పుష్యరాగం
నవరత్నాల్లో ఒకటి / From Wikipedia, the free encyclopedia
పుష్యరాగం (ఆంగ్లం:Topaz) అనునది అల్యూమినియం, ఫ్లోరిన్ యొక్క సిలికేట్ ఖనిజం. దీని ఫార్ములా Al2SiO4 (F, OH)2. ఇది ఆర్థోమార్ఫిక్ వ్యవస్థలో స్పటికీకరణం చెందుతుంది. దాని స్ఫటికాలు ఎక్కువగా పిరమిడ్, ఇతర ముఖాలచే మూసివేయబడతాయి. ఇది సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఖనిజాలలో కఠినమైనది. ఇది ఏ ఇతర సిలికేట్ ఖనిజం కన్నా కఠినమైనది. దానియొక్క సహజ పారదర్శకత, వివిధ రంగుల కలయికతో గల దీని కఠినత్వం మూలంగా దీనిని ఆభరణాల తయారీలో, ఇతర రత్నాలను కత్తిరించడానికి ఎక్కువగా వాడుతారు.[1]
త్వరిత వాస్తవాలు పుష్యరాగం, సాధారణ సమాచారం ...
పుష్యరాగం | |
---|---|
తెలుపు మాట్రిక్స్ పై పుష్యరాగ స్ఫటికం |
|
సాధారణ సమాచారం | |
వర్గము | నెసో లిలికేట్ ఖనిజాలు |
రసాయన ఫార్ములా | Al2SiO4(F,OH)2 |
ధృవీకరణ | |
రంగు | రంగులేని (మలినాలు లేనిదైతే), నీలం, గోధుమ, నారింజ, గ్రే, పసుపు, ఆకుపచ్చ, గులాబీ, ఎర్రని గులాబీ |
మూసివేయి
పుష్యరాగం అనునది ఒక శిల, ఇది పలు రంగులలో లభ్యమగును. దీనిని నవగ్రహాలలో గురు గ్రహానికి ప్రీతి పాత్రమైనదిగా చెపుతారు. వీటిలో అనేక రంగులున్నా తెల్లనివీ, పసుపు తెలుపూ కలగలసినవీ అత్యధికంగా వినియోగిస్తారు.