![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Paracetamol-from-xtal-3D-balls.png/640px-Paracetamol-from-xtal-3D-balls.png&w=640&q=50)
పారాసిటమాల్
From Wikipedia, the free encyclopedia
పారాసెటమాల్ (INN) ([1]) లేదా ఎసిటమైనోఫేన్ ([2]) (USAN) విస్తృతంగా వాడబడుతున్న ఒక ఓవర్-ది-కౌంటర్ అనల్జసిక్ (నొప్పి నివారిణి) , యాంటీ పైరటిక్ (జ్వరము తగ్గించేది). దీన్ని సాధారణముగా జ్వరము, తలనొప్పి , ఇతర చిన్న నొప్పులకు, పోటులకి వాడుతారు. ఇది అనేక జలుబు , ఫ్లూ మందులు తయారీలో చేర్చబడుతున్న ఒక ముఖ్య పదార్ధము. శస్త్ర చికిత్స అనంతరం ఏర్పడే తీవ్రమైన నొప్పులని నివారించడానికి కూడా పారాసెటమాల్ ని స్టీరాయిడ్లతో కాని వాపు తగ్గించే మందులతో , ఒపియాయ్ద్ అనాల్జేసిక్ లతో కలిపి వాడుతారు. పారాసెటమాల్ అనే పేరు రసాయన పేరు par a - ( acet yl am ino) phen ol (లేదా para - ( acet yl amino ) phen ol) నుండి వచ్చింది. ఈ పదార్ధం ఎసిటిక్ ఆమ్లం, అమినోఫెనాల్ పి-హైడ్రాక్సీనిలిన్ రెండింటి యొక్క ఉత్పన్నం . ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అవసరమైన ఔషధాల జాబితాలో పారాసెటమాల్ చాలా ముఖ్యమైనది[1]. ఇది చాలా తక్కువ దుష్ప్రభావాలతో కూడిన ఔషధం. అయితే పెద్ద ఎత్తున వాడటం వల్ల కాలేయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి.[2]
![]() | This article may require cleanup to meet Wikipedia's quality standards. The specific problem is: భాష కృత్రిమంగా ఉంది. (నవంబర్ 2020) |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8f/Paracetamol-from-xtal-3D-balls.png/640px-Paracetamol-from-xtal-3D-balls.png)