![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/92/Thar_desert_Rajasthan_India.jpg/640px-Thar_desert_Rajasthan_India.jpg&w=640&q=50)
థార్ ఎడారి
From Wikipedia, the free encyclopedia
థార్ ఎడారి (హిందీ: थार मरुस्थल) భారత దేశానికి వాయువ్య దిశలో భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఉంది. ఈ ఎడారిని గ్రేట్ ఇండియన్ డెసర్ట్ అని పిలుస్తారు.[1]. ఈ ఎడారి ప్రధానంగా రాజస్థాన్ రాష్ట్రంలో, కొంత భాగము హర్యానా, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలలో, కొద్ది భాగము పాకిస్తాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రములో విస్తరించి ఉంది.[2][3] పాకిస్తాన్లో విస్తరించి ఉన్న ఎడారిని ఖలిస్తాన్ ఎడారి అని పిలుస్తారు. థార్ ఎడారి భౌగోళిక సరిహద్దులు వాయువ్యాన సట్లెజ్ నది, తూర్పున ఆరావళీ పర్వత శ్రేణులు, దక్షిణాన రాణ్ ఆఫ్ కచ్ సాల్ట్ మార్ష్ (ఉప్పుకయ్య), పశ్చిమాన సింధూ నది. ఉత్తరాన థార్ ఎడారికి, విశాలమైన ముళ్ళపొదల భూములకు ఉన్న సరిహద్దు కచ్చితంగా నిర్వచించబడలేదు. అందువళ్ళ ఏ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకున్నారో, తీసుకోలేదో అన్న విషయముపై థార్ ఎడారి పరిమాణము యొక్క అంచనాలు గణనీయంగా మారుతుంటాయి.[4]
థార్ ఎడారి | |
గ్రేట్ ఇండియన్ డిసెర్ట్ | |
Desert | |
థార్ ఎడారి, రాజస్థాన్, భారతదేశం | |
Countries | భారతదేశం, పాకిస్థాన్ |
---|---|
రాష్ట్రం | భారతదేశం: రాజస్థాన్ హర్యానా పంజాబ్ గుజరాత్ పాకిస్థాన్: Sindh పంజాబ్ |
Biome | Desert |
Plant | cactus |
Animal | camel |
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bd/Thar_Desert_satellite.jpg/320px-Thar_Desert_satellite.jpg)