From Wikipedia, the free encyclopedia
డైక్లోరిన్ డయాక్సైడ్ అనునది ఒక రసాయనసమ్మేళనం. రెండు క్లోరిన్ పరమాణువులు, రెండు ఆక్సిజన్ పరమాణువుల సంయోగం వలన డైక్లోరిన్ డయాక్సైడ్ అణువు ఏర్పడును.ఈ సంయోగపదార్ధం యొక్క రసాయన సంకేతపదం ClOOCl. (సక్షింప్త సంకేతం Cl2O2).ఓజోన్ పొర పతనంపై డైక్లోరిన్ డయాక్సైడ్ ప్రభావంకలదు.[1]
పేర్లు | |
---|---|
IUPAC నామము
Dichlorine dioxide | |
ఇతర పేర్లు
Chlorine(I) oxide, Chlorine Peroxide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [12292-23-8] |
పబ్ కెమ్ | 123287 |
SMILES | ClOOCl |
| |
ధర్మములు | |
Cl2O2 | |
మోలార్ ద్రవ్యరాశి | 102.905 g/mol |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
Infobox references | |
డైక్లోరిన్ డయాక్సైడ్ ఇతరపేర్లతో కుడా వాడుకలో ఉంది. డైక్లోరిన్ డయాక్సైడ్ అనునది IUPAC పేరు.ఈ రసాయానసమ్మేళనం ఒక ద్వ్యణుకం (Dimer). అందుచే దీనిని క్లోరో ఆక్సిడైమర్ ( ClO dimer) అని కూడా వ్యవహరిస్తారు.ఈ సంయోగ పదార్థానికి ఉన్న మరో పేరు క్లోరిన్ పెరాక్సైడ్.క్లోరిన్ (I) ఆక్సైడ్ అనునది మరో ప్రత్నామ్యాయంగా ఉపయోగించు నామదేయం.[2]
క్లోరిన్ అణువును ఓజోనుతో కలిపి లేసరు కిరణాలతో సంశ్లేషణ చెయ్యడం వలన డైక్లోరిన్ డయాక్సైడ్ (ClOOCl) ఉత్పత్తి చెయ్యవచ్చును.లేదాక్లోరిన్ అణువును ఒజోనుతో కలిపి అతినీలలోహిత కాంతివిశ్లేషణం చెయ్యడం వలన కూడా తయారు చెయ్యవచ్చును.248, 308, లేదా 352 nm తరంగదైర్ఘ్యం ఉన్నఎక్షిమెర్ లేసర్ వలన క్లోరిన్ అణువులు, పరమాణువులుగా విడిపోవును.[3]
అలాగే డైఫ్లోరోడైక్లోరో మిథేన్ (CF2Cl2) కూడా క్లోరిన్ అణువును పరమాణువులు విడగొట్టి, పెరాక్సైడును ఏర్పరచు వనరుగా/ఆధారంగా పనిచేయును.. సూక్ష్మతరంగం విసర్జకం (microwave discharge) కూడా క్లోరిన్ అణువులను పరమాణు వులుగా విడగొట్టి పెరాక్సైడు ఏర్పడుతకు దోహద పడును[3].
డైక్లోరిన్ డయాక్సైడ్ యొక్క అణుభారం 102.905 గ్రాములు/మోల్.ఈ సంయోగపదార్ధం ఒక ద్వ్యణుకం.డైక్లోరిన్ డయాక్సైడ్ గరిష్ఠంగా 245 nm వరకు తరంగదైర్ఘ్యంకల్గిన అతినీలలోహిత కిరణాలను శోషించుకొనును.తరంగాయామము350 nm కలిగిన అతినీలలోహిత కిరణాలను కొంత తక్కువస్థాయిలో శోషించుకొనును.ఓజోన్ పొర 300 nm వరకు అతినీలలోహిత కిరణాలను శోషించుకొనును.
డైక్లోరిన్ డయాక్సైడ్/క్లోరిన్ పెరాక్సైడ్ అణువులోని క్లోరిన్-ఆక్సిజన్ పరమాణువుల (Cl-O) బంధ దూరం పొడవు 1.426 Å. ClOO ల బంధం యొక్క బంధకోణం110.1°, రెండు Cl-O-O ద్విముఖకోణం 81°[4] .
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.