తిరుక్కురుంగుడి
From Wikipedia, the free encyclopedia
From Wikipedia, the free encyclopedia
తిరుక్కురుంగుడి భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
తిరుక్కురుంగుడి Thirukkurungudi Temple | |
---|---|
భౌగోళికాంశాలు : | 8.45°N 77.56°E |
పేరు | |
ఇతర పేర్లు: | Vamana Shetram, Dakshina Bhadri |
ప్రదేశం | |
దేశం: | India |
రాష్ట్రం: | తమిళనాడు |
జిల్లా: | తిరునెల్వేలి |
ప్రదేశం: | తిరుక్కురుంగుడి |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | Sri Sundara Paripooranan |
ప్రధాన దేవత: | Sri Kurungudi Valli Thaayaar |
ఉత్సవ దైవం: | Sri Vadivazhagiya Nambi |
ఉత్సవ దేవత: | Sri Kurungudi Valli Thaayaar, Sri Aandaal |
దిశ, స్థానం: | తూర్పుముఖం |
పుష్కరిణి: | Karanda Maadu |
విమానం: | పంచకేతక విమానం |
కవులు: | Sri Nammazhwar,Sri Periyazhwar,Sri Thirumangai Azhwar,Sri Thirumazhisai Azhwar |
ప్రత్యక్షం: | Sri Nampaaduvaan |
ముఖ్య_ఉత్సవాలు: | Kaisika Puranam, Panguni Brahmotsavam |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | ద్రవిడ శిల్పకళ |
ఇతిహాసం | |
వెబ్ సైట్: | http://www.srivaishnavanambi.org |
ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు. ఇచట స్వామి వడుగ నంబి రూపముతో ఉడయవరులను (శ్రీరామానుజులను) ఆశ్రయించి వారి నుండి మంత్రోపదేశమును పొంది సకల వేదాంత అంతార్థములను గ్రహించి "మేమును శ్రీభగవద్రామానుజులను ఆశ్రయించితిమి దన్యులమైతి" మని ఆనందముతో ప్రకటించుటచే ఈ క్షేత్రమునకు వైష్ణవ వామనమని పేరు వచ్చింది. ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము మిధునమాసములో జరుగును. వామనుడు వసించిన చోటగుటచే కురుంగుడి యనియు సిద్దాశ్రమమనియు పేరు వచ్చింది. ఉడయవర్ తడివస్త్రములను ఆరబెట్టిన "తిరువట్టప్పారై" ఇచట ఉంది. ఇచట ఉడయవర్ అంజలి ముద్రతో కాక జ్ఞాన ముద్రతో ఉంటాడు. నిన్ఱ-కిడంద (నిలబడి ఉన్న) నంబియార్ల మధ్య శివుని ఆలయము ఉంది.
ఈ సన్నిధికి 10 కి.మీ దూరములో కొండమీద మలైమేల్ నంబి సన్నిధి ఉంది. ఈ దివ్యదేశమున తాయార్ పెరుమాళ్లతో కలసి ఉంటుంది.
మీనం ఉత్తర తీర్థోత్సవము.
ఇచట ఎంబెరుమాళ్ (రామానుజుడు) స్వామికి మంత్రోపదేశము చేయుటచే అన్ని దివ్య దేశములలో ఉన్నట్లు అంజలి ముద్రతో గాక జ్ఞానముద్రతో ఉన్నాడు. తిరుమంగై ఆళ్వార్ శ్రీరంగనాథుని యాజ్ఞానుసారము తిరునాడలంకరించిన ప్రదేశమును వారిని తిరుప్పళ్లి చేర్చిన స్థలమును ఇచట దర్శించవచ్చును.
శ్లో. శ్రీక్షీరాబ్ది తరజ్గిణీ తటతలే పూర్ణాహ్వయ శ్రీ పతి:|
దివ్యే భాతి తిరుక్కురుజ్గుడి పురే పంచాకృతి ద్యోతిత:|
సంప్రాప్త శ్శుభ పంచకేతిక పదం వైమాన మైంద్రీముఖ
స్థాయీ సాక్షి పదం కురుజ్గుడి లతానాథ శ్శఠారి స్తుత:||
శ్లో. శ్రీ మద్విష్ణు మన శ్శ్రీమత్పర కాల వచ:ప్రియ:|
రామానుజార్య మునిపాత్కృతో భయ విభూతిక:
పా. నిఱైన్ద వన్బழி నజ్కుడిక్కివళెన్ఱు; అన్నై కాణ కొడాళ్;
శిఱన్ద కీర్తి త్తిరుక్కురుజ్గుడి నమ్బియై; నాన్ కణ్డ పిన్;
నిఱైన్దశోతి వెళ్ళమ్ శూழ்న్ద; నీణ్డ పొన్మేని యొడుమ్;
నిఱైన్దెన్నుళ్లే నిన్నొழிన్దాన్; నేమియజ్గై యుళతే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-5-7
ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
వైష్ణవ నంబి, మలైమేల్ నంబి, నిన్ఱ నంబి, ఇరుంద నంబి, కిడంద నంబి, తిరుప్పార్కడల్ నంబి. | కురుంగుడి వల్లి తాయార్; | తిరుప్పార్ కడల్ నది | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | ప్రత్యక్షము, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, తిరుమంగై యాళ్వార్ | పంచకేతక విమానము | పరమ శివునకు |
నాజ్గునేరి(వానమామలై) నుండి 15 కి.మీ దూరములో గలదు. బస్వసతి కలదు. నాంగునేరి నుండి కళక్కాడు పోయి అటనుండి వేరు బస్లో తిరుక్కురుంగుడి చేరవచ్చును. ఇక్కడ రామానుజకూటము, జీయర్స్వాముల మఠములు ఉన్నాయి. మితమైన సౌకర్యములు ఉంటాయి.
అనాత్మన్యాత్మ బుద్ధి ర్వా అస్వేస్వమితి యామతి:
అవిద్యా తరు సంభూతి:బీజమేతత్ద్విథా స్థితమ్||
అవిద్య అనునది యొక వృక్షము.
ఈ వృక్షమునకు పుట్టిన బీజములు రెండు
1. ఆత్మకాని దేహేంద్రియాదులను ఆత్మ అని భావించుట.(అహంకారము)
2. తనదికాని ఆత్మను తనదియని తలంచుట (మమకారము) సంసారులగు చేతనులు ఈ అవిద్యతో కూడియుందురు. ఈఅవిద్య వలన దేవతిర్యక్ మనుష్య స్థావరములను నాల్గు విధములైన జన్మలు కలుగును. కావున ప్రాజ్ఞుడైనవాడు అవిద్యను పారద్రోలవలెను. అనగా అహంకార మమకారములను విడచిపెట్టవలెను.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.