాలను చేపట్టింది. ఫిజిమోరి తిరుగుబాటుదారులను పడగొట్టాడు, 1990 వ దశకం చివరినాటికి వారిని ఎక్కువగా దూరం చేసినప్పటికీ పెరూవియన్ భద్రతా దళాలు, తిరుగుబాటుదారులు రెండింటి ద్వారా జరిపిన దురాక్రమణల ద్వారా ఈ పోరాటం విమర్శలకు లోనైంది: " బారియోస్ ఆల్టోస్ ఊచకోత ", " లా కాంటాట ఊచకోత ", " టారటా బాంబుదాడి ", సెండ్రొ ల్యూమింసొ చేత " ఫ్రెక్యుసియా లాటినా బాంబు " బాంబు దాడులు. ఆ సంఘటనలు చివరికి హింసాత్మక హింసాకాండలో చేసిన మానవ హక్కుల ఉల్లంఘనలను జరిగినట్లు సూచించాయి.
1995 ప్రారంభంలో మరోసారి పెరు, ఈక్వడార్ సెనెపా యుద్ధంలో ఘర్షణ పడ్డాయి. కానీ 1998 లో రెండు దేశాల ప్రభుత్వాలు వాటి మధ్య అంతర్జాతీయ సరిహద్దును స్పష్టంగా విభజించిన ఒక శాంతి ఒప్పందంపై సంతకాలు చేసాయి. 2000 నవంబరులో ఫుజిమోరి కార్యాలయం నుండి రాజీనామా చేసి పెరువియన్ అధికారులచే మానవ హక్కుల ఉల్లంఘనలకు, అవినీతి ఆరోపణలకు ప్రాసిక్యూట్ తప్పించుకోవడానికి స్వీయ బహిష్కరణ విధించుకున్నాడు. ఫుజిమోరీ పాలన ముగిసిన నాటి నుండి పెరూ ఆర్థిక వృద్ధిని కొనసాగించినప్పుడు అవినీతిని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంది.
[31] తిరుగుబాటు తరువాత మానవ హక్కుల పురోగతి ఉన్నప్పటికీ అనేక సమస్యలు ఇప్పటికీ కనిపిస్తాయి, పెరువియన్ వివాదం హింస ద్వారా బాధపడుతున్న వారి సమస్యలను నిరంతరంగా నెట్టివేయడానికి ప్రయత్నించింది. [32] ఆపద్ధర్మ అధ్యక్షపదవి వహించిన " వల్లినిన్ పియానాగువా " కొత్త అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలను నిర్వహించే బాధ్యత అధ్యక్షత వహించాడు. ఎన్నికల తరువాత " అలెజాండ్రో టోలెడో " అధ్యక్షుడిగా ఎన్నికై 2001 నుండి 2006 వరకు పాలనసాగించాడు.
2006 జూలై 28 న మాజీ అధ్యక్షుడు అలాన్ గార్సియా ఎన్నికలలో విజయం సాధించిన పెరూ అధ్యక్షుడయ్యాడు. 2008 మేలో పెరూ దక్షిణ అమెరికా నేషన్స్ సంఘంలో సభ్యదేసశం అయింది.
2011 జూన్ 5 న ఒలంటా హుమా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రెసిడెంట్ ఒలంటా హుమా పాలనా సమయంలో ప్రధానమంత్రి అనా జరా, ఆమె మంత్రివర్గం విజయవంతంగా సెన్సార్ చేయబడ్డాయి. స్వతంత్రం తరువాత 50 సంవత్సరాలలో పెరువియన్ చరిత్రలో చట్టసభల నుండి సభ్యులు బలవంతంగా రాజీనామా చేసిన సంఘటన మొదటిసారిగా చోటుచేసుకుంది.[33]
పెరూ పశ్చిమ దక్షిణ అమెరికాలో 1,285,216 చ.కి.మీ (496,225 చ.మై) ప్రదేశంలో విస్తరించి ఉంది. పెరూ ఉత్తరసరిహద్దులో ఈక్వడార్, కొలంబియా దేశాలు ఉన్నాయి, తూర్పుసరిహద్దులో బ్రెజిల్ దక్షిణ సరిహద్దులో బొలీవియా, దక్షిణసరిహద్దులో చిలీ, పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రంతో సమాంతరంగా ఆండీస్ పర్వతాలు ఉంటాయి. భౌగోళికంగా పెరూ మూడు సంప్రదాయబద్ధైన ప్రాంతాలుగా విభజించబడింది. పశ్చిమ తీరానికి చెందిన కోస్టా (కోస్టా) ఇరుకైన మైదానం కాలానుగుణ నదులచే సృష్టించబడిన లోయలు మినహా శుష్కమైన పొడి ఉంటుంది. సియెర్రా (ఎత్తైన) ఆండీస్ పర్వత ఎగువన సియెర్రా ప్రాంతం ఉంది. ఇది ఆల్టిప్లనో పీఠభూమి, దేశంలోని ఎత్తైన శిఖరాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ సముద్రమట్టనికి 6,768 మీ (22,205 అడుగులు) ఎత్తైన హుయాస్కరన్ శిఖరం ఉంది.[34] మూడవ ప్రాంతం సేల్వా (అడవి) తూర్పున విస్తరించి ఉన్న అమెజాన్ వర్షారణ్యంతో కప్పబడిన ఫ్లాట్ మైదానాల విశాలమైన ప్రాంతంగా ఉంది. దేశం వైశాల్యంలో దాదాపు 60% భూభాగం ఈ ప్రాంతంలోనే ఉంది.[35] పెరువియన్ నదులలో అనేకం అండీస్ శిఖరాలలో ఉద్భవించాయి. మూడు ముఖద్వారాలలో ఒకటిగా సంగమిస్తుంటాయి. పసిఫిక్ మహాసముద్రం వైపు ప్రవహించేవి నిటారుగా, చిన్నవిగా ఉంటాయి. అవి అప్పుడప్పుడూ ప్రవహిస్తాయి. అమెజాన్ నది ఉపనదులు చాలా పెద్ద ప్రవాహం కలిగి ఉంటాయి. అవి సియెర్రా నుండి నిష్క్రమించే నదులు పొడవుగా తక్కువ నిటారుగా ఉంటాయి. లేక్ టిటికాకాలో ప్రవహించే నదులు సాధారణంగా చిన్నవిగా పొడవు తక్కువగా ఉంటాయి, పెద్ద ప్రవాహం కలిగి ఉంటాయి.[36] పెరూ సుదీర్ఘమైన నదులు యుగాయాలి, మరానాన్, పుటుమయో, యవరి, హుల్లాల్లా, ఉర్యుబంబ, మంటారో, అమెజాన్.[37] పెరూలో, బొలీవియా మధ్య ఎత్తైన అండీస్లో ఉన్న టిటికాకా సరస్సు దక్షిణ అమెరికాలో అతిపెద్దదిగా గుర్తించబడుతుంది.[38] పెరూ తీరప్రాంతంలో అతిపెద్ద రిజర్వాయర్లు పోచోస్, టినాజోన్స్, సాన్ లోరెంజో,, ఎల్ ఫ్రేయిల్ రిజర్వాయర్లు ప్రధానమైనవి.[39]
The combination of tropical latitude, mountain ranges, topography variations, and two ocean currents (Humboldt and El Niño) gives Peru a large diversity of climates. The coastal region has moderate temperatures, low precipitations, and high humidity, except for its warmer, wetter northern reaches.[40] In the mountain region, rain is frequent in summer, and temperature and humidity diminish with altitude up to the frozen peaks of the Andes.
The Peruvian Amazon is characterized by heavy rainfall and high temperatures, except for its southernmost part, which has cold winters and seasonal rainfall.
పెరూ వైవిధ్యమైన భౌగోళికం, వాతావరణం కారణంగా పెరూలో అత్యధిక జీవవైవిధ్యం ఉంటుంది. 2003 నాటి గణాంకాల ఆధారంగా పెరూలో 21,462 జాతుల మొక్కలు వాటిలో 5,855 జంతువుల జాతులు ఉన్నాయి.[43] పెరూలో 1,800 జాతుల పక్షులు (120 స్థానికజాతులు)500 రకాల క్షీరదాలు, 300 జాతుల సరీసృపాలు ఉన్నాయి.[44] వందలాది క్షీరదాల్లో ప్యూమా, జాగ్వర్, అరుదైన ఎలుగుబంటి వంటి అరుదైన జాతులు ఉన్నాయి. పెరూ పక్షులు పెద్ద సంఖ్యలో గనోను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి ఎగుమతి ఆర్థికంగా ప్రాధాన్యత వహిస్తుంది. పసిఫిక్ సముద్రంలో పెద్దసంఖ్యలో సీ బాస్, ఆంకోవీస్, ట్యూనా, క్రస్టాసీన్, షెల్ఫిష్లను అధిక పరిమాణంలో అనేక సొరచేపలు, స్పెర్మ్ తిమింగలాలు, తిమింగలాలు ఉన్నాయి.[45] పెరూలో విభిన్న వృక్షజాలం కూడా ఉంది. తీరప్రాంత ఎడారులు కాక్టస్ కంటే కొంచెం ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. కొండ పొగమంచు ఒయాసిస్, ఏకైక నదీలోయ పాటు ప్రత్యేకమైన జీవవైద్యం ఉంటుంది.[46] పునా అని పిలవబడే వృక్ష రేఖ పైన ఉన్న హైలాండ్స్ పొదలు, కాక్టస్ వంటి కరువు-నిరోధక మొక్కలు, అతిపెద్ద జాతులైన బ్రోమిలియాడ్ అద్భుతమైన పూయా రైమోండీ వృక్షాలు ఉంటాయి.
అండీస్ ప్రత్వప్రాంతాలలోని క్లౌడ్-అటవీ వాలులు నాచు, ఆర్కిడ్లు, బ్రోమెలియడ్లు నిలబెట్టాయి, అమెజాన్ వర్షారణ్యాలు వివిధ రకాల చెట్లు, పందిరి మొక్కలకు ప్రసిద్ధి చెందాయి.[45]
వరల్డ్ బ్యాంక్ పెరూ ఆర్థికం అప్పర్ " మిడిల్ ఆదాయం "గా వర్గీకరించింది.[47] అలాగే ఇది అతిపెద్ద ఆర్థికవ్యవస్థలో 39వ స్థానంలో ఉంటుంది.[48] 2000 లలో అనుభవించిన ఆర్థిక వృద్ధి కారణంగా పెరూ 2011 నాటికి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థలలో ఒకటిగా మారింది.[49] చారిత్రాత్మకంగా దేశం ఆర్థిక పనితీరు ఎగుమతులతో ముడిపడి ఉంది. ఇది దిగుమతుల, బాహ్య రుణాల చెల్లింపులకు కరెన్సీని అందిస్తుంది.[50] వారు గణనీయమైన రాబడిని స్వయం సమృద్ధి ఆదాయం పంచడంలో సమతుల్యత పాటిస్తుంది.[51] 2010 గణాంకాల ఆధారంగా మొత్తం జనాభాలో 31.3% పేదలలో దారిద్యరేఖకు దిగువన జీవిస్తున్న ప్రలలు 9.8% మంది ఉన్నారు.[52] 2012 లో ద్రవ్యోల్బణం లాటిన్ అమెరికా దేశాలలో అత్యంత అత్యల్పమైన ద్రవ్యోల్భణం కలిగిన (1.8%) దేశంగా పెరూ ప్రత్యేకత కలిగి ఉంది. 2013 లో చమురు, వస్తువుల ధరలు పెరిగిన కారణంగా 2014 నాటికి ద్రవ్యోల్భణం 2.5%కి చేరుకుంది.[53] ఇటీవలి సంవత్సరాలలో నిరుద్యోగం శాతం క్రమంగా పడిపోయింది. 2012 నాటికి 3.6% వద్ద ఉంది.పెరువియన్ ఆర్థిక విధానం గత దశాబ్దాలలో విస్తృతంగా మారుతూ వచ్చింది. జువాన్ వెలాస్కో అల్వరాడో యొక్క 1968-1975 ప్రభుత్వం తీవ్రమైన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఇందులో వ్యవసాయ సంస్కరణ, విదేశీ కంపెనీల దుర్వినియోగం, ఆర్థిక ప్రణాళిక వ్యవస్థను ప్రవేశపెట్టడం, భారీ ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలను అభివృద్ధిచేయడం. ఈ చర్యలు ఆదాయ పునఃపంపిణీ లక్ష్యాలను సాధించడంలో విఫలమమైనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలపై ఆర్థికంగా ఆధారపడటం ముగిసింది.[54] ఈ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా సంస్కరణలు 1990 ల వరకు అల్బెర్టో ఫ్యూజిమోరి ప్రభుత్వం స్థాయికి చేరలేదు.ప్రభుత్వం లిబలైజింగ్ చేసినప్పుడు ధర నియంత్రణలు, రక్షణవాదం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై నియంత్రణలు, సంస్థలలో ప్రభుత్వ యాజమాన్యం ముగిసినప్పుడు విరుద్ధమైన ఫలితాలు లేవు.[55] 1997 ఆసియా ఆర్థిక సంక్షోభం తరువాత తిరోగమనం మినహా సంస్కరణలు 1993 నుండి నిరంతర ఆర్థిక వృద్ధికి అనుమతించాయి.[56] పెరువియన్ స్థూల దేశీయ ఉత్పత్తిలో 53% సేవారంగం, తయారీరంగం (22.3%), గనులు, వెలికితీత పరిశ్రమలు (15%), పన్నులు (9.7%) భాగస్వామ్యం వహిస్తూ ఉన్నాయి.[57] ఇటీవలి ఆర్థికాభివృద్ధికి స్థూల ఆర్థిక స్థిరత్వం, వాణిజ్యం మెరుగైన నిబంధనలు, పెరుగుతున్న పెట్టుబడి, వినియోగం మూలకారణంగా మారాయి. [58] 2006 ఏప్రిల్ 12న సంతకం చేసిన " యునైటెడ్ స్టేట్స్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం " అమలు తరువాత ట్రేడ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.[59] పెరూ ప్రధాన ఎగుమతులలో రాగి, బంగారం, జింక్, వస్త్రాలు, చేపలు ప్రధాన్యత వహిస్తున్నాయి. వాణిజ్య భాగస్వాములుగా యునైటెడ్ స్టేట్స్, చైనా, బ్రెజిల్, చిలీ ఉన్నాయి.[60]
పెరూలో నీటి, పారిశుధ్యం రంగం గత రెండు దశాబ్దాల్లో ముఖ్యమైన పురోభివృద్ధిని సాధించింది. 1980, 2010 మధ్యకాలంలో 30% నుండి 85% వరకు నీటి సరఫరా అభివృద్ధి చేయబడింది. 1985 నుండి 2010 మద్యకాలంలో పారిశుధ్య కవరేజ్ 9% నుండి 37%కి పెరిగింది గ్రామీణ ప్రాంతాలు.[61] కాలుష్యరహిత తాగునీటి సరఫరా, మురికినీరు ట్రీట్మెంటుకు సంబంధించిన అభివృద్ధి సాధించింది.అయినప్పటికీ ఇప్పటికీ పలు సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది. తగినంత సేవ కవరేజ్;
పెరూ ఐదు శతాబ్దాలుగా విభిన్న వర్గాల కలయికచే ఏర్పడిన బహుళ జాతి దేశం. అమెరిన్డియన్లు 16 వ శతాబ్దంలో స్పానిష్ విజయానికి ముందు అనేక వేల సంవత్సరాలు పెరువియన్ భూభాగాన్ని నివాసించారు. చరిత్రకారుడు నోబెల్ డేవిడ్ కుక్ అభిప్రాయంలో " వారి జనాభా 1520 లలో దాదాపుగా 5-9 మిలియన్ల నుండి 1620 లో సుమారు 600,000 కు తగ్గింది. అంటువ్యాధలు ఇందుకు ప్రధాన కారణంగా ఉన్నాయి.[62] వలసవాదుల పాలనలో పెద్ద సంఖ్యలో స్పెయిన్ దేశస్థులు, ఆఫ్రికన్లు వచ్చారు. వారు, స్థానిక ప్రజలతో మిశ్రితమై విస్తరించారు. స్వాతంత్ర్యం తరువాత ఇంగ్లాండ్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ క్రమక్రమంగా వలసలు జరిగాయి.[63] బానిస కార్మికులకు ప్రత్యామ్నాయంగా 1850 లలో ఒప్పంద కూలీలుగా వచ్చిన చైనీస్, జపానీయులు పెరూవియన్ సమాజాన్ని ప్రభావితం చేసారు.[64]
దక్షిణ అమెరికాలో పెరూ అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో పెరూ 5 వ స్థానంలో ఉంది.[65] 1950, 2000 మధ్య జనాభా వృద్ధి రేటు 2.6% నుండి 1.6%కి తగ్గింది. 2050 నాటికి జనసంఖ్య సుమారు 42 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.[66] As of 2007[update], 2007 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు 75.9%, గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు 24.1% ఉన్నారు.[67] అతిపెద్ద నగరాల్లో లిమా మెట్రోపాలిటన్ ప్రాంతం (9.8 మిలియన్లకు పైగా ప్రజలు) అరెక్విపా, ట్రుజిల్లో, చిక్లేయో, పియురా, ఇక్విటోస్, కుస్కో, చిమ్బోట్,, హున్కాయోయో ప్రధానమైనవి. 2007 గణాంకాల ఆధారంగా ఈ నగరాలలో జనసంఖ్య 2,50,000 మందికంటే అధికం ఉంది.[68] పెరూలో 15 అన్యదేశపు అమెరిన్డియన్ తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు.[69]
1993 నాటి పెరువియన్ రాజ్యాంగం ఆధారంగా పెరూ అధికారిక భాషలు స్పానిష్, క్వెచువా, ఐమారా, ఇతర ప్రదేశాలలో స్థానిభాషలు (అవి ప్రబలంగా ఉన్న ప్రాంతాలలో) ఉన్నాయి. జనాభాలో స్పానిష్ భాష 84.1%, క్వెచువా భాష 13%, ఐమరా భాష 1.7%, ఇతర భాషలు మిగిలిన 1.2% ప్రజలకు వాడుకభాషలుగా ఉన్నాయి.[48] ప్రభుత్వం స్పానిష్ భాషను ఉపయోగిస్తుంది. స్పానిష్ దేశం ప్రధాన భాషగా ఉంది. ఇది మీడియా, విద్యా వ్యవస్థలు, వాణిజ్యాల్లో ఉపయోగించబడుతుంది. ఆండియన్ పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న అమెరిన్డియన్లు క్వెచువా, ఐమారా భాష మాట్లాడతారు, అండీస్ తూర్పు వైపున నివసిస్తున్న విభిన్న దేశీయ సమూహాలకు చెందిన ప్రజలు, అమెజాన్ నదీ తీరంలో ఉన్న ఉష్ణమండల లోతట్టు ప్రాంతాల ప్రజలు జాతిపరంగా వైవిధ్యభరితంగా ఉంటారు. పెరూ విలక్షణ భౌగోళిక ప్రాంతాల ప్రజలు అమెరిన్డియన్ భాషల కంటే స్పానిష్ భాష అధికంగా వాడుకలో ఉంది., పర్వతాల, పర్వతాల యొక్క విభిన్న సాంప్రదాయ ఆండియన్ సంస్కృతుల మధ్య ఒక భాష విభజనలో ప్రతిబింబిస్తుంది. అండీస్కు తూర్పుగా ఉన్న స్థానిక ప్రజలు వివిధ భాషలు, మాండలికాలతో మాట్లాడతారు. ఈ సమూహాలలో కొన్ని ఇప్పటికీ సాంప్రదాయ దేశీయ భాషలకు కట్టుబడి ఉంటాయి. మరికొందరు పూర్తిగా స్పానిష్ భాష వాడకానికి పూర్తిగా అలవాటుపడ్డారు. క్వెచువా మాట్లాడే ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో క్వెచువాను బోధించడానికి ప్రయత్నాలు వ్యవస్థీకృతంగా అధికరిస్తున్నాయి. పెరూవియన్ అమెజాన్‌లో అషోంకినా, బోరా, అగురుణా వంటి అనేక దేశీయ భాషలు మాట్లాడబడుతున్నాయి.[70]
2007 జనాభా గణాంకాల ఆధారంగా జనాభాలో 81.3% మంది కాథలిక్, 12.5% ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్, 3.3% ఇతర ప్రొటెస్టంట్, జుడాయిజం, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ (LDS చర్చ్), యెహోవా సాక్షి,, 2.9% మత-రహితంగా విశ్వాసాలకు చెందిన ప్రజలు ఉన్నారని భావిస్తున్నారు. [71] 2007 లో పెరూ అక్షరాస్యత 92.9%గా అంచనా వేయబడింది. పట్టణ ప్రాంతాల్లో (96.3%), గ్రామీణ ప్రాంతాల్లో (80.3%) ఉంది.[72] పెరూలో నిర్బంధ ప్రాథమిక, మాధ్యమిక విద్య అమలులో ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితం విద్యాభ్యాసం అమలులో ఉంది.[48][73] అమెరిన్డియన్ మత సంప్రదాయాలు పెరువియన్ల నమ్మకాలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కార్పస్ క్రిస్టి, పవిత్ర వారం, క్రిస్మస్ వంటి కాథలిక్ ఉత్సవాలు కొన్నిసార్లు అమెరిన్డియన్ సంప్రదాయాల్లో మిశ్ర్తిమయ్యాయి. కొలంబియా పూర్వం నుండి జరుపుకున్న అమెరిండియన్ ఉత్సవాలు దేశం అంతటా విస్తృతంగా వ్యాపించాయి. పురాతన ఉత్సవమైన " ఇంతి రేమిమి " ఉత్సవం ఇప్పటికీ పాత ఉత్సవ పండుగగా జరుపుకుంటున్నారు. పట్టణాలు, నగరాలు, గ్రామాలలో అధికభాగం వారి స్వంత అధికారిక చర్చి లేదా కేథడ్రల్, పాట్రాన్ సెయింట్ ఉన్నాయి.
పెరూవియన్ నైసర్గింగా స్థానిక వనరులు ఉన్నాయి. అండీస్ కమ్యూనిటీలలో అన్కాష్, కుస్కో, పునో క్వెచో (ఐమారా) మొదలైన పేర్లు ఆధిక్యతలో ఉన్నాయి. అయితే వారి స్పానిష్-ఆధారిత లేఖనశాస్త్ర అక్షరాల ఉపయోగం ఆధారంగా భాషల నిర్ణయం వివాదాస్పదంగా ఉంది. అధికారిక వార్తాపత్రిక ఎల్ పెరూనోలో 2016 జూలై 22 న ప్రచురించబడిన, లా 29735 కు నిబంధనలను ఆమోదించిన డిరిటో సుప్రెమో నో 004-2016-MC (సుప్రీం డిక్రీ) ఆర్టికల్ 20 ప్రకారం, దేశీయ సాధారణ వర్ణమాల టోపొనీలు నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ (ఇన్స్టిట్యూటో జియోగ్రాఫికో నేషనల్, ఐజిఎన్) ఉపయోగించిన నామకరణాలను ప్రామాణికం చేయాలనే ఉద్దేశంతో భాషలను క్రమక్రమంగా ప్రతిపాదించాలి. నేషనల్ జియోగ్రాఫిక్ ఇన్స్టిట్యూట్ పెరూ అధికారిక మ్యాపులలో అవసరమైన మార్పులను గుర్తిస్తుంది. [74]
పెరువియన్ సంస్కృతి ప్రధానంగా అమెరిన్డియన్, స్పానిష్ సంప్రదాయాలలో పాతుకుపోయింది.[75] అయితే ఇది పలు ఆసియా ఆఫ్రికన్, ఇతర ఐరోపా జాతుల సమూహాలచే ప్రభావితమైంది. పెరూవియన్ కళాత్మక సంప్రదాయాలు విస్తృతమైన కుండలు, వస్త్రాలు, నగలు, ఇంకా ముందు కాలానికి చెందిన సంస్కృతుల శిల్పాలకు చెందినవి. ఇంకా సంస్కృతిలో పలు కళలు భాగంగా ఉన్నాయి. మచు పిచ్చు వంటి నిర్మాణకళలు వీరికి స్వంతం. బారోక్ ప్రాంతంలో కాలనీల కళ ఆధిపత్యం కలిగి ఉన్నప్పటికీ స్థానిక సంప్రదాయాలచే సవరించబడి ఉన్నాయి.[76] ఈ కాలంలో చాలా కళలు మతపరమైన అంశాలపై దృష్టి పెట్టాయి. అనేక చర్చిలు శకం కొనసాగింది. కుజ్కో పాఠశాల చిత్రాలు ప్రతినిధినిధ్యం వహించాయి.[77] 20 వ శతాబ్దం ప్రారంభంలో ఇండిజీనిసోను ఆవిర్భావం వరకు స్వతంత్రం తరువాత కళలు మరింత అభివృద్ధి చెందాయి. [78] 1950 ల నుండి పెరూవియన్ కళ విదేశీ, స్థానిక కళల ప్రవాహాలచే పరిశీలనాత్మక, ఆకృతి చేయబడింది. [79] పెరూవియన్ సాహిత్యం పూర్వ-కొలంబియా నాగరికతల మౌఖిక సంప్రదాయాలలో నుండి ఆవిర్భవించింది. స్పెయిన్ దేశస్థులు 16 వ శతాబ్దంలో రచనలను పరిచయం చేశారు.కళాత్మక సాహిత్య వ్యక్తీకరణలో గ్రంథాలు, మతపరమైన సాహిత్యం ఉన్నాయి. స్వాతంత్ర్యం తరువాత కోస్తాబ్రిమ్, రొమాంటిసిజం అత్యంత సాధారణ సాహిత్య ప్రక్రియలుగా మారింది. ఇది రికార్డో పాల్మ రచనలలో ఉదహరించబడింది.[80] 20 వ శతాబ్ది ప్రారంభంలో ఇండీజినిమో ఉద్యమానికి సిరో అలెగ్రియా,[81] జోస్ మారియా ఆర్గియదాస్ వంటి రచయితలు నాయకత్వం వహించారు.[82] సెసార్ వాల్లెజో ఆధునికవాదం, తరచూ రాజకీయంగా సంబంధిత పద్యాలను రచించాడు. ఆధునిక పెరూ సాహిత్యము నోబెల్ గ్రహీత " మారియో వర్గాస్ లుసా " వంటి రచయితలకు లాటిన్ అమెరికన్ బూంలో సభ్యుడిగా కొనసాగుతున్నందుకు కృతఙతా భావం ప్రదర్శిస్తున్నారు. [83]
పెరువియన్ ఆహారసంస్కృతిని అమెరిండియన్, స్పానిష్ ఆహారాలు, చైనీస్ (అత్యధిక ప్రభావం), ఆఫ్రికన్, అరబ్, ఇటాలియన్,, జపనీస్ వంటల ప్రభావితం చేస్తున్నాయి.[84] సాధారణ వంటలలో యాంటిటుచోస్, సెవిచే, పచామంకా ప్రాధాన్యత వహిస్తూ ఉన్నాయి. పెరూ విభిన్నమైన వాతావరణం వివిధ రకాల మొక్కల, జంతువుల పెరుగుదల కారణంగా లభిస్తున్న పదార్ధాలు వంటలలో ఉపయోగించబడుతున్నాయి.[85] వైద్యమైన పెరూ పదార్థాలు, వంట పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను పొందుతున్నాయి.[86]
పెరూవియన్ సంగీతంలో ఆండియన్, స్పానిష్,, ఆఫ్రికన్ మూలాలు ఉన్నాయి.[87] పూర్వ-హిస్పానిక్ కాలంలో సంగీత వ్యక్తీకరణ ప్రతి ప్రాంతంలో విస్తృతంగా మారుతూ ఉండేవి. సాధారణంగా క్వేనా, టిన్యా అనే రెండు వాయిద్యాలు అధికంగా ఉపయోగించబడుతున్నాయి.[88] గిటార్, హార్ప్ వంటి కొత్త సాధనాలను స్పానియర్లు పరిచయం చేశాయి, ఇవి చార్గోగో వంటి క్రాస్బ్రేడ్ పరికరాల అభివృద్ధికి దారి తీసింది.[89]
పెరువియన్ సంగీతానికి ఆఫ్రికన్ రచనలు దాని లయలు, కాజోన్, పెర్కుషన్ వాయిద్యం (పెరువియన్ వాయిద్యం), పెరువియన్ జానపద నృత్యాలలో మరీనిరా, టొన్డెరో, జామాకేకు, డయాబ్లాడ, హుయనో ప్రధానంగా ఉన్నాయి.[90]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.