దాల్ సరస్సు
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు సమీపంలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో రెండవ అతిపెద్ద సరస్సు. దీనిని "ఫ్లవర్స్ లేక్" అనీ, "శ్రీనగర్ జ్యువెల్" అనీ అంటారు.[1] [2][3]
దాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీర్, భారతదేశం |
అక్షాంశ,రేఖాంశాలు | 34°07′N 74°52′E |
పరీవాహక విస్తీర్ణం | 316 చదరపు కిలోమీటర్లు (122 చ. మై.) |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 7.44 కి.మీ. (4.62 మై.) |
గరిష్ట వెడల్పు | 3.5 కి.మీ. (2.2 మై.) |
ఉపరితల వైశాల్యం | 18–22 చదరపు కిలోమీటర్లు (6.9–8.5 చ. మై.) |
సరాసరి లోతు | 1.42 మీటర్లు (4.7 అ.) |
గరిష్ట లోతు | 6 మీ. (20 అ.) |
ఉపరితల ఎత్తు | 1,583 మీ. (5,194 అ.) |
ఘనీభవనం | శీతాకాలం |
ప్రాంతాలు | హజ్రత్బాల్, శ్రీనగర్ |
సరస్సు తీర రేఖ, దాదాపు 15.5 కిలోమీటర్లు (9.6 మైళ్ళు) ఉంటుంది. శీతాకాలంలో దీని ఉష్ణోగ్రత కొన్నిసార్లు −11 ° C (12 ° F) కి చేరుకుంటుంది ఈ సమయంలో సరస్సు గడ్డకడుతుంది. ఇది 21.1 చదరపు కిలోమీటర్లు (8.1 చదరపు మైళ్ళు) విస్తరించి ఉన్న సహజ చిత్తడినేలల్లో భాగంగా ఉండి, 18 చదరపు కిలోమీటర్ల (6.9 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో ఉంది.[4][5][6][7]
ప్రాచీన సంస్కృత గ్రంథాలలో దాల్ సరస్సుని మహాసరిత్ (సంస్కృతం- महासरित्) గా పేర్కొన్నారు. చరిత్రకారులు దాల్ సరస్సుకు తూర్పున ఉన్న ఇసాబర్ అనే గ్రామాన్ని దుర్గాదేవి నివాసంగా పేర్కొన్నారు.
మొఘల్ కాలంలో, భారతదేశంలోని మొఘల్ పాలకులు ముఖ్యంగా కాశ్మీర్, శ్రీనగర్ లను తమ వేసవి విడిదిగా గుర్తించారు. వారు శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ప్రాంగణాన్ని విస్తారమైన మొఘల్ తరహా తోటలు మంటపాలతో నింపి, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఆనందించే రిసార్ట్‌లుగా అభివృద్ధి చేశారు.[8]
దాల్ సరస్సు శ్రీనగర్ నగరం నడిబొడ్డున ఉంది. దీనిని రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. దీనికి 12.8 కిలోమీటర్ల (8.0 మైళ్ళు) దూరంలో బద్గామ్ విమానాశ్రయం, 18.8 కిలోమీటర్ల (11.7 మైళ్ళు) దూరంలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి NH1A కూడా ఈ సరస్సు గుండా పోతుంది.[9][5]
ప్రస్తుతం, దాల్ సరస్సును, దాని చుట్టూ పరిసరాలను మరింతగా అభివృద్ధి పరిచేందుకుగానూ భారత ప్రభుత్వం సుమారు 11 బిలియన్ల రూపాయల భారీ పెట్టుబడులు పెట్టి పునరుద్ధరణ కార్యక్రమాలు మొదలుపెట్టింది.[5][9][10]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.