నెల
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
నెల (మాసం) కాలమునకు ప్రమాణం. ఇది క్యాలండర్లలో ఉపయోగించబడుతుంది. ఇది చంద్రుని కదలికకు సంబంధించిన సహజ కాలానికి సుమారు సమానంగా ఉంటుంది. చంద్రుడు, నెల అనేవి ఒకదానికొకటి సంబంధం ఉన్న పదాలు. సాంప్రదాయకంగా ఈ భావన చంద్ర దశలతో ఉధ్బవించింది. అటువంటి నెలలను చాంద్రమాన మాసములు అంటారు. ఇది సుమారు 29.53 రోజులకు సమనంగా ఉంటుంది. త్రవ్వకాలలో లభించిన గణన కర్రలు (టాలీ స్టిక్) ల నుండి పాలియోలిథిక్ యుగం యుగం ప్రారంభంలోనే ప్రజలు చంద్రుని దశలకు సంబంధించి రోజులు లెక్కించారని పరిశోధకులు ఊహించారు. భూమి-సూర్య రేఖకు సంబంధించి చంద్రుని కక్ష్య కాలం ఆధారంగా సైనోడిక్ నెలలు నేటికీ చాలా క్యాలెండర్లకు ఆధారం. అవి సంవత్సరానికి విభజించడానికి ఉపయోగిస్తారు.
చంద్రమానంప్రకారం ఒక నెల 30 రోజుల కాలానికి సమానము. అయితే సూర్యమానం ప్రకారం 28-31 రోజులు వుండవచ్చును. ఒక సంవత్సర కాలంలో 12 నెలలు. మాసం అనగా 12 నెలలు కాలం. నెల సుమారు 30 రోజులు. నెలకు రెండు పక్షములు. ఒక పక్షం అనగా 15 రోజులు. అవి కృష్ణ పక్షం, శుక్ల పక్షం. చాంద్రమానం ప్రకారం చంద్రుని కళలు అమావాస్య నుండి పౌర్ణము వరకు కాలంలో దిన దినం చంద్రుని కళ ప్రవర్థమానమవుతుంది. ఈ కాలాన్ని శుక్ల పక్షం అనీ, పౌర్ణమి నుండి అమవాస్య వరకు చంద్రుని కళ రోజు రోజుకూ క్షీణిస్తుంది. ఈ కాలాన్ని కృష్ణ పక్షమనీ అంటారు. తెలుగు క్యాలండరు ప్రకారం అమావాస్య నుండి అమావాస్య వరకు ఒక మాసముగా పరిగణిస్తారు.
కింది రకాల నెలలు ప్రధానంగా ఖగోళశాస్త్రంలో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి, వాటిలో ఎక్కువ భాగం (కానీ నక్షత్రమాసం, ఉష్ణమండల నెలల మధ్య వ్యత్యాసం కాదు) మొదట బాబిలోనియన్ చంద్ర ఖగోళశాస్త్రంలో గుర్తించబడ్డాయి.
ఇందులో 12 నెలలు ఉంటాయి. ఇవి అన్ని ఒకే విలువను కలిగి ఉండవు. సరాసరి నెలసరి కాలం 30.436875 రోజులు.
చాంద్రమానం ప్రకారం వివిధ ప్రాంతాలలో ఉపయోగిస్తున్న కాలెండర్లలో నెలలు:
సంస్కృత పేరు | తమిళ పేరు | తెలుగు పేరు | |
---|---|---|---|
1 | చైత్ర (चैत्र) | చతిరాయ్ (சித்திரை) | చైత్రము |
2 | వైశాఖ (वैशाख) | వైకాశి (வைகாசி) | వైశాఖము |
3 | జ్యేష్ఠ (ज्येष्ठ) | ఆని (ஆனி) | జ్యేష్ఠము |
4 | ఆషాఢ (आषाढ) | ఆడి (ஆடி) | ఆషాఢము |
5 | శ్రావణ (श्रावण) | ఆవని (ஆவணி) | శ్రావణము |
6 | భాద్రపద (भाद्रपद) | పుర్రతసి (புரட்டாசி) | భాద్రపదము |
7 | అశ్విన (अश्विन) | ఐపాసి (ஐப்பசி) | ఆశ్వయుజము |
8 | కార్తీక (कार्तिक) | కార్తిగై (கார்த்திகை) | కార్తీకము |
9 | మార్గశిర (मार्गशीर्ष) | మార్గజి (மார்கழி) | మార్గశిరము |
10 | పౌష (पौष) | తాయ్ (தை) | పుష్యము |
11 | మాఘ (माघ) | మాసి (மாசி) | మాఘము |
12 | ఫాల్గుణ (फाल्गुन) | పంగుణీ (பங்குனி) | ఫాల్గుణము |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.