From Wikipedia, the free encyclopedia
పిసక్ [1] అనేది పెరూ దేశంలోని పవిత్ర లోయలో ఉన్న ఒక గ్రామం. ఇది పర్యాటక ప్రదేశంగా చాలా ప్రసిద్ధమైంది. విల్కనుటా నది దగ్గర్లో ఉంది ఈ గ్రామానికి. ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారాల్లో పిసక్ లో జరిగే సంతకు పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడం విశేషం. ఈ సంతలో వారి వారి గ్రామాల్లో పండేవి, తయారుచేసే వాటిని ఇక్కడ అమ్ముతుంటారు స్థానికులు.[2]
ఈ ఊళ్ళో ఉండే అతిపెద్ద పిసొనరీ చెట్టు చాలా ప్రసిద్ధి చెందింది. కానీ 2013లో వచ్చిన తుఫానులో ఈ చెట్టు పడిపోయింది.[2] ఈ గ్రామం దగ్గర్లోని హౌంకా అభయారణ్యంలో వారికి పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఈ క్షేత్రానికి కూడా చాలామంది పర్యాటకులు వస్తారు. ప్రతీ సెప్టెంబరులో ఈ క్షేత్రానికి భక్తులు యాత్రగా వెళ్తుంటారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.