తిరుమలగిరి (సికింద్రాబాద్)
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదు జిల్లాలోని ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
తిరుమలగిరి, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ, శంషాబాద్ జోన్, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం.[1] అదే పేరుతో ఉన్న తిరుమలగిరి మండలానికి కేంద్రం.[2] ఇది హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ, శంషాబాద్ జోన్, హైదరాబాద్ జిల్లా, తిరుమలగిరి మండలానికి చెందిన గ్రామం. ఇది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఒక ప్రాంతం. అంతకు ముందు భారతదేశంలోని సికింద్రాబాద్ ప్రధాన శివారు ప్రాంతం.ఇది హైదరాబాద్ జిల్లాకు ఉత్తరాన ఉంది. తిరుమలగిరి శివారు ప్రాంతంలో చాలా చిన్న నివాస పట్టణాలు ఉన్నాయి. ప్రక్కనే ఉన్న శివారు ప్రాంతాలైన కార్ఖానా, సైనిక ఆయుధ సామాగ్రి కేంద్రం (ఎఒసి) తరచుగా తిరుమలగిరిలో భాగంగా భావిస్తారు. గత 15 సంవత్సరాలలో, ఈ శివారు జంట నగరాల్లో ఒక ముఖ్యమైన నివాస ప్రాంతంగా మారింది. ఈ శివారులో అనేక కాలనీలు, పట్టణనివాసాలు,బహుళ అంతస్తులు నిర్మించబడ్డాయి.సికింద్రాబాద్ చరిత్రాత్మకంగా పరిశీలిస్తే, తిరుమలగిరి, బోయినపల్లి, మారెడ్పల్లి అనే ఈ మూడు గ్రామాల కలయికతో సికింద్రాబాద్ ఏర్పాటైనట్లుగా తెలుస్తుంది.ఈ ప్రాంతం బ్రిటిష్ కాలంనాటి బ్రిటిష్ కారాగారం, వైద్యకళశాల వంటి కొన్ని చారిత్రక భవనాలను కలిగి ఉంది. మలేరియా నివారణను కనుగొన్న సర్ రోనాల్డ్ రాస్ పేరుతో 'సర్ రోనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారాసిటాలజీ' ఈ ప్రదేశానికి కొద్ది దూరంలోనే ఉంది, కానీ ప్రస్తుతం అది పని చేయటలేదు.
తిరుమలగిరి | |
---|---|
నగర పరిసర ప్రాంతం | |
Coordinates: 17°28′16″N 78°30′34″E | |
దేశం | India |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
Government | |
• Body | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు C |
భాషలు | |
• జనాభా | తెలుగు |
Time zone | UTC+5:30 (ప్రామాణిక కాలమానం) |
పిన్కోడ్ | 500015 |
లోక్సభనియోజకవర్గం | సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గం |