![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/New_no_obstruction.png/640px-New_no_obstruction.png&w=640&q=50)
నిద్రలో శ్వాసకు అంతరాయాలు
నిద్ర సమయంలో శ్వాసలో అంతరాయాలు ఏర్పడే రుగ్మత / From Wikipedia, the free encyclopedia
నిద్రలో శ్వాసకు అంతరాయాలు (స్లీప్ అప్నియా) నిద్రకు సంబంధించిన ఒక రుగ్మత. ఇది కలిగి ఉన్న వ్యక్తికి నిద్రపోతున్నప్పుడు శ్వాసకు పూర్తిగా అంతరాయాలు కలగడం లేదా ఊపిరి లోతుగా తీసుకోలేక పోవడం (అల్పశ్వాసలు) జరుగుతుంది శ్వాసలో విరామం కొన్ని సెకన్ల నుండి కొన్ని నిమిషాల వరకు ఉంటుంది. వయోజనులలో శ్వాసాంతరాయాలైనా అల్పశ్వాసలైనా 10 సెకండులకుమించి ఉన్నపుడే గణనలోనికి తీసుకుంటారు. ఊపిరికై మేల్కొన్న సంఘటనలు కూడా లెక్కలోకి తీసుకుంటారు. ఇలా రాత్రిలో చాలా సార్లు జరుగవచ్చు. సాధారణంగా ఈ రుగ్మత ఉన్నవారు పెద్దగా గురక పెడతారు. శ్వాస పున ప్రారంభం ఐనప్పుడు ఉక్కిరిబిక్కిరి అయ్యి వింతశబ్దాలు రావడం జరుగుతుంది. ఈ రుగ్మత సాధారణ నిద్రకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి, దీనివల్ల ప్రభావితమైన వారు పగలు మధ్య మధ్య కునుకుపాట్లు పడుతూ ఉంటారు. అలసటగాను, మత్తుగాను కూడా ఉంటారు. పిల్లలలో ఇది మితిమీరిన చైతన్యం (హైపరేక్టివిటీ) కలిగిస్తుంది తద్వారా బడిలో సమస్యలకు దారి తీస్తుంది. సమాజాలలో ఈ సమస్య గలవారు 4 % - 9 % మంది ఉంటారు. స్థూలకాయము, ఎక్కువ బరువు ఉన్నవారు ఎక్కువమంది ఉన్న సమాజాలలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్లీప్ అప్నియా మూడు రకాలు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6e/New_no_obstruction.png/640px-New_no_obstruction.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b5/Airway_obstruction.png/640px-Airway_obstruction.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a1/ObstructiveApnea.png/640px-ObstructiveApnea.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/CPAP.png/320px-CPAP.png)
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/92/UPPP._4_figures..png/320px-UPPP._4_figures..png)