నవ తంత్రము (ఆంగ్లం: Navatantra లేదా Neotantra) 1970వ దశకంలో ఆధునిక, పాశ్చాత్య సవరణలతో ఏర్పడ్డ తంత్రము యొక్క మరొక రూపాంతరము. నవ తంత్రము యొక్క ప్రతిపాదకులు కొందరు పురాతన గ్రంథాలని, సాంప్రదాయలనే పాటిస్తూ ఉండగా, మరి కొందరు అసాంప్రదాయిక ఆచారాలని పాటిస్తూ నవ తంత్రము అనగా కేవలం ఆధ్యాత్మిక లైంగికానందమనే ముద్ర పడేలా చేసారు. సాంప్రదాయిక తంత్రములో అత్యంత ప్రాముఖ్యత గల (గురు పరంపర వంటి) వాటిని కొన్నింటిని నవ తంత్రము విస్మరించటం జరిగింది.
ఈ వ్యాసం 18 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే. లైంగికత గురించి చర్చించటం మూలాన ఈ వ్యాసం చదవటం అందరికీ అమోదయోగ్యం కాకపోవచ్చును . ఇది మీకు సౌకర్యవంతం కాకపోతే దయచేసి తక్షణమే ఈ పుట నుండి నిష్క్రమించ ప్రార్థన.
“
నిరతిశయ ప్రేమస్పదత్వం ఆనందత్వం
”
అంటే
అనంతమైన ప్రేమయే పరమానందము!!!
“
స హ ఏతావన్ అస యథ స్త్రీపుమాంసౌ సంపరిస్వక్తౌ
”
అంటే
అఖండ సత్యము కౌగిలిలో అల్లుకు పోయి ఉన్న స్త్రీ-పురుషుల వలె కనిపించెను!!!