![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f2/Flag_of_Toronto%252C_Canada.svg/langte-640px-Flag_of_Toronto%252C_Canada.svg.png&w=640&q=50)
టొరంటో
From Wikipedia, the free encyclopedia
టొరంటొ పట్టణం కెనడా దేశంలోని పెద్ద ప్రధాన మయిన భిన్న జాతులు సంస్కృ తులు కలసి నివసించే అందమయిన పట్టణం.
టొరంటొ | |||
|
|||
|
|||
ముద్దు పేరు: T.O., Hogtown, The Big Smoke, Toronto the Good, T-Dot | |||
నినాదం: Diversity Our Strength | |||
![]() |
|||
అక్షాంశరేఖాంశాలు: 43°39′N 79°23′W | |||
---|---|---|---|
దేశం | ![]() | ||
ప్రావిన్సు | మూస:Country data ఓంటారియో ఓంటారియో | ||
జిల్లాలు | ఈస్ట్ యార్క్ ఇటోబికోక్ నార్త్ యార్క్ పాత టొరంటొ స్కార్ బరో యార్క్ | ||
Established | ఆగష్టు 27, 1793 | ||
పురపాలక సంఘం | మార్చి 6, 1834 | ||
Amalgamated | జనవరి 1, 1998 | ||
ప్రభుత్వం | |||
- Type | {{{government_type}}} | ||
- మేయర్ | John Tory (Canadian politician జాన్ టోరి | ||
- Council | టొరంటొ సిటీ కౌన్సిల్ | ||
- పార్లమెంటు సభ్యుడు (కెనడా) | పార్లమెంటు సభ్యుల జాబితా
|
||
- MPPs | List of MPPs
|
||
వైశాల్యము [1][2] | |||
- City | 630 km² (243.2 sq mi) | ||
- పట్టణ | 1,749 km² (675.3 sq mi) | ||
- మెట్రో | 7,125 km² (2,751 sq mi) | ||
ఎత్తు | 76 m (249 ft) | ||
జనాభా (2006)[1][2] | |||
- City | 25,03,281 | ||
- సాంద్రత | 3,972/km2 (10,287.4/sq mi) | ||
- పట్టణ | 4,753,120 | ||
- మెట్రో | 5,555,912 | ||
- Demonym | Torontonian | ||
కాలాంశం | EST (UTC-5) | ||
- Summer (DST) | EDT (UTC-4) | ||
Postal code span | M | ||
Area code(s) | (416) and (647) | ||
NTS Map | 030M11 | ||
GNBC Code | FEUZB | ||
వెబ్సైటు: toronto.ca |
టొరంటో కెనడాలో అతి పెద్ద నగరం. టొరంటో దక్షిణ ఒంటారియో వాయవ్య దిశలో ఉంది. 18వ శతాబ్దంలో మిసిసాగా వద్ద భూములను ఒప్పందం ద్వారా కొనుగోలు చేయడంతో టొరంటో చరిత్ర మొదలైంది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం టౌన్ ఆఫ్ యోర్క్ పేరుతో ఒక పట్టణాన్ని స్థాపించింది. తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ జాన్ గ్రేవ్స్ సింకో టౌన్ ఆఫ్ యోర్క్ ను ఎగువ కెనడా రాజధానిగా రూపుదిద్దాడు. 1812 లో బాటిల్ ఆఫ్ యోర్క్ యుద్ధంలో ఈ నగరం దోపిడీకి గురైంది. 1834 లో యోర్క్కు నగర అతస్థు ఇచ్చి టొరంటో అని పేరును పేరుమార్పిడి చేసారు.ఈ నగరం 1849, 1904 లలో రెండు మార్లు అగ్నిప్రమాదానికి గురైంది. టొరంటో పలుమార్లు పొరుగున ఉన్న పురపాలకాలను కలుపుకుంటూ తన సరిహద్దులను విస్తరించింది. సరికొత్తగా 1998లో టొరంటో సరిహద్దులను విస్తరించింది.
2011 గణాంకాలను అనుసరించి టొరంటో నగరంలో 2.6 మిలియన్ల నివాసులు ఉన్నారు . టొరంటో ఉత్తర అమెరికాలో జనసంఖ్యపరంగా ఐదవ స్థానలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ది సెంసస్ మెట్రోపాలిటన్ ఏరియా (సి.ఎం.ఎ) జనసంఖ్య 55,83,064 ఉండగా, టొరంటో మహానగర (జి.టి.ఎ) జనసంఖ్య 60,54,191 ఉంది. టొరంటో మహానగరం హృదయస్థానంలో టొరంటో నగరం ఉంది. అలాగే గోల్డెన్ హార్స్‌షూ అనబడే దక్షిణ ఒంటారియోలో టొరంటో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం అని అంచనా. అత్యంత నాగరీకత కలిగిన అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ప్రజలు కలిగిన టొరంటో కెనడాకు వచ్చే విదేశీవలస ప్రజలకు ప్రధాన గమ్యస్థానమని భావించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యం కలిగిన నగరంగా టొరంటో నగరానికి ప్రత్యేకత ఉంది. టొరటో వాసులలో 49% పౌరులు విదేశాలలో జన్మించిన వారే.