From Wikipedia, the free encyclopedia
పాండ్య రాజవంశాన్ని మదురై పాండ్యాలు అని కూడా పిలుస్తుంటారు. దక్షిణ భారతదేశపు తమిళ వంశాలలో ఇది ఒకటి, మిగిలిన రెండు చోళ, చేరా.[5] దక్షిణ భారతదేశంలోని "తమిళ దేశాన్ని నమూడు వంశాలకు చెందిన పాలకులు (మూ-వేందర్) " పాలించారు.[5][6] పాండ్యులు విస్తృతమైన భూభాగాలను పరిపాలించారు. కొన్ని సార్లు ప్రస్తుత దక్షిణ భారతదేశంతో శ్రీలంక (మదురైకి లోబడి ఉన్న అనుసంగిక శాఖల ద్వారా) చేరిన భూభాగాన్ని పాలించారు.[7][8]
పాండ్యరాజవంశం పాలించిన కాలం ప్రాచీనతను నిర్ణయించడం కష్టం.[8] ఆరంభకాల పాండ్య అధిపతులు[9] వారు ప్రాచీన కాలం నుండి వారి దేశాన్ని (పాండ్య నాడు) పరిపాలించారు. ఇందులో లోతట్టు నగరం మదురై, దక్షిణ ఓడరేవు కోర్కై ఉన్నాయి.[10] పాండ్యుల దేశం అనేక గ్రెకో-రోమన్ మూలాలలో (క్రీ.పూ. 4 వ శతాబ్దం నాటికి [8]) మౌర్య చక్రవర్తి అశోకుడి (క్రీ.పూ. 3 వ శతాబ్దం) కాలంలో ప్రస్తావించబడింది.[10][11] తొలి తమిళ కవిత్వం ("సంగం సాహిత్యం") లో కూడా పాండ్యుల ప్రస్థాన ఉంది.[8] గ్రీకు, లాటిన్ సాహిత్యం (క్రీ.పూ. ప్రారంభ శతాబ్దాలు), తమిళ-బ్రాహ్మి లిపిలో ఇతిహాసకథనాలతో కూడిన నాణేలు, తమిళ-బ్రాహ్మి శాసనాలు పాండ్య రాజవంశం క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి సా.శ. ప్రారంభ శతాబ్దాల వరకు కొనసాగి ఉండవచ్చని సూచిస్తున్నాయి.[12] భారతదేశంలో కలభ్రా రాజవంశం అభివృద్ధి తరువాత ప్రారంభ పాండ్యులు దక్షిణభారతంలో చారిత్రాత్మకంగా మరుగున పడ్డారు.[13]
6 వ శతాబ్దం చివరిలో కడుంగోన్ (సా.శ. 590 - 620) ఆధ్వర్యంలో పాండ్యులు పునరుద్ధరించబడ్డారు. ఇది దక్షిణ భారతదేశంలో కళాభ్రాల అభివృద్ధిని కూడా సూచిస్తుంది.[14] 6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం వరకు, బదామి, చాళుక్యులు లేదా దక్కన్ రాష్ట్రకూటలు, కంచి పల్లవులు, మదురైకి చెందిన పాండ్యులు దక్షిణ భారతదేశ రాజకీయాలలో ఆధిపత్యం వహించారు. పాండ్యులు ఒకానొక సమయంలో కావేరి (చోళ దేశం), పురాతన చేరదేశం (కొంగు, మధ్య కేరళ), వెనాడు (దక్షిణ కేరళ), పల్లవ దేశం, శ్రీలంక సారవంతమైన ప్రాంతాన్ని పాలించారు. [14] 9 వ శతాబ్దంలో తంజావూరు చోళుల పెరుగుదలతో పాండ్యులు క్షీణించిన కారణంగా వారు పాండ్యులతో నిరంతరం యుద్ధంలో పాల్గొన్నారు. 13 వ శతాబ్దం చివరలో తమ అదృష్టాన్ని పునరుద్ధరించడానికి అవకాశం లభించే వరకు పాండ్యులు చోళ సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి సింహళీయులు (శ్రీలంక), చేరాలతో పొత్తు పెట్టుకున్నారు.[15]
పాండ్యులు (క్రీ.పూ.1216-1345) వారి స్వర్ణయుగంలోకి ప్రవేశించి మారవర్మ, మొదటి జాతకవర్మ సుందర పాండ్యులు సామ్రాజ్యాన్ని తెలుగు దేశంలో విస్తరించి (ఉత్తరాన నెల్లూరు [8]), దక్షిణ కేరళ,[7] శ్రీలంకను జయించింది.[7] తుంగభద్ర లోయలోని ఉచ్చంగి (9 వ -13 వ శతాబ్దం) పాండ్యులు మదురై పాండ్యులకు సంబంధించినవారని భావిస్తున్నారు.[8]
వారి చరిత్రలో పాండ్యాలు పల్లవులు, చోళులు, హొయసలలు, చేరాలు (కేరళలు) తో పదేపదే సంఘర్షణలలో పాల్గొన్నారు. 1310–11లో దక్షిణ భారతదేశం మీద ఖిల్జీ దండయాత్రతో సమాంతరంగా పాండ్య సామ్రాజ్యంలో అంతర్గత సంక్షోభం కొనసాగింది.[8] రాజకీయ సంక్షోభం మరిన్ని సుల్తానేటుల దాడులు, దోపిడీ, దక్షిణ కేరళ (1312), ఉత్తర శ్రీలంక (1323) కోల్పోవడం మదురై సుల్తానేటు స్థాపన (మ .1334 [1]).[16][17] 16 వ శతాబ్దం మధ్యలో మదురై విజయనగర రాజప్రతినిధులు స్వాతంత్ర్యం ప్రకటించి మదురై నాయక్ రాజవంశాన్ని స్థాపించారు.[8]
పాండుల ఆధ్వర్యంలో మదురైలో పురాతన సంగం ("అకాడమీలు") పేరుతో సాహిత్య కేంద్రాలు స్థాపించబడ్డాయి. కొంతమంది పాండ్య పాలకులు తాము కవులు అని చెప్పుకున్నారు. పాండ్య దేశం మదురైలోని మీనాక్షి ఆలయంతో సహా పలు ప్రసిద్ధ దేవాలయాలకు నిలయంగా ఉంది. కడుంగోన్ పాండ్య శక్తి పునరుద్ధరించిన తరువాత, శైవ నాయనార్లు, వైష్ణవ ఆల్వార్లు ప్రాముఖ్యత పొందారు.[18] పాండ్య పాలకులు చరిత్రలో స్వల్ప కాలం జైన మతాన్ని అనుసరించారని తెలిసింది.[8]
పాండ్య అనే పదం పురాతన తమిళ పదం "పాండు" నుండి ("పాతది" అని అర్ధం) ఉద్భవించిందని భావిస్తున్నారు.[19] ప్రారంభ చారిత్రాత్మక తమిళ నిఘంటువులో పాండ్య అనే పదానికి పాత దేశం అంటే చోళ అంటే కొత్త దేశం, చేరా అంటే కొండ దేశం, పల్లవ అంటే సంస్కృతంలో శాఖ అని అర్ధం.[20] పాండ్య శబ్దవ్యుత్పత్తి ఇప్పటికీ పరిశోధకులలో గణనీయమైన ఊహాగానాలకు దారితీస్తుంది. పేర్కొన్న ఉదాహరణలు కాకుండా అనేక ఇతర సిద్ధాంతాలు చారిత్రక అధ్యయనాలలో కనిపిస్తాయి.[21]
పురాతన తమిళ ఇతిహాసాల ఆధారంగా చేర, చోళ, పాండ్య అనే ముగ్గురు సోదరులు దక్షిణ నగరమైన కోర్కైలో ఉమ్మడిగా పాలించారు. పాండ్య స్వస్థలంలో ఉండగా ఆయన ఇద్దరు సోదరులు చేర, చోళ విడిపోయిన తరువాత ఉత్తర, పడమరలలో తమ సొంత రాజ్యాలను స్థాపించారు.[22] ఇతహాసం సిలప్పతికారం లోని ఒక పద్యం పాండ్యుల చిహ్నం ఒక చేప అని పేర్కొంది.[23] పాండ్యులు అనేక బిరుదులను స్వీకరించారు. వారిలో ఒకటి మీనవన్ అంటే "జాలరి" అని అర్ధం.[24]
గొప్ప ఇతిహాసాలు పురాణాలు వంటి ఉత్తర భారత సంప్రదాయాలు తరచుగా దక్షిణ భారతదేశాన్ని ఋషి అగస్త్యుడితో అనుబంధిస్తాయి (ఆయన విద్యపర్వతాలను దాటి దక్షిణాన ప్రయాణించాడు). మధ్యయుగ తమిళ సాహిత్యంలో కూడా అగస్త్యుడు ప్రముఖంగా కనిపిస్తాడు.[25]
పాండ్యుల తొలి చారిత్రక పాలకులలో అల్లి రాణి (అక్షరాలా "రాణి అల్లి") ఒకరు అని జానపద కథలు పేర్కొన్నాయి. ఆమె "అమెజోనియన్ రాణి"గా పేర్కొనబడింది. ఆమె సేవకులు పురుషులు, పరిపాలనా అధికారులు, సైన్యం మహిళలు.[26] ఆమె రాజధాని కుడిరామలై నుండి శ్రీలంక మొత్తం పశ్చిమ, ఉత్తర తీరాన్ని పరిపాలించిందని భావిస్తున్నారు. ఇక్కడ ఆమె కోటగా భావించే అవశేషాలు కనుగొనబడ్డాయి.[27] ఆమెను కొన్నిసార్లు పాండ్య అనుబంధ దేవతలు, మీనాక్షి, కణ్ణకి అవతారంగా భావించినట్లు కనిపిస్తుంది.[28]
మౌర్య చక్రవర్తి అశోకుడి (క్రీ.పూ. 3 వ శతాబ్దం) శాసనాలలో (2 వ - 13 వ ప్రధాన రాతిశాసనంలో [29]) దక్షిణ భారతదేశ ప్రజల గురించి సూచించబడింది;- చోడాలు, కేరళపుత్రులు, పాండ్యులు, సత్యపుత్రులు.[30][31] ఈ రాజ్యాలు మౌర్య సామ్రాజ్యంలో భాగం కాకపోయినప్పటికీ అశోకచక్రవర్తితో స్నేహపూర్వకంగా ఉన్నాయి:
“ | "ధర్మం ఇక్కడ జయించింది. ఇది ఆరు వందల యోజనాలు (5,400-9,600 కిమీ) దూరంలో ఉంది. ఇక్కడ గ్రీకు రాజు ఆంటియోకోస్ పాలన, అక్కడ దాటి టోలెమి, ఆంటిగోనోసు, మాగాసు, అలెగ్జాండరు అనే నలుగురు రాజుల పాలన ఉన్నట్లు, అదేవిధంగా దక్షిణభారతదేశంలో చోళులు, పాండ్యులు తామ్రపర్ణి నది వరకు పాలిస్తున్నారు.[32] | ” |
క్రీ.పూ 3, 2 వ శతాబ్దాలలో స్థాపించిన తమిళ-బ్రాహ్మిలో లిఖించబడిన మంగలం శాసనం (మదురై సమీపంలో) లో ఎపిగ్రాఫ్లో కనిపించే తొలి పాండ్యుడిగా నెడుంజెళియన్ పేరు ఉంది. ఇది జైన సన్యాసికి రాతిచెక్కడాల పడకల బహుమతిని ఇచ్చినట్లు నమోదు చేసింది. మంగూలం శాసనం ఆధారంగా నెడుంజెళియన్, కడలాన్ పూర్వపాలకులుగా తలైయంగనం నేడుంజెలియన్, పల్యగ-సలై ముడుకుడిమి పెరువాలుడి వంటి వారు ఉన్నారని భావిస్తున్నారు.[29][33]
సా.శ. మొదటి శతాబ్దంలో పాలించిన కళింగ రాజు ఖరవేల తన హతిగుంఫా శాసనంలో 132 సంవత్సరాల పాటు కొనసాగిన తమిళ దేశాల పాత సమాఖ్య ("తమీరా-దేసా-సంఘట") నాశనం చేయబడిందని, పాండ్యాల నుండి పెద్ద మొత్తంలో ముత్యాలను సంపాదించినట్లు పేర్కొంది.[31]
అదే సమయంలో పాండ్యుల చేపల చిహ్నంతో వెండి నాణేలు కూడా కనుగొనబడ్డాయి.[34]
ప్రారంభ చారిత్రాత్మక పాండ్యులు తొలి తమిళ కవిత్వం సాధకులుగా పేర్కొంటారు.[8] ఈ కవితలు పన్నెండు పాండ్య పాలకులను సూచిస్తాయి.[12] సాంప్రదాయ సమాచారం ఆధారంగా పాండ్యుల ఆధ్వర్యంలో పురాణ తమిళసంగం ("అకాడమీలు")కార్యక్రమాలు మదురైలో జరిగాయని విశ్వసిస్తున్నారు. ఇరయ్యనారు అగపోరుళ్ వంటి అనేక తమిళ సాహిత్య రచనలు సంగం పురాణకథనాలను పాండ్యులను వారి పోషణను మూడు వేర్వేరు కథనాలలో ప్రస్తావించాయి.[35]
పాండ్య పాలకులు - తలైయళంగనం, ముదుకుడిమి పెరువలుడి విజేత రెండవ నెడుంజెళియను అనేక యాగశాలా మండపాల (పల్యాగ శాలై) పోషకుడుగా ఉన్నాడని అనేక పద్యాలలో (మధురైకాంచి వంటి) ప్రస్తావించారు.[33][36]
అగనానురు, పురనానూరు సేకరణలలో లభించిన అనేక చిన్న కవితలతో సమాంతరంగా మధురైకాంచి, నెడునాళ్వడై అనే రెండు ప్రధాన రచనలు ఉన్నాయి - ఇవి ప్రారంభ చారిత్రక కాలంలో పాండ్యా దేశంలో సమాజం, వాణిజ్య కార్యకలాపాల గురించి ఒక సంగ్రహావలోకనం ఇస్తాయి. [37][38] పురనానూరు, అగనానూరు సేకరణలలో వివిధ పాండ్య పాలకులను ప్రశంసిస్తూ పాడిన కవితలు, పాలకులు స్వరపరిచినట్లు పేర్కొన్న కవితలు కూడా ఉన్నాయి.[39]
కవితలలోనే కాక తరువాత జారీచేసిన తామ్రఫలకం (సా.శ.8 వ -9 వ శతాబ్దం)లో రాజు పెరువలుడి గురించి ప్రస్తావించబడింది. [36] మధురైకాంచి రచనలో రచయిత మాంగుడి మరుదనార్, తన పోషకుడైన తలైయంగనం నెడుంజెళియనును కోర్కై ప్రభువుగా, దక్షిణ పరంతపర్ ప్రజలను రక్షించే యుద్దవీరుడిగా పేర్కొన్నాడు.[36] ఇందులో నెడుంజెళియన్ పాలనలో మదురై, పాండ్య దేశం గురించి పూర్తి నిడివి ప్రస్తావన ఉంది. ప్రసిద్ధ తలైయలంగనం (తూర్పు తంజావూరులో) యుద్ధంలో పాండ్యులు తన శత్రువులను (ఇందులో చేర, చోళులు కూడా ఉన్నారు) ఓడించారని చెబుతారు.[36] ఆయన మిళలై, ముత్తురులను, సముద్రం వెంబడి రెండు "వెల్" కేంద్రాలు (పుదుక్కొట్టైలో) గెలిచినందుకు ప్రశంసలు అందుకున్నాడు. [36] నక్కీరర్ రాసిన నెడునాళ్వడై (పట్టుపుట్టు సేకరణలో) రాజు నెడుంజెళియన్ రాజభవనం గురించిన వర్ణన ఉంది. [39]
గ్రీకు, లాటిను మూలాలు (సా.శ. ప్రారంభ శతాబ్దాలు) తమిళకం మాదిరిగానే పురాతన తమిళ దేశాన్ని "లైమిరికు" లేదా "డామిరిసు" (లేదా డైమిరిసు / డిమిరిక్సు లేదా డామిరిసు), దాని పాలక కుటుంబాలను సూచిస్తాయి.[12]
“ | "... నెల్సిండా ముజిరిసు నదీమార్గం, సముద్రమార్గంలో ఐదు వందల స్టేడియాల దూరంలో ఉంది. మరొక రాజ్యం పాండియ. ఈ ప్రదేశం [నెల్సిండా] కూడా ఒక నది మీద ఉంది. ఇది [అరేబియా] సముద్రం నుండి నూట ఇరవై స్టేడియాలు ....[43] | ” |
“ | “... పాండ్యరాజ్యాన్ని " పన్యు " అని హన్యువాంగు కూడా పేర్కొన్నాడు. ఇది టియాంజు (ఉత్తర భారతదేశం) ఆగ్నేయంలో అనేక వేల లి ... దూరంలో ఉంది. నివాసులు చిన్నవారు; చైనీయుల ఎత్తులో ఉన్నారు ... | ” |
చారిత్రకపరిశోధకుడు జాన్ ఇ. హిల్ పాన్యును పాండ్య రాజ్యంగా,[48] అయినప్పటికీ ఇతర చారిత్రకపరిశోధకులు దీనిని ఆధునిక బర్మా,[49] లేదా అస్సాంలో ఉన్న ఒక పురాతన రాజ్యంగా గుర్తించారు.[50]
“ | "చీకటి మనిషి ఇక్కడ చాలా గౌరవనీయమైనవాడు, అంత చీకటిగా లేని ఇతరులకన్నా మంచివాడు. ఈ ప్రజలు తమ దేవుళ్ళను, వారి విగ్రహాలను నల్లగా, వారి దెయ్యాలను మంచులా తెల్లగా చిత్రీకరిస్తారు. దేవుడు, సాధువులందరూ నల్లగా ఉన్నారని, దెయ్యాలన్నీ తెల్లగా ఉన్నాయని వారు చెప్తారు. అందుకే నేను వివరించినట్లు వారు వాటిని చిత్రీకరిస్తారు.[54] | ” |
మౌర్య చక్రవర్తి అశోకుడు (క్రీ.పూ. 3 వ శతాబ్దం) శ్రీలంక ప్రజలతో (చోళులు, పాండ్యులు, సత్య పుత్రులు, కేరళ పుత్రులు, తామ్రపర్ణులు) ప్రజలతో కలిసిన దక్షిణ భారతదేశంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాడు. సుదూర దక్షిణ భారతదేశాన్ని (తమిళకం - తమిళుల నివాసం) జయించటానికి అశోకుడు ప్రయత్నించినట్లు సూచనలు లేవు.[55]
ప్రారంభ చారిత్రాత్మక దక్షిణ భారతదేశాన్ని పాలించిన మూడు ప్రధాన పాలకులు - చేరాలు, పాండ్యులు చోళులు - మూ- వేందర్ ("ముగ్గురు పాలకులు") గా పిలువబడ్డారు. వారు తమిళనాడులోని వారి రాజధానులను (కరూరు, మదురై, ఉరైయూరు) కేంద్రంగా చేసుకుని పాలించారు.[9] ప్రారంభ చారిత్రాత్మక దక్షిణ భారతదేశం రాజకీయ, ఆర్థిక జీవితంలో మూ వేందరు అనే మూడు శక్తివంతమైన ప్రధాన రాజ్యాలు ఆధిపత్యం వహించాయి.[56] చేరా, చోళ, పాండ్యుల మధ్య తరచూ జరిగే యుద్ధాలు పురాతన (సంగం) తమిళ కవిత్వంలో చక్కగా నమోదు చేయబడ్డాయని తెలుస్తోంది. [57] చేరాలు, చోళులు, పాండ్యాలు వరుసగా ముళిరీలు (ముచిరి), కోర్కై, కావేరి నౌకాశ్రయాలను కూడా నియంత్రించారు. (గ్రెకో-రోమన్ ప్రపంచంతో వాణిజ్యం కోసం).[9]
తరువాతి కాలంలో ప్రధాన సంస్థానాల నుండి స్వతత్ర రాజ్యాలకు క్రమంగా మారడం జరిగినట్లు భావిస్తున్నారు. [56]
రాజు ఖరవేల స్థాపించిన ప్రసిద్ధ హతిగుంప శాసనం (క్రీ.పూ. మొదటి శతాబ్దం మధ్యకాలం[9]) కళింగకు ముప్పుగా ఉన్న "ట్రామిరా" దేశాల సమాఖ్య ఓటమిని గురించి ప్రస్తావించింది. ఇది "పాండ్యా" రాజ్యం నుండి కొల్లగొట్టిన విలువైన ముత్యాలు రాజధానికి తీసుకువచ్చినట్లు సూచిస్తుంది.[58] ముత్యపు చిప్పల పెంపకం, పట్టు పరిశ్రమకు పాండ్య ఆస్థానం ప్రసిద్ధి చెందింది.[9] కోర్కై, అలగంకుళం పాండ్యుల మార్పిడి కేంద్రాలుగా భావిస్తున్నారు. కొంబై, తాంబ్రపర్ణి ఉప నది వద్ద ఉన్న ఓడరేవు ప్రసిద్ధ ముత్యాల మత్స్యకారులతో ముడిపడి ఉన్న అలగంకుళం కూడా ఓడరేవుగా అభివృద్ధి చేయబడింది. [59]
ఈ ప్రాంతంలో ప్రారంభ పాండ్యులకు చెందిన అనేక నాణేలు కనుగొనబడ్డాయి.[57] పాండ్య దేశంలో క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దంలో రాజూలు, సంపన్నులు జారీచేసిన శాసనాలు కూడా కనుగొనబడ్డాయి.[60]
మూ "వేందరు" పాలకులలో పాండ్యులు ప్రముఖులు. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి పాండ్య రాణి గురించి తమిళ దేశాల సమాఖ్య సూచిస్తుంది.[9] దక్షిణ భారతదేశంలో తమిళ మాట్లాడేవారికి దక్షిణ తమిళనాడులోని మదురై ప్రధానమైన సాంస్కృతిక కేంద్రంగా ఉంది.[60] దక్షిణ భారతదేశంలో మెహాలిర్లు, డాల్మెన్లు, ఎర్న్ సమాధులు, రాతి వృత్తాలు, గుహలు, నడక మార్గాలు వంటి మెగాలిథికు అవశేషాలను చూడవచ్చు. ఖననం చేసే వస్తువులలో ఇనుప వస్తువులు, దంతపు ఆభరణాలు, బ్లాక్-అండ్-రెడ్ పాత్రలు, కొన్ని రోమన్ సామ్రాజ్య నాణేలు కూడా ఉన్నాయి. [61] ఈ మెగాలిథికు ఖననాలతో "వెలిర్" కొండ అధిపతులు అని పిలువడే ప్రజలు సంబంధం కలిగి ఉంటారని భావించబడుతుంది.[56]
గ్రీకు, లాటిన్ వృత్తాంతాలు (క్రీ.పూ. ప్రారంభ శతాబ్దాలు), తమిళ-బ్రాహ్మి లిపిలో ఇతిహాసాలతో కూడిన నాణేలు, తమిళ-బ్రాహ్మి శాసనాలు పాండ్య రాజవంశం క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం నుండి సా.శ. ప్రారంభ శతాబ్దాల వరకు కొనసాగిందని సూచిస్తున్నాయి. [12] కాలభ్రా రాజవంశం చేరాలు, చోళులతో కలిసి ప్రారంభ పాండ్యులను స్థానభ్రంశం చెందేలా చేసారు. [13]
ప్రారంభ చారిత్రాత్మక దక్షిణ భారతదేశానికి చెందిన పాండ్య పాలకుల పాక్షిక జాబితా క్రిందిది:[62] ప్రారంభ తమిళ కవితలలో పన్నెండు పాండ్య పాలకులు ఉన్నారు.[12]
- కూన్ పాండ్యా
- మొదటి నేడుంజెలియన్ ("ఆరియా పడై కడంద")
- పుడ-పాండ్య
- "పల్యగసలై" ముడుకుదుమి పెరువలుడి [33]
- రెండవ నెడుంజెళియన్
- నాన్ మారన్
- మూడవ నెడుం చెళియన్ ("తలైయలంగనాతు సెరువేంద్ర")[33]
- మారన్ వలుడి
- కడలాన్ వలుది
- ముసిరి ముత్రియా చెళియన్
- ఉక్కిర పెరువలుడి
పాండ్య రాజ్యాన్ని 6 వ శతాబ్దం చివరిలో రాజు కడుంగోన్ (సా.శ. 590–620[14]) పునరుద్ధరించాడు.[8][64] వెల్వికుడి శాసనం, తరువాత రాగిఫలకాలలో, కడుంగోన్ "బ్రాహ్మణ వ్యతిరేక" కలభ్రా రాజుల "నాశకుడిగా"గా పేర్కొనబడింది.[14] కళాభ్రా రాజవంశం క్షీణించడంతో పాండ్యులు అధికారంలో, రాజ్యవిస్తరణ అభివృద్ధి చెందుతుంది. ఉరైయూరులో చోళులు ఉన్నారన్నది అస్పష్టంగా ఉన్నప్పటికీ తమిళ దేశం కాంచీలోని పల్లవులు, మదురై పాండ్యాల మధ్య విభజించబడింది.
6 వ శతాబ్దం నుండి 9 వ శతాబ్దం వరకు బాదామి చాళుక్యులు, కంచిలోని పల్లవులు, మదురైకి చెందిన పాండ్యాలు దక్షిణ భారతదేశ రాజకీయాలలో ఆధిపత్యం వహించారు. బాదామి చాళుక్యుల స్థానాన్ని చివరికి దక్కనులో రాష్ట్రకూటలు భర్తీ చేశారు.[65] పాండ్యాలు దక్షిణ భారతదేశంలో పెరుగుతున్న పల్లవులను నియంత్రించారు. ఎప్పటికప్పుడు వారు దక్కన్ పీఠభూమి రాజ్యాలతో (క్రీ.పూ. 8 వ శతాబ్దం చివరలో తలాకాడ్ గంగాతో) పొత్తులు కుదుర్చుకున్నారు.[60] 9 వ శతాబ్దం మధ్యలో పాండ్యులు కుంబకోణం (కొల్లిడం నది మీద తంజావూరుకు ఈశాన్యం) వరకు ముందుకు సాగారు.[60]
మదురైలోని పాండ్యులలో మూడవ రాజు అయిన సెందన్ (సా.శ. 654–70) తన రాజ్యాన్ని చేరా దేశం (పశ్చిమ తమిళనాడు, మధ్య కేరళ) వరకు విస్తరించి ప్రసిద్ధి చెందాడు. నాల్గవ పాండ్యుని పాలకుడు అరికేసరి మరవర్మ (సా.శ. 670–700), కంచిలోని పల్లవులతో జరిగిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందాడు. పల్లవ రాజు మొదటి నరసింహవర్మ (r.సా.శ. 630-68), బాదామిని జయించిన ప్రసిద్ధుడు, పాండ్యులను ఓడించాడని పేర్కొన్నారు. చాళుక్య రాజు మొదటి పరమేశ్వరవర్మ "విక్రమాదిత్య" (సా.శ.670-68)పల్లవులు, గంగాలు, బహుశా కావేరీ ముఖద్వారం సమీపంలో పాడ్యులతో కూడా యుద్ధంచేసాడని ప్రతీతి.[14]
చివరి చాళుక్య రాజు రెండవ కీర్తివర్మ (r.సా.శ. 744 / 5–55), పాండ్యులతో జరిగిన యుద్ధాల ఫలితంగా తన దక్షిణాది దేశాలను కోల్పోయాడు. 760 లో గంగాలను ఓడించగలిగిన పల్లవ రాజు రెండవ నందివర్మ పల్లవమల్లుడు (r. సా.శ.731–96) ను పాండ్య రాజులు మారవర్మ, మొదటి రాజసింహ (సా.శ. మొదటి వరగుణవర్మ పల్లవ దేశం మీద దాడి చేసి కొంగు దేశం (పశ్చిమ తమిళనాడు) వెనాడు (దక్షిణ కేరళ) ను జయించాడు. శ్రీమర శ్రీవల్లభ (సా.శ. 815–62) శ్రీలంకకు ప్రయాణించి రాజు మొదటి సేనను లొంగదీసుకుని ఆయన రాజధాని అనురాధపురాను తొలగించారు (కొంతకాలం తరువాత శ్రీలంక మీద పాన్య దండయాత్ర జరిగింది).[14] ఏదేమైనా శ్రీమర శ్రీవల్లభను త్వరలోనే పల్లవ రాజు నృపతుంగ (r.సా.శ. 859-99) అధిగమించాడు. శ్రీలంక రాజు రెండవ సేన పాండ్య దేశం మీద దండెత్తి, మదురైని కొల్లగొట్టి రెండవ వరగుణవర్మ (r. C.సా.శ. 862–880[66])ను కొత్తరాజుగా ఎన్నుకున్నాడు.[14] సా.శ. 825 లో కేరళ క్యాలెండరు కొల్లం యుగం ప్రారంభం పాండ్య నియంత్రణ నుండి వేనాడు విముక్తిని సూచిస్తుంది.[67]
దంతివర్మ పాలనలో (సా.శ. 796–847) పల్లవ భూభాగం దక్షిణం నుండి పాండ్యుల (రాష్ట్రకూటలు, ఉత్తరభూభాగంలోని తెలుగు-చోడులు) ఆక్రమణ కారణంగా కొంత క్షీణించింది. పల్లవరాజు మూడవ నందివర్మ (r. సా.శ. 846-69) గంగాలు, అభివృద్ధి చెందుతున్న చోళుల సహాయంతో పాండ్యాలు, తెలుగు-చోడులను (రాష్ట్రకూటలను కూడా) ఓడించగలిగారు.[14]
పాండ్య రాజుల కాలక్రమ చారిత్రాత్మక జాబితా.[66]
పాండ్యులు, రాష్ట్రకూటలు పల్లవులను ఎదిరించడంలో నిమగ్నమై ఉండగా, కావేరి డెల్టాలో గంగా, సింహళీయులు (శ్రీలంక) చోళులతో కలిసి తంజావూరు అధిపతులుగా ఉద్భవించారు.[68] (ముదరాయరు అధిపతి వారి విధేతతను పల్లవుల నుండి పాండ్యులకు మార్చుకున్నారు.[69]). సా.శ.850 నాటికి ముదరాయరు అధిపతిని ఓడించి చోళరాజు విజయాలయ తంజావూరును జయించాడు.[69] ఈ చర్య ద్వారా కావేరి నదికి ఉత్తరాన ఉన్న పాండ్యుల నియంత్రణ తీవ్రంగా బలహీనపడింది (పల్లవ పాలకుడు న్రిపతుంగ స్థానాన్ని శక్తివంతం చేసింది).[69] ప్రతిస్పందనగా పాండ్య పాలకుడు రెండవ వరగుణ-వర్మ (rc సా.శ. 862–880 [66]) చోళ దేశంలోకి ప్రవేశించి పల్లవ యువరాజు అపరాజిత, చోళ రాజు ఆదిత్య, గంగా రాజు మొదటి పృధ్వీపతులతో కూడిన బలీయమైన కూటమిని ఎదుర్కొన్నాడు. ఈ కూటమి ఏర్పాటు కుంబకోణం సమీపంలో జరిగిన యుద్ధంలో పాడ్యరాజు ఓటమికి (సా.శ. 880) దారితీసింది.[69]
చోళ రాజు మొదటి ఆదిత్య పల్లవ (సి. సా.శ. 897) గంగా, కొంగు దేశాలకు పూర్వ అధిపతిగా ఉండేవాడు. మొదటి ఆదిత్య (r. సా.శ. 880-900) పాండ్యరాజు పరాంతక వీరనారాయణ నుండి కొంగు దేశాన్ని స్వాధీనం చేసుకుని ఉండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.[69] ఆదిత్య వారసుడు మొదటి పరాంతక (సా.శ. 910 లో) పాలనలో ఉన్న పాండ్య భూభాగాల మీద దాడి చేసి మదురై రాజు మారవర్మ, రెండవ రాజసింహ ఆధీనంలో ఉన్న భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు. (అందుకే "మదురై కొండా" అనే బిరుదు).[69] రెండవ రాజసింహ శ్రీలంక రాజు ఐదవ కస్సాపా సహాయం పొందినప్పటికీ వేలూరు యుద్ధంలో మొదటి పరాంతక చేతిలో ఓడిపోయి శ్రీలంకకు పారిపోయాడు. శ్రీలంకలో తన రాజ చిహ్నాన్ని కూడా విడిచిపెట్టి రాజసింహ చేరా దేశంలో ఆశ్రయం పొందాడు.[69]
సా.శ. 949 లో తక్కోలం యుద్ధంలో చోళులను రాష్ట్రకూట-నాయకత్వ సమాఖ్య ఓడించింది.[15] 950 ల నాటికి చోళ రాజ్యం ఒక చిన్న రాజ్యం పరిమాణానికి తగ్గిపోయింది (దక్షిణాదిలోని చోళుల సామంతరాజ్యాలు స్వాతంత్ర్యాన్ని ప్రకటించాయి).[15] పాండ్య పాలకుడు వీర పాండ్యుడు చోళ రాజు గండరాదిత్యను ఓడించి స్వాతంత్ర్యం ప్రకటించి ఉండవచ్చు.[15] ప్రతిస్పందనగా చోళ పాలకుడు రెండవ సుందర పరాంతక (r. 957–73) రెండు యుద్ధాలలో వీర పాండ్యుని ఓడించాడు. (చోళ యువరాజు రెండవ ఆదిత్య రెండవ సందర్భంలో వీర పాండ్యుని చంపాడు). రాజు నాలుగవ మహీంద శ్రీలంక దళాలు పాండ్యులకు సహాయం చేశాయి.[15]
చోళ చక్రవర్తి మొదటి రాజరాజా (r.క్రీ.పూ. 985-1014) పాండ్యుల మీద దాడి చేసినట్లు భావిస్తున్నారు.[60] ఆయన పాండ్య, చేర, శ్రీలంక రాజుల కూటమికి వ్యతిరేకంగా పోరాడాడు. యుద్ధంలో చేరాలను ఓడించి, పాండ్యులను వారి ప్రాచీన రాజధాని మదురై నుండి తరిమాడు.[70] మొదటి రాజేంద్ర చోళచక్రవర్తి పాండ్య రాజ్యాన్ని ఆక్రమించడం కొనసాగించి మదురై (పాండ్య, పశ్చిమ చేరా / కేరళ దేశాల మీద)కు "చోళ పాండ్యా" అనే శీర్షికతో చోళ రాజప్రతినిధులను నియమించాడు. చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు పాలనప్రారంభంలో (సా.శ.1070) శ్రీలంకను కోల్పోయాడు. అదేసమయంలో పాండ్య దేశంలో తిరుగుబాటు తలెత్తింది.[70]
12 వ శతాబ్దం రెండవ భాగంలో పాండ్యదేశంలో (రాజకుమారులు పరక్రామ పాండ్య, కులశేఖర పాండ్య మధ్య) తీవ్రమైన అంతర్గత సంక్షోభం కనిపించింది. కులశేఖరల ఆధ్వర్యంలో శ్రీలంక పొరుగు రాజ్యాలు, మొదటి పరాక్రమబాహు, వెనాడు చేర (కేరళ),[70] చోళులు, రెండవ రాజధీరాజ నాయకత్వంలో మూడవ కులోత్తుంగ చోళుడి ఇద్దరు యువరాజులు కలిసారు.[71][70]
ఈ క్రింది జాబితా 10 వ శతాబ్దం, 11 వ శతాబ్దం మొదటి భాగంలో చురుకుగా ఉన్న పాండ్య రాజుల జాబితా.
- మొదటి సుందర పాండ్య.
- మొదటి వీర పాండ్య.
- రెండవ వీర పాండ్య
- అమరభూజంగా తివ్రాకోపా
- జాతవర్మ సుందర చోళ పాండ్య
- మారవర్మ విక్రమ చోళ పాండ్య
- మరవర్మ పరక్రామ చోళ పాండ్య
- జాతవర్మ చోళ పాండ్య
- శ్రీవల్లభ మనకులచల (సా.శ. 1101–1124)
- మరవర్మ శ్రీవల్లభ (సా.శ.1132–1161)
- మొదటి పరాక్రమ పాండ్య (సా.శ.1161–1162)
- మూడవ కులశేఖర
- మూడవ వీర పాండ్య
- జాతవర్మ శ్రీవల్లభ (సా.శ. 1175–1180)
- మొదటి జాతవర్మ కులశేఖర (సా.శ.1190–1216)[72]
పాండ్య సామ్రాజ్యంలో విస్తృతమైన భూభాగాలు ఉన్నాయి. కొన్ని సమయాలలో దక్షిణ భారతదేశం, శ్రీలంకలోని పెద్ద భాగాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయి. మదురైలోని పాండ్య రాజు మదురై ఆధీనంలో ఉన్న కుటుంబ శాఖల ద్వారా ఈ విస్తారమైన ప్రాంతాలను నియంత్రించాడు.[8] ఈ రాజ్యం కుటుంబంలోని అనేక రాజకుటుంబంలోని పురుషసభ్యుల మద్య పంచుకోబడింది. వారిలో ఒకరికి మాత్రం మిగతా వారి మీద నియంత్రణ ఉండేది.[73]
13 వ శతాబ్దంలో ప్రధాన పాండ్య నాయకర్లతో కలిపి ఏడుగురు ప్రధాన పాండ్య "చక్రవర్తులు" (ఎల్లార్కు నాయనార్ - అందరి ప్రభువు) రాజ్యపాలన చేసారు. వారి శక్తి 13 వ శతాబ్దం మధ్యలో మొదటి జాతవర్మ సుందర పాండ్య ఆధ్వర్యంలో పాండ్యరాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది.[74]
- మొదటి మారవర్మ సుందర పాండ్య (సా.శ.1216–1238)
- రెండవ సుందరవర్మ కులశేఖర (సా.శ.1238–1240)
- రెండవ మారవర్మ సుందరపాండ్య (క్రీ.-శ 1238–1251)
- మొదటి జాతవర్మ సుందరపాండ్య (సా.శ.1251–1268)
- మొదటి మారవర్మను కులశేఖర పాండ్య (సా.శ.1309-1345)
- 4 వ సుందర పాండ్య (సా.శ.1309–1327)
- 4వ వీర పాండ్య (సా.శ.1309–1345)
13 వ శతాబ్దం ప్రారంభంలో తన అన్నయ్య జాతవర్మ కులశేఖర తరువాత అధికార పీఠం అధిష్టించిన మొదటి మారవర్మ సుందర పాండ్య దక్షిణ భారతదేశంలో పాండ్య ఆధిపత్యానికి పునాదివేసాడు.[74][75] ఆయన చోళ దేశం మీద దండెత్తి, ఉరైయూరు, తంజావూర్లను ఆక్రమించి చోళ రాజు మూడవ కులోతుంగను తరిమివేసాడు.[75][76] చోళ రాజు మారవర్మ మొదటి సుందర పాండ్యుని అధిపత్యాన్ని అంగీకరించి ఆయనకు సామంతుడయ్యాడు.[75] తదుపరి చోళ రాజు మూడవ రాజరాజా (సా.శ.1216 - 46[7]) స్వయం పాలన కోసం చేసిన ప్రయత్నించాడు. (పాండ్య దేశంలోకి చోళుల దండయాత్రను ఆపడానికి చేసిన ప్రయత్నాలు[7]). హొయసల రాజు రెండవ నరసింహ (r.సా.శ. 1220 - 1238) కాలంలో కావేరి లోయలోని మహేంద్రమంగళం వద్ద పాండ్య, హొయసల దళాల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో మొదటి మారవర్మ సుందర పాండ్య ఓడిపోయాడు. పాండ్యుల బలహీనతను ఆసరాగా చేసుకుని మూడవ రాజరాజ చోళ దేశాన్ని తిరిగి పునరుద్ధరించాడు.[75] కొంతకాలం తరువాత చోళ యువరాజు మూడవ రాజేంద్ర పాండ్యుల మీద దాడి చేశాడు. రెండవ మారవర్మ సుందర పాండ్యునితో సహా ఇద్దరు పాండ్య నాయకర్లను ఓడించాడు.[75] అప్పుడు హొయసల రాజు సోమేశ్వర (r.సా.శ. 1233 - 1267 [7]) పాండ్యుల సహాయానికి వచ్చి మూడవ రాజేంద్రని ఓడించి చోళుల నుండి శాంతిస్థాపించాడు.[75][76]
సా.శ. 1251 లో జాతవర్మ మొదటి సుందర పాండ్యుడు పాండ్య సింహాసనాన్ని అధిష్టించాడు.[7] తరువాత ఆయన తన సైన్యాన్ని చోళ దేశానికి (నెల్లూరు వరకు), శ్రీలంకకు, దక్షిణ కేరళకు నడిపించాడు.[7] హొయసల నియంత్రణను మైసూరు పీఠభూమికి పరిమితం చేయడంలో కూడా ఆయన విజయం సాధించాడు (పురాతన చోళ దేశాన్ని పాండ్యులు [7]).[75] ఆక్రమించారు). కంచి రాజ్యంలో రెండవ ప్రధాన నగరంగా పనిచేసింది.[75] తన విజయాలలో మొదటి జాతవర్మ సుందర పాండ్యునికి జాతవర్మ వీర పాండ్యుడు వంటి పాండ్య రాజకుటుంబీకులు సహాయపడ్డారు. [75]
సా.శ. 1258-1260 నాటికి మొదటి జాతవర్మ సుందరపాండ్యుడు మూడవ రాజేంద్రచోళుడిని అణిచివేసి ఆయనను సామంతుడిని చేసాడు.[7] సా.శ.1279లో చోళుల పాలన ముగిసింది c.మూడవ రాజేంద్రతో 1279 ..[75] పాండ్యులు కవేరిలోని హొయసల మీద దాడి చేసి కన్ననూరు కొప్పం కోటను స్వాధీనం చేసుకున్నారు. హొయసల రాజు సోమేశ్వరుడు తిరిగి మైసూరు పీఠభూమికి పరిమితం అయ్యాడు.[75] హొయసల రాజు ఉత్తరం, దక్షిణం నుండి శత్రువులచే ఒత్తడిని ఎదుర్కొన్న కారణంగా తన రాజ్యం దక్షిణ భాగాన్ని తన చిన్న కుమారుడు రామనాథకు "కేటాయించాడు" (r. 1254–1292[7]). 1262 లో వీర సోమేశ్వరుడు పాండ్యపాలకుల చేత చంపబడ్డాడు.[75] రామనాథ పాండ్య శక్తికి వ్యతిరేకంగా పోరాడి కన్ననూరుకోటను తిరిగి స్వాధీనం చేసుకోగలిగాడు. [73][77][78] మొదటి జాతవర్మ సుందర పాండ్యుడు కడవ పాలకుడు రెండవ కొప్పరుంజింగాతో కూడా పోరాటం చేసాడు.[75][79] హొయసలు, కడవాసులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల ఫలితంగా కొంగు దేశాలు పాండ్య పాలనలో వచ్చాయి.[75] మొదటి జాతవర్మ సుందర కాకతీయ పాలకుడు గణపతి (సా.శ. 1199-1262) తో కూడా పోరాడారు.[7]).[73] 1258 లో మొదటి జాతవర్మ సుందర పాండ్యుడు శ్రీలంక మీద కూడా దాడి చేశాడు. [80] ఆయన తరపున ఆయన తమ్ముడు రెండవ జాతవర్మ వీరపాండ్యుడు సా.శ. 1262 - 1264 మధ్య శ్రీలంక మీద దాడి చేశాడు.[81] సా.శ. 1270 లో ఈ ద్వీపం తిరిగి రెండవ జాతవర్మన్ వీరపాండ్యుని చేత ఆక్రమించబడింది.[82]
మొదటి సుందర పాండ్యుని (1268 లో మరణించారు) తరువాత మొదటి మారవర్మ కులశేఖర పాండ్యుడిని [73] 1279 లో హొయసల రాజు రామనాధుడిని మూడవ రాజేంద్ర సంయుక్త సైనికశక్తి ఓడించింది.[73] తరువాత మొదటి మారవర్మ కులశేఖర అధీనంలో లేని చోళ దేశం, హొయసల రాజ్యంలో తమిళం మాట్లాడే దక్షిణ భూభాగాలను పరిపాలించాడు. ఆయన మొదటి భువనైకాబాహు పాలించిన శ్రీలంక మీద దాడి చేశాడు. "పాండ్య దేశానికి గౌరవనీయమైన " దంతశేషం ", ద్వీపం సంపద దోచుకున్నాడు.[73] సా.శ. 1308-09 వరకు శ్రీలంక పాండ్యా నియంత్రణలో ఉంది.[73]
మొదటి మారవర్మ కులశేఖర (1310) మరణం తరువాత ఆయన కుమారులు 4వ వీర పాండ్యుడు, 4 వ సుందర పాండ్యుడు సామ్రాజ్యం నియంత్రణాధికారం కొరకు వారసత్వ యుద్ధం చేశారు. మరవర్మ కులశేఖర తన తరువాత వీర పాండ్యుని రాజును చేసాడు. స్వల్ప కాలం తరువాత సుందర పాండ్యుడు వీరపాండ్యుని ఓడించాడు.[83] దురదృష్టవశాత్తు, పాండ్య అంతర్యుద్ధం దక్షిణ భారతదేశంలో ఖిల్జీ దాడులతో సమాంతర కాలంలో సాగింది.[84] రాజకీయ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పొరుగున ఉన్న హొయసల రాజు మూడవ బల్లాల పాండ్య భూభాగం మీద దాడి చేశాడు. ఏదేమైనా ఖిల్జీ సేనాధిపతి " మాలిక్ కాఫూర్ " అదే సమయంలో తన రాజ్యం మీద దండయాత్ర కారణంగా బల్లాలా తన రాజధానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.[85] మూడవ బల్లాలాను లొంగదీసుకున్న తరువాత ఖిల్జీ దళాలు 1311 మార్చిలో పాండ్య భూభాగానికి వెళ్ళాయి.[86] ఇది తెలుసుకున్న పాండ్య సోదరులు వారి రాజధాని నుండి పారిపోయారు. ఖిల్జీలు వారిని జయించడంలో సఫలం కాలేదు.[87][88]1311 ఏప్రెలు చివరి నాటికి ఖిల్జీలు పాండ్య యువరాజులను వెంబడించే ప్రణాళికలను వదులుకుని నగరాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి తిరిగి వెళ్ళారు.[89][90] 1312 నాటికి దక్షిణ కేరళ మీద కూడా పాండ్యులు నియంత్రణ కోల్పోయారు.[8]
ఖిల్జీల నిష్క్రమణ తరువాత, వీర పాంద్యుడు, సుందర పాండ్యుడు తమ సంఘర్షణలను తిరిగి ప్రారంభించారు. సంఘర్షణలో సుందర పాండ్యుడు ఓడిపోయి ఖిల్జీల సహాయం కోరాడు. వారి సహాయంతో ఆయన 1314 నాటికి దక్షిణ ఆర్కాటు ప్రాంతం మీద తిరిగి నియంత్రణ సాధించాడు.[90] తదనంతరం 1314 లో ఖుస్రో ఖాను నేతృత్వంలోని సుల్తానేటు, 1323 లో సుల్తాన్ గియాత్ అల్-దిన్ తుగ్లకు ఆధ్వర్యంలో ఉలుగ్ ఖాన్ (ముహమ్మద్ బిన్ తుగ్లక్) నాయకత్వంలో రెండు దండయాత్రలు జరిగాయి.[90]
కుటుంబ కలహాలు, సుల్తానేటు దండయాత్రలు పాండ్య సామ్రాజ్యాన్ని ముక్కలు చేశాయి.[8] నాణేల పరిశోధనలు పాండ్యులు పాత దక్షిణ ఆర్కాట్ ప్రాంతానికి పరిమితం అయినట్లు సూచిస్తున్నాయి.[91] 1323 లో జాఫ్నా రాజ్యం విచ్ఛిన్నమైన పాండ్య ప్రభావం నుండి తప్పించుకుంటూ స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది.[16][17]
మునుపటి సుల్తానేటు దాడులు దోపిడీతో నిండి ఉండగా ఉలుగు ఖాన్ (తరువాత ముహమ్మదు బిన్ తుగ్లక్ [1]) నేతృత్వంలోని తుగ్లక్లు మాజీ పాండ్య భూభాగాన్ని మాబర్ ప్రావింసుగా సుల్తానేటులో విలీనం చేసారు. క్రమంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువ భాగం సుల్తానేటు పాలనలో చేర్చబడింది. దేవగిరి, టైలింగు, కంపిలి, డోరసముద్ర, మాబారు అనే ఐదు ప్రావిన్సులుగా విభజించబడింది. [91] కొత్తగా సృష్టించిన దక్షిణ-మాబర్ ప్రావింసు రాజప్రతినిధిగా జలాల్ ఉద్-దిన్ హసన్ ఖాన్ నియమితుడయ్యాడు.[92][93] సి. 1334 జలాల్ ఉద్-దిన్ హసన్ ఖాన్ తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించి మదురై సుల్తానేటును సృష్టించాడు.[1] పాండ్యులు రాజధానిని దక్షిణకాశీకి మార్చారు. 16 వ శతాబ్దం చివరి వరకు ఒక చిన్న ప్రాంతాన్ని పాలించారు.[1]
విజయనగర సామ్రాజ్యానికి చెందిన మొదటి బుక్కరాయ మదురై నగరాన్ని సా.శ. 1370.[1] సుల్తానును ఖైదు చేసి ఆర్కాటు యువరాజు సంబువరాయను సింహాసనం మీద అధిష్టింప చేసి పునరుద్ధరించారు. మొదటి బుక్క రాయ తన కుమారుడు వీర కుమార కంపనను తమిళ ప్రాంత రాజప్రతినిధిగా నియమించారు. ఇంతలో మదురై సుల్తానేటు స్థానంలో 1378 లో విజయనగర నాయక రాజప్రతినిధులు పాలకులుగా వచ్చారు.[94] 1529 లో నాయకు గవర్నర్లు స్వాతంత్ర్యం ప్రకటించారు. మదురై నాయక్ రాజవంశం స్థాపించారు. [8]
గ్రెకో-రోమన్ వ్యాపారులు నేటి దక్షిణ భారతదేశంలోని పురాతన తమిళ దేశం, శ్రీలంకలను తరచూ సందర్శిస్తూ, పాండ్య, చోళ, చేర కుటుంబాల తమిళ నాయకులతో పరిచయాలను ఏర్పరుచుకున్నారు.[10] పాశ్చాత్య నావికులు పురాతన తమిళ ప్రాంతంలోని నౌకాశ్రయాలలో అనేక వాణిజ్య స్థావరాలను స్థాపించారు.[10]
టోలెమిక్ రాజవంశం కాలంలో గ్రీకో రోమన్ కాలం నుండి ఆగ్నేయాసియా వ్యాపారం వర్ధిల్లింది.[95] సాధారణ యుగం ప్రారంభానికి కొన్ని దశాబ్దాల ముందు పాశ్చాత్య రోమన్ సామ్రాజ్యం పతనం తరువాత కూడా ఇది చాలా కాలం పాటు కొనసాగింది.[96][97] సా.శ. 7 వ శతాబ్దంలో మద్యప్రాచ్యంలో బైజాంటియం ఈజిప్టు, ఎర్ర సముద్రం ఓడరేవులను కోల్పోయిన తరువాత కూడా దక్షిణ భారతదేశం, మధ్యప్రాచ్యం మధ్య సంబంధాలు కొనసాగాయి.[98]
దక్షిణ ఆసియా తీవ్ర నైరుతి కొన వద్ద ఉన్న పాండ్య దేశం భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమైన సమావేశ కేంద్రంగా పనిచేసింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం మధ్య నౌకారవాణాను అనుసంధానించే ముఖ్య అంశంగా ఈ స్థానం ఆర్థికంగా, భౌగోళికంగా ప్రధాన కేంద్రంగా ఉంది.
ముగ్గురు రాజుల చిహ్నాలతో ముద్రించిన తమిళకం ప్రారంభ నాణేలు పులి, చేపలు, విల్లు చిహ్నాలను కలిగి ఉన్నాయి. ఇవి చోళులు, పాండ్యాలు, చేరాల చిహ్నాలను కనిపిస్తాయి.[99] పాండ్య నాణేలు వేర్వేరు కాలాలలో వివిధ పాండ్య పాలకుల చారిత్రక అంశాలను కలిగి ఉన్నాయి.
ప్రారంభ కాలంలో పాండ్యులు వెండి పంచ్-మార్కు నాణ్యాలు, డై కొట్టిన రాగి నాణేలను విడుదల చేసింది.[100] ఈ కాలానికి చెందిన కొన్ని బంగారు నాణేలు కూడా పాండ్య పాలకులకు చెందినవని భావించబడుతున్నాయి. ఈ నాణేలు పాండ్యుల రాజచిహ్నాం అయిన చేపల బొమ్మను, ఒంటరిగా లేదా జతగా ముద్రించబడి ఉంటాయి.[101]
కొన్ని నాణేలలో సుందర పాండ్యుని పేర్లు ఉన్నాయి. అదనందా ముద్రించిన నాణెంలో కేవలం 'సు' అనే అక్షరం ఉంది. కొన్ని నాణేలు 'వీర-పాండ్య ' చారిత్రక చిహ్నం అయిన పంది చిహ్నం కలిగి ఉంది.[102] ఆ నాణేలను పాండ్యులు, చోళులు, సంస్థానాధీశులు జారీ చేశారని చెప్పబడినప్పటికీ ఇవి ఏ ప్రత్యేక రాజుకూ ఆపాదించలేదు.
పాండ్యుల నాణేలు ప్రాథమికంగా చతురస్రంగా ఉండేవి. ఆ నాణేలను ఒక వైపు ఏనుగు, మరొక వైపు ఖాళీగా ముద్రించబడ్డాయి. పాండ్యుల కాలంలో వెండి, బంగారు నాణేల మీద ఉన్న శాసనం తమిళ-బ్రాహ్మి భాషలలో ఉంది. రాగి నాణేలు తమిళ చారిత్రక చిహ్నాలను కలిగి ఉన్నాయి.[103]
చేపల చిహ్నాలను కలిగి ఉన్న పాండ్యాల నాణేలను 'కోదండరాముడు ' ని 'కంచి' వళంగుం పెరుమాళు (తెలుగు:పూజించే పెరుమాళు) 'అని పిలుస్తారు.[104] ఇవి కాక, ఒక వైపు నిలబడి ఉన్న రాజు, మరోవైపు చేపల చిహ్నాలను కలిగి ఉన్న నాణేల మీద 'ఎల్లాం తలైయణం'అనే తమిళ పదం కనిపించింది. గరుడపక్షిని కలిగి ఉన్న నాణేల మీద'సమరకోలాహలం', 'భువనైకవిరం' అన్న తమిళ పదాలు ఉంటాయి. ఒక ఎద్దు ఉన్న నాణేల మీద ' కోనేరిరాయన్' తమిళపదం, ఒక జత పాదాలను వర్ణించే నాణేల మీద 'కలియుగరామన్' అనే తమిళ పదం కనుగొనబడ్డాయి.[105]
ప్రారంభ చారిత్రాత్మక పాండ్య దేశం ముత్యాల సరఫరాకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుత తూత్తుకుడిలోని పురాతన ఓడరేవు అయిన కొర్కాయ ముత్యాల వాణిజ్యానికి కేంద్రంగా ఉండేది. గ్రెకో-రోమన్, ఈజిప్టు నౌకాయాత్రీకులు వ్రాసిన రికార్డులలో గల్ఫ్ ఆఫ్ మన్నారు ప్రాంతాలలో జరిగిన ముత్యాల చేపల పెంపకం గురించిన వివరాలను ఇస్తాయి. ముత్యాల చేపల పెంపకం గురించి మెగాస్టీన్స్ నివేదించిన వ్రాతలలో పాండ్యులు ముత్యాల వ్యాపారం ద్వారా గొప్ప సంపదను పొందారన్న సూచనలు ఉన్నాయి.[106]
ఎరిథ్రేయన్ సముద్రం ప్రాంతానికి చెందిన పెరిప్లస్ వ్రాతల ఆధారంగా కోర్కైలో ముత్యాల వేటకు నేరస్థులను ఉపయోగించారని భావిస్తున్నారు.[107] పెరిప్లస్ " అపోలోగాస్, ఒమనా మార్ట్సు నుండి గొప్ప పరిమాణంలో ముత్యాలు ఎగుమతి చేయబడ్డాయి" అని కూడా పేర్కొన్నాడు.[108]
పాండ్యా దేశం నుండి వచ్చిన ముత్యాలకు ఉత్తర భారతదేశ రాజ్యాలలో కూడా గిరాకీ ఉంది.[109] పెరిప్లసు ఫిషింగు సాహిత్య సూచనలు సముద్రంలో మునిగి ముత్యాలను వెలుపలికి తీసుకుని వచ్చే మత్స్యకారులు సొరచేపల దాడులను నివారించడం కొరకు కుడి-వోర్లేడ్ చాంక్ మీద ధ్వనినిని సృష్టించి సొరచేపలను దూరంగా పోయేలా చేస్తారు అని వర్ణించాడు.[110]
పాండ్య దేశంలో మదురైలోని మీనాక్షి ఆలయంతో సహా పలు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కడుంగోన్ పాండ్య శక్తిని పునరుద్ధరించిన తరువాత భక్తి ఉద్యమంలోని శైవ నాయనర్లు, వైష్ణవ అళ్వార్లు ప్రాముఖ్యత పొందారు.[18] పాండ్య పాలకులు స్వల్ప కాలం జైన మతాన్ని అనుసరించారని భావిస్తున్నారు.[8]
పాండ్య నిర్మాణరంగంలో రాతిచెక్కడాలతో నిర్మించబడిన దేవాలయాలు ప్రధానభాగం వహించాయి. పాండ్య దేవాలయాల కొన్ని ప్రధాన లక్షణాలలో విమాన మండపం ఒకటి.[111]
తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో చిన్న దేవాలయాల సమూహాలు కనిపిస్తాయి. శివాలయాలలో మహా మండపం, నంది శిల్పం ఉంటుంది.[112] పాండ్య పాలన తరువాతి ఆలయ విమనాల గోపురాలు దశలలో చక్కగా చెక్కబడిన విగ్రహాలతో అభివృద్ధి చేయబడ్డాయి. దేవాలయాల గోపురాలు ఎత్తైన ప్రవేశం ద్వారాలతో నిర్మించబడి ఉంటాయి.[113]
పాండ్య పాలనలో మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, తిరునెల్వేలో నెల్లయ్యప్పరు ఆలయం నిర్మించబడ్డాయి.[114]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.