![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8a/Tiruvannamalai_Montage.jpg/640px-Tiruvannamalai_Montage.jpg&w=640&q=50)
తిరువణ్ణామలై
తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా లోని నగరం. / From Wikipedia, the free encyclopedia
తిరువణ్ణామలై (బ్రిటీష్ రికార్డులలో త్రినోమలి లేదా త్రినోమలీ [2]) భారతదేశం, తమిళనాడు రాష్ట్రం, తిరువణ్ణామలై జిల్లా లోని ఒక నగరం. ఇది తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ముఖ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా, తిరువణ్ణామలై జిల్లాకు పరిపాలనా కేంద్రంగా కూడా ఉంది. నగరంలో ప్రసిద్ధ అన్నామలైయార్ ఆలయం, అన్నామలై కొండ ఉన్నాయి. గిరివలం, కార్తికదీప ఉత్సవాలు ఈ నగరంలో జరుగుతాయి. ఇది భారతదేశం లోనే గణనీయమైన విదేశీ సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం.[3] లోన్లీ ప్లానెట్లో ఉన్న నగరాలలో ఈ నగరం ఒకటి.[4] నగరం పరిధిలో చిల్లర వ్యాపార దుకాణాలు, విశ్రాంతి మందిరాలు, వినోద కార్యకలాపాలతో సహా అభివృద్ధి చెందుతున్న సేవా రంగ పరిశ్రమను కలిగిఉంది. సేవా రంగం కాకుండా, చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ [5] [6] స్పిన్నింగ్ మిల్లులు, ప్రధాన విద్యాసంస్థలతో సహా అనేక పారిశ్రామిక సంస్థలకు నగరం కేంద్రంగా ఉంది.[7] [8]ఈ నగర పరిపాలనను తిరువణ్ణామలై పురపాలక సంఘం నిర్వహిస్తుంది.దీని పురపాలక సంఘం 1886లో ఏర్పడింది.[9] ఈ నగరం రహదారులు, రైల్వే ప్రయాణ సౌకర్యం లాంటి మంచి సదుపాయాలు కలిగిఉంది.
తిరువణ్ణామలై
తిరువారుణై | |
---|---|
నగరం | |
![]() సవ్య దిశలో పైన ఎడమ వైపు నుండి: అన్నమలైయర్ దేవాలయం గోపురంతో కూడిన తిరువన్నామళై దృశ్యం, శ్రీ రమణాశ్రమం ప్రధాన ద్వారం, యోగి రాం సూరత్ కుమారి ఆశ్రమం, పెద్ద రథం, దూరం నుండి అన్నామళై కొండల దృశ్యం, రాత్రి వేళలో తిరువన్నామళై. | |
Coordinates: 12.28°N 79.07°E / 12.28; 79.07 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | తిరువన్నామళై |
తాలూకా | తిరువన్నామళై |
ప్రాంతం | తొండై నాడు |
Government | |
• Type | ప్రత్యేక గ్రేడు పురపాలకసంఘం |
• Body | మునిసిపల్ కౌన్సిల్ |
• మ్యునిసిపల్ చైర్మన్ | నిర్మల కార్తీక్ వెల్మరన్ |
విస్తీర్ణం | |
• నగరం | 13.00 కి.మీ2 (5.02 చ. మై) |
Elevation | 171 మీ (561 అ.) |
జనాభా (2011) | |
• నగరం | 1,45,278 |
• Rank | తమిళనాడులో 15వ |
• Metro | 3,98,100 |
భాషలు | |
• అధికార | తమిళం |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 606 601 to 606 611 |
టెలిఫోన్ కోడ్ | 91-4175 |
Vehicle registration | TN 25 |
శాసన సభ్యుడు | ఇ.వి.వేలు (డి.ఎం.కె) తిరువన్నామళై శాసనసభ నియోజకవర్గం |