పాంగోంగ్ సరస్సు
లడఖ్, టిబెట్లలో విస్తరించి ఉన్న బాష్పీభవన సరస్సు From Wikipedia, the free encyclopedia
లడఖ్, టిబెట్లలో విస్తరించి ఉన్న బాష్పీభవన సరస్సు From Wikipedia, the free encyclopedia
పాంగోంగ్ త్సో లేదా పాంగోంగ్ సరస్సు తూర్పు లడఖ్ లోను, పశ్చిమ టిబెట్ లోనూ విస్తరించి ఉన్న భాష్పీభవన సరస్సు. త్సో అంటే టిబెటన్ భాషలో సరస్సు అని అర్థం. ఇది సముద్ర మట్టం నుండి 4,225 మీటర్ల ఎత్తున ఉన్న ఈ సరస్సు పొడవు 134 కిలోమీటర్లు. ఇది, పాంగోంగ్ త్సో, త్సో న్యాక్, రమ్ త్సో (జంట సరస్సులు), న్యాక్ త్సో అనే ఐదు ఉప సరస్సులుగా విభజించబడి ఉంటుంది. మొత్తం సరస్సు పొడవులో సుమారు 50% టిబెట్ పరిధిలోను, 40% లడఖ్‌లోనూ ఉంది. మిగతాది భారత చైనాల మధ్య వివాదంలో ఉంది ఈ భాగం చైనా నియంత్రణలో ఉంది. ఈ సరస్సు అత్యధిక వెడల్పు 5 కిలోమీటర్లు. మొత్తమ్మీద దీని వైశాల్యం 604 చ.కి.మీ. ఉప్పునీటి సరస్సు అయినప్పటికీ శీతాకాలంలో ఇది పూర్తిగా గడ్డకడుతుంది. చిన్న శిఖరం దీన్ని సింధు నదీ పరీవాహక ప్రాంతం నుండి వేరు చేస్తుంది. దీని పరీవాహక ప్రాంతం భూ పరివేష్టితమై ఉంటుంది. చరిత్రపూర్వ కాలంలో ఇది సింధు నది పరీవాహక ప్రాంతంలో భాగంగా ఉండేదని భావిస్తున్నారు.[3]
పాంగోంగ్ త్సో | |
---|---|
ప్రదేశం | లడఖ్ లోని లేహ్ జిల్లా టిబెట్ |
అక్షాంశ,రేఖాంశాలు | 33°43′04.59″N 78°53′48.48″E |
రకం | సోడ్ సరస్సు dimictic lake (east basin)[1] cold monomictic lake (west basin)[ఆధారం చూపాలి] |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 134 కి.మీ. (83 మై.) |
గరిష్ట వెడల్పు | 5 కి.మీ. (3.1 మై.) |
ఉపరితల వైశాల్యం | approx. 700 కి.మీ2 (270 చ. మై.) |
గరిష్ట లోతు | 330 ft. (100 m) |
ఉపరితల ఎత్తు | 4,225 మీటర్లు (13,862 అ.)[2] |
ఘనీభవనం | శీతాకాలంలో |
రామ్సార్ కన్వెన్షన్ కింద ఈ సరస్సును అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి నేలగా గుర్తించే పని జరుగుతోంది. అది పూర్తైతే, ఈ కన్వెన్షన్ కింద దక్షిణ ఆసియాలో సరిహద్దులకు ఇరువైపులా విస్తరించి ఉన్న తడి నేలలో ఇదే మొదటిది అవుతుంది.
చారిత్రికంగా, ఈ సరస్సు ఐదు ఉపసరస్సులుగా తయారైంది. సన్నటి అలుగులు (కాలువలు) వీటిని కలుపుతూంటాయి. పాంగోంగ్ త్సో అనే పేరు అత్యంత పశ్చిమాన ఉన్న సరస్సుకు మాత్రమే వర్తిస్తుంది. ఇది చాలావరకు లడఖ్‌లో విస్తరించి ఉంది. టిబెట్ వైపున ఉన్న ప్రధాన సరస్సును త్సో న్యాక్ ("మధ్య సరస్సు") అంటారు. దీని తరువాత రమ్ త్సో అనే రెండు చిన్న సరస్సులు ఉన్నాయి. రుటోగ్ సమీపంలో ఉన్న చివరి సరస్సును మళ్ళీ న్యాక్ త్సో అని పిలుస్తారు. [4] [5] మొత్తం ఈ సరస్సులన్నిటినీ కలిపి టిబెటన్ భాషలో సోమో న్గంగ్లా రింగ్పో అని అంటారు..
పాంగోంగ్ త్సో, సోమో న్గంగ్లా రింగ్పో రెండింటి అర్థాలపై భిన్నమైన వివరణలు ఉన్నాయి. లడఖ్ ప్రభుత్వ వెబ్సైట్లో "పాంగోంగ్ త్సో" అంటే టిబెట్ భాషలో "ఎత్తైన గడ్డి భూముల సరస్సు" అని అర్థమని చెబుతోంది. [6] అయితే దశాబ్దాల క్రితం నాటి యాత్రా కథనాల్లో పాంగోంగ్ అంటే "బోలు" అని రాసారు [7] [8] సోమో న్గంగ్లా రింగ్పో అనేది టిబెటన్ మాటకు వివిధ వర్గాలు వివిధ అర్థాలు చెబుతారు. ఇవన్నీ సారూప్యంగా ఉంటాయి. చైనా మీడియా "పొడవైన, సన్నటి, మంత్రించిన సరస్సు" అని అర్థం చెబుతుంది. [9] తొలి యూరోపియన్ అన్వేషకులు "ఆడ, సన్నటి, చాలా పొడవైన సరస్సు" అని, [10] ఇతర ఆధునిక వర్గాలు "పొడవైన మెడ గల హంస సరస్సు" అనీ అర్థం చెప్పాయి. [11] ఈ సరస్సును పాన్-కుంగ్ హు అని కూడా పిలుస్తారు.
సరస్సు తూర్పు భాగంలో మంచినీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో మొత్తం కరిగిన ఘనపదార్థాలు 0.68 గ్రా/లీ ఉంటాయి. సరస్సు పశ్చిమ భాగం ఉప్పునీటితో కూడుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలో 11.02 గ్రా/లీ లవణీయత ఉంటుంది.[12] సరస్సు ఉప్పునీటిలో[13] చాలా తక్కువ సూక్ష్మ వృక్షజాలం ఉంటుంది. సరస్సుకు భారతీయ వైపున కొన్ని చిన్న క్రస్టేసియన్లు తప్ప, చేపలు గాని, ఇతర జలచరాలు గానీ లేవని గైడ్లు తమ నివేదికల్లో చెప్పారు. కానీ సరస్సు పైనా, ఉపరితలం మీదా అనేక బాతులు నీటికాకులూ సందర్శకులకు కనిపిస్తాయి. సరస్సు చుట్టూ చిత్తడి నేలలలో పెరిగే కొన్ని జాతుల పొదలు, మూలికలూ ఉన్నాయి.
ఈ సరస్సు అనేక వలస పక్షులతో సహా వివిధ రకాల పక్షులకు ముఖ్యమైన సంతానోత్పత్తి ప్రదేశంగా ఉపయోగపడుతుంది. వేసవిలో బార్-హెడ్ గూస్, బ్రాహ్మిణి బాతులూ ఇక్కడ కనిపిస్తూంటాయి. [14] సరస్సు చుట్టూ ఉన్న ప్రాంతంలో కియాంగ్, మార్మోట్లతో సహా అనేక జాతుల వన్యప్రాణులు కనిపిస్తాయి. సరస్సులో చేపలు, ముఖ్యంగా షిజోపైగోప్సిస్ స్టోలిస్కాయ్[15] రకోమా లబియాటా [16] రకం చేపలు, పెద్ద సంఖ్యలో ఉంటాయి.
పూర్వం, పాంగోంగ్ త్సో సింధు నదికి ఉపనది అయిన ష్యోక్ నది లోకి ఒక అలుగు ఉండేది. కాని ఇది ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆనకట్ట కారణంగా మూసుకుపోయింది. భారతీయ వైపు నుండి రెండు ప్రవాహాలు సరస్సు లోకి నీళ్ళు తీసుకువస్తాయి. వీటి వలన సరస్సు అంచుల వద్ద చిత్తడి నేలలు, మాగాణి నేలలూ ఏర్పడుతాయి.[17] సరస్సు ప్రస్తుత మట్టానికి పైన కట్టపై కనిపించే చారలను బట్టి చూస్తే 5 మీటర్ల మందాన బురద, ఇసుకల పొర కనిపిస్తుంది. దీన్నిబట్టి సరస్సు మట్టం ఒకప్పటి స్థాయి నుండి ప్రస్తుత స్థాయికి చేరిందని తెలుస్తుంది. [13] భారత వైపున, చేపలేమీ కనబడలేదు గానీ, ఆగ్నేయం వైపు నుండి వచ్చే వాగులో (చుషూల్ నాలా) మాత్రం మూడు చేపల జాతులు (షిజోపైగోప్సిస్ స్టోలిస్కాయ్, టిబెటన్ స్టోన్ లోచ్, ట్రిప్లోఫైసా గ్రాసైలిస్) ఉన్నట్లు తెలుస్తోంది (భట్ తది., 2011 ). ఇక్కడి తక్కువ జీవవైవిధ్యానికి కారణం అధిక లవణీయత, కఠినమైన పర్యావరణ పరిస్థితులని నివేదికలున్నాయి (భట్ తది., 2011).
పాంగోంగ్ సరస్సులో బర్డ్ ఐలెట్ అనేది అత్యంత ప్రసిద్ధమైన ద్వీపం. [18]
శీతోష్ణస్థితి డేటా - Pangong Tso | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | −5.9 (21.4) |
−3.7 (25.3) |
0.9 (33.6) |
6.9 (44.4) |
11.6 (52.9) |
17.4 (63.3) |
20.5 (68.9) |
19.7 (67.5) |
15.5 (59.9) |
7.9 (46.2) |
1.5 (34.7) |
−3.3 (26.1) |
7.4 (45.4) |
రోజువారీ సగటు °C (°F) | −13.3 (8.1) |
−10.8 (12.6) |
−6.0 (21.2) |
−0.5 (31.1) |
3.8 (38.8) |
9.5 (49.1) |
13.1 (55.6) |
12.7 (54.9) |
7.8 (46.0) |
−0.3 (31.5) |
−6.8 (19.8) |
−11.3 (11.7) |
−0.2 (31.7) |
సగటు అల్ప °C (°F) | −20.6 (−5.1) |
−17.9 (−0.2) |
−12.8 (9.0) |
−7.8 (18.0) |
−3.9 (25.0) |
1.6 (34.9) |
5.8 (42.4) |
5.7 (42.3) |
0.2 (32.4) |
−8.5 (16.7) |
−15.1 (4.8) |
−19.3 (−2.7) |
−7.7 (18.1) |
సగటు అవపాతం mm (inches) | 4 (0.2) |
2 (0.1) |
3 (0.1) |
3 (0.1) |
4 (0.2) |
2 (0.1) |
11 (0.4) |
15 (0.6) |
4 (0.2) |
2 (0.1) |
2 (0.1) |
3 (0.1) |
55 (2.3) |
Source: Climate-Data.org |
భారత చైనా వాస్తవాధీన రేఖపై ఉన్నందున ఈ సరస్సును సందర్శించడానికి భారతదేశపు ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. భారతీయులు వ్యక్తిగత అనుమతులు పొందగలిగినప్పటికీ, ఇతరులు మాత్రం తప్పనిసరిగా గ్రూప్ పర్మిట్లనే పొందాలి (కనీసం ముగ్గురున్న గుంపు). వీళ్ళ వెంట గుర్తింపు పొందిన గైడ్లు ఉండాలి. లేహ్ లోని పర్యాటక కార్యాలయం చిన్న రుసుము తీసుకుని ఈ అనుమతులను జారీ చేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా, భారతదేశం సరస్సులో బోటింగును అనుమతించదు.
చైనా జాతీయ రహదారి 219, పాంగోంగ్ సరస్సు తూర్పు కొన గుండా వెళుతుంది. రుటోగ్ నుండి 12 కి.మీ., షిక్వాన్హె నుండి 130 కి.మీ. ప్రయాణం చేసి సరస్సును చేరుకోవచ్చు. పర్యాటకులు సరస్సుపై పడవను అద్దెకు తీసుకోవచ్చు. కాని పక్షుల స్థావరమైన దీవులను రక్షించుకునేందుకు గాను ఆ ద్వీపాలలో దిగడానికి అనుమతి లేదు. సరస్సు ఒడ్డున అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. [19]
పాంగోంగ్ సరస్సు వివాదాస్పద భూభాగంలో ఉంది. వాస్తవాధీన రేఖ ఈ సరస్సు గుండానే వెళుతుంది. రేఖకు తూర్పున 20 కి.మీ.వరకు విస్తరించి ఉన్న సరస్సు భాగాన్ని చైనా నియంత్రిస్తుంది. కాని ఈ భాగం తనదని భారతదేశం వాదన. సరస్సు తూర్పు కొన టిబెట్‌లో ఉంది. 19 వ శతాబ్దం మధ్యకాలం తరువాత, పాంగోంగ్ త్సో జాన్సన్ రేఖ దక్షిణ కొన వద్ద ఉండేది. ఇది అక్సాయ్ చిన్ ప్రాంతంలో భారత చైనాల మధ్య సరిహద్దును నిర్వచించే తొలి ప్రయత్నాల్లో ఒకటి.
ఖుర్నాక్ కోట, పాంగోంగ్ త్సో ఉత్తర తీరాన సగం దూరంలో ఉంది. [20] 1952 నుండి చైనీయులు ఖుర్నాక్ కోట ప్రాంతాన్ని నియంత్రణలో ఉంచుకున్నారు. [21] [22] దక్షిణాన స్పంగ్గూర్ త్సో అనే చిన్న సరస్సు ఉంది.
1962 భారత చైనా యుద్ధంలో, అక్టోబరు 20 న పాంగోంగ్ త్సో వద్ద సైనిక చర్య జరిగింది. [23]
పాంగోంగ్ త్సో ఇప్పటికీ వాస్తవాధీన రేఖ వెంట సున్నితమైన సరిహద్దు. [24] [25] ఇక్కడ, చైనా చొరబాట్లు జరపడం సర్వసాధారణం [26]
2017 ఆగస్టులో, పాంగోంగ్ త్సో సమీపంలో భారత, చైనా దళాలు పరస్పరం రాళ్ళు విసురుకున్నాయి.. [27] [28] [29]
2019 సెప్టెంబరు 11 న, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలు పాంగోంగ్ సరస్సు ఉత్తర ఒడ్డున భారత దళాలను ఎదుర్కొన్నాయి. [30] [31]
2020 మే 5-6 న, పాంగోంగ్ త్సో సరస్సు సమీపంలో సుమారు 250 మంది భారతీయ, చైనా దళాల మధ్య ముఖాముఖి జరిగింది. [32] [28] [33] [34] నలుగురు భారత సైనికులు, ఏడుగురు చైనా సైనికులూ గాయపడ్డారు. [35]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.