From Wikipedia, the free encyclopedia
దీర్ఘ సుమంగళీభవ ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో 1998లో విడుదలైన కుటుంబకథా చిత్రం. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు.[1][2] పెళ్ళైన ఒక యువతి గ్లామర్ ప్రపంచం మీద వ్యామోహంతో భర్త బిడ్డలను వదిలేసి మరల తన పాత జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నించే కథ ఇది.
దీర్ఘ సుమంగళీ భవ | |
---|---|
దర్శకత్వం | యస్వీ కృష్ణారెడ్డి |
తారాగణం | రాజశేఖర్, రమ్యకృష్ణ |
సంగీతం | యస్వీ కృష్ణారెడ్డి |
నిర్మాణ సంస్థ | మనీషా ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
వాణి ఒక పదవీవిరమణ చేసిన ప్రధానోపాధ్యాయుడి కూతురు. తండ్రి సత్యనారాయణ అలియాస్ సత్యం ఆమెను ఎంతో క్రమశిక్షణగా పెంచుతాడు. కుటుంబ సభ్యులందరూ అతని క్రమశిక్షణా విధానాల్ని, రాజీ పడని తత్వాన్ని బట్టి జేమ్స్ బాండ్ అనే మారుపేరు కూడా పెడతారు. రామారావు సత్యం స్నేహితుడి ఆఫీసులో పనిచేసే నిజాయితీయైన వ్యక్తి.
తండ్రి ఎంతో సరళమైన జీవన విధానాన్ని అలవాటు చేసినా వాణి మాత్రం ఆడంభరమైన జీవన విధానాన్ని కోరుకుంటుంది. తను పెళ్ళి చేసుకోబోయే వాడు ధనవంతుడుగా ఉండాలని కోరుకుంటుంది. అలాంటి సమయంలోనే రామారావు కారులో తిరుగుతూ కనిపిస్తాడు. మరోసారి నగల దుకాణంలో కనిపిస్తాడు. ఇవి చూసి వాణి అతన్ని ధనవంతుడిగా ఊహించుకుని అతణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. మరో వైపు రామారావు బాస్ సత్యనారాయణకి అతని గుణగణాల గురించి చెప్పి వాణికి తగిన సంబంధమని చెబుతాడు. సత్యం కూడా అందుకు అంగీకరిస్తాడు. వాణి కూడా తను నచ్చిన వ్యక్తిని పెళ్ళాడుతున్నానని ఆనందిస్తుంది. అయితే పెళ్ళి జరిగిన తర్వాత ఆమెకు తన భర్త సాధారణ ఉద్యోగి అని తెలుస్తుంది. కానీ ఎలాగోలా సర్దుకుని కాపురం చేస్తుంటుంది. వీరికి ఒక బిడ్డ కూడా పుడతాడు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.