From Wikipedia, the free encyclopedia
డెక్కన్ క్వీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ లేదా డెక్కన్ క్వీన్ (మరాఠీలో राणी दख्खनची అనువాదం), ఒక భారతీయ ప్రయాణీకుల రైలు. ఇది పూణేతో ముంబైను కలుపుతుంది. ఈ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రైళ్లులో ఇది ఒకటి. అంతేకాక రెండు నగరాల మధ్య ప్రయాణించే వేల కొద్దీ ప్రయాణీకులకు రోజువారీ రవాణా యొక్క మార్గంగా ఇది ఉంది. ఇది భారతీయ రైల్వేలులో ఒక ప్రతిష్ఠాత్మకమైన రైలు.
సారాంశం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స్థానికత | మహారాష్ట్ర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి సేవ | 1 జూన్ 1930 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మార్గం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మొదలు | ముంబై సిఎస్టి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆగే స్టేషనులు | 3 (ముంబై సిఎస్టి - పూణే జంక్షన్) 2 (పూణే జంక్షన్ - ముంబై సిఎస్టి) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గమ్యం | పూణే జంక్షన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ప్రయాణ దూరం | 192.2 కి.మీ. (119.4 మై.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సగటు ప్రయాణ సమయం | 3 గం., 10 ని.లు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రైలు నడిచే విధం | ప్రతిరోజు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రైలు సంఖ్య(లు) | 12123 / 12124 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సదుపాయాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శ్రేణులు | ఎసి చైర్ కార్, చైర్ కార్, జనరల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పడుకునేందుకు సదుపాయాలు | లేదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆహార సదుపాయాలు | ఉంది, చెల్లింపు సేవ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సాంకేతికత | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రోలింగ్ స్టాక్ | కల్యాణ్ డబ్ల్యుసిఎం-3 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వేగం | 60 km/h (37 mph) సగటుతో చేరుతుంది | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
డెక్కన్ క్వీన్ 1930 జూన్ 1 న ప్రారంభించారు. బ్రిటిష్ వారు భారతదేశమును పరిపాలిస్తున్న రోజులలో, భారతదేశం లోని బ్రిటిష్ ప్రజలు అయిన వారికోసం, పడవ పందెముల అభిమానులు కొరకు, పూనా (ప్రస్తుతం పూణే) నుండి బాంబే (ప్రస్తుతం ముంబై) వరకు ఏర్పడిన (ఏర్పాటు చేయబడ్డ) ఒక వారాంతం రైలు.[1] రైలు యొక్క మొదటి సేవలు కళ్యాణ్ నుండి, పూనా వరకు నిర్వహించారు. ఇది బాంబే విక్టోరియా టెర్మినస్ నుంచి ప్రారంభమయిన (ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ సిఎస్టిఎంగా మార్చారు) కొద్దికాలంలోనే దీనిని ఒక రోజువారీ సేవకు మార్చారు. ఇది భారతీయ రైల్వేలు యందు అతి దీర్ఘకాలంగా, అంతరాయం లేకుండా, ఆవిరి శక్తిని (స్టీం ఇంజను) ఎప్పుడూ అమలు పరచకుండా నడుస్తున్న రైళ్లు జాబితా వాటిలో ఇది ఒకటి. డెక్కన్ క్వీన్ ప్రారంభం నుండి, ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ మాత్రమే ఉపయోగించి అమలు చేయబడింది. అప్పుడప్పుడు, అసలు లోకోమోటివ్ వైఫల్యం చెందిన విషయంలో మాత్రము, డీజిల్ ఇంజను వాహనము డెక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్ నకు ఇవ్వబడింది. ఈ రైలు రేక్ రంగులో ఎరుపు నుండి పసుపునకు అటు తర్వాత నీలం రంగునకు అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.[1]
డెక్కన్ క్వీన్ అనేక విషయములలో ప్రథమ స్థానంలో ఉంది లేదా ప్రథమ స్థానములలో డెక్కన్ క్వీన్ పాత్ర :
భారతదేశం యొక్క మొదటి ISO సర్టిఫైడ్ రైలు భోపాల్ హబీబ్‌గంజ్ (భోపాల్ ) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) మధ్య నడుస్తూ ఉన్న షాన్ - ఇ - భోపాల్ ఎక్స్‌ప్రెస్ తర్వాత డెక్కన్ క్వీన్ భారతదేశంలో ఐఎస్ఒ (ISO) 9000 సర్టిఫికేషన్ కలిగిన రెండవ రైలు.[1] ఇంజనుతో సహా ఇది పదహారు కోచ్‌లు కలిగి ఉంటుంది.
డెక్కన్ క్వీన్ సైతం రైలు అభిమానులకు అత్యంత ఇష్టమైన రైళ్లు యందు ఇది ఒకటి. ప్రతి సంవత్సరం జూన్, 1 న దీనిలో ప్రయాణించే సాధారణ నెలవారీ ప్రయాణీకులు, రైలు అభిమానులు, ప్రయాణీకులు, రైల్వే అధికారులు అందరూ రైలు యొక్క పుట్టినరోజు జరుపుకుంటారు. 'డెక్కన్ క్వీన్ 2015 జూన్ 1 నాటికి దాని సేవల యొక్క 86 వ సంవత్సరం లోనికి ప్రవేశించింది.' [2]
ఈ రైలు మొత్తం 192 కిలోమీటర్ల దూరం, పూణే నుండి ముంబైకు ప్రయాణిస్తుండగా, రైలు నెంబర్ 12124 (అప్) గాను, తిరుగు ప్రయాణంలో ముంబై నుండి పూణే దానికోసం నంబరు 12123 (డౌన్) గాను ఉంది. రైలు కేవలం 3.15 గం.ల లోపల ఈ ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే ఈ దూరాన్ని బస్సు పూర్తి చేయాలంటే కనీసం 4 నుంచి 5 గంటలు పడుతుంది..
స్టేషను | సమయములు | విరామ సమయము | గమనికలు | |
---|---|---|---|---|
చేరుట | బయలు దేరుట | |||
ముంబై సిఎస్టి | 17:10 | ప్రారంభ స్టేషను . | ||
కర్జత్ | 18:33 | 18:35 | 2 ని.లు | రేర్ వాహనములు (బ్యాంకర్లు) భోర్ ఘాట్ కోసం తగిలించి ఉంటాయి. |
లోనావాలా | 19:19 | 19:20 | 1 ని.లు | |
శివాజీనగర్ | 20:09 | 20:10 | 1 ని. | |
పూణే | 20:25 | స్టేషను అంతమవుతుంది. |
ముంబై నుండి ప్రయాణ సమయంలో, రైలు యొక్క మొదటి విరామం కర్జత్ వద్ద ఉంది. రైలు పర్వత మార్గం అధిరోహించేందుకు సహాయ పడేందుకు వీలుగా ఇక్కడ రైలు వెనుక బ్యాంకర్ వాహనములు తగిలించి (అటాచ్) సిద్ధం చేస్తారు. రైలు అప్పుడు, పైకి ఎక్కిన తర్వాత లోనావాలా వద్దకు చేరుతుంది. ఆపైన, చివరకు ప్రధాన పూణే రైల్వే స్టేషను వద్ద ఆగిపోయే ముందు, పూణే సమీపంలోని శివాజీనగర్ స్టేషను వద్దకు చేరుతుంది. ఈ రైలు, నాగార్గలి సమీపంలోని భోర్ ఘాట్ లో అంబర్నాథ్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ అయిన ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను, లోనావాలా వద్ద ఇంద్రాయణి ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.
స్టేషను | సమయములు | విరామ సమయము | గమనికలు | |
---|---|---|---|---|
చేరుట | బయలు దేరుట | |||
పూణే | 7:15 | ప్రారంభ స్టేషను | ||
లోనావాలా | 8:09 | 8:10 | 1 ని. | |
ఖండాలా | 8:15 | 8:16 | 1 ని. | సాంకేతిక విరామం. బ్రేక్‌లు తనిఖీ కోసం. |
మంకీ హిల్ | 8:20 | 8:21 | 1 ని. | సాంకేతిక విరామం. బ్రేక్‌లు తనిఖీ కోసం. |
దాదర్ సెంట్రల్ | 10:03 | 10:05 | 2 ని.లు | |
ముంబై సిఎస్టి | 10:25 | స్టేషను అంతమవుతుంది. |
పూణే విడిచిపెట్టాక, ముంబై గమ్యం చేరే ముందు రైలు లోనావాలా, దాదర్ స్టేషన్లు వద్ద మాత్రమే ఆగుతుంది. రైలు దాని యొక్క బ్రేకులు తనిఖీ చేయడానికి ఒక నిటారుగా దిగుట ప్రారంభంలో ఉన్న మంకి హిల్ (కేవలం లోనావాలా తర్వాత) అనే పాయింట్ వద్ద కొన్ని నిమిషాలు ఆగుతుంది. దీనిని "సాంకేతిక విరామం" అని పిలుస్తారు, ఒక స్టేషను వద్ద ఒక షెడ్యూల్ విరామం మాత్రము కాదు. ఈ రైలు, ఇంద్రాయణి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను మాలవ్లీ వద్ద, ఠాకూర్వాడి సమీపంలో భోర్ ఘాట్ లో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, కర్జత్ వద్ద డెక్కన్ ఎక్స్‌ప్రెస్ లను దాటుతుంది.[5]
మొదట్లో డెక్కన్ క్వీన్ డబ్ల్యుసిఎం-1 ఇంజను కలిగి ఉంది. ఇది ప్రస్తుతం ఒక డబ్ల్యుసిఎఎం-3 ఇంజను లేదా కళ్యాణ్ (KYN) షెడ్ నకు చెందిన డబ్ల్యుసిఎఎం 2పి ఇంజను ద్వారా రైలు ముగింపు నుండి ముగింపు వరకు నెట్టబడుతూ ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.