![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a5/Mature_cystic_teratoma_of_ovary.jpg/640px-Mature_cystic_teratoma_of_ovary.jpg&w=640&q=50)
టెరటోమా
From Wikipedia, the free encyclopedia
కేశాలు, కండలు, ఎముకలు వంటి అనేక రకాల కణజాలాలా ద్వారా ఏర్పడే గ్రంథిని టెరటోమా అని పిలుస్తారు. ఇవి సహజంగా అండాశయాలు, వృషణాలు, టెయిల్ బోన్ (Tail bone) లలో, ఇతర స్థలాలలో ఏర్పడతాయి. గ్రంథి చిన్నది అయితే వాటి లక్షణాలు స్పష్టంగా తెలియవు. ఓవెరియన్ టోర్షన్ (Ovarian torsion), టెస్టిక్యూలర్ టోర్షన్ (Testicular torsion) దీని సమస్యలలో ఉండవొచ్చు.
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
టెరటోమా (Teratoma) | |
---|---|
![]() | |
A small (4 cm) dermoid cyst of an ovary, discovered during Cesarean section | |
ప్రత్యేకత | గైనకాలజీ, ఆంకాలజీ |
లక్షణాలు | Minimal, painless lump |
ఉపద్రవాలు | Ovarian torsion, testicular torsion, hydrops fetalis |
రకాలు | Mature, immature |
కారణాలు | Unknown |
రోగనిర్ధారణ పద్ధతి | ముక్క పరీక్ష |
భేదాత్మక నిర్ధారణ | Lipoma, dermoid, myelomeningocele |
చికిత్స | శస్త్రచికిత్స, chemotherapy |
తరచుదనం | 1 in 30,000 newborns (tailbone) |
ఇది అపరిపక్వం, పరిపక్వం అనే రెండు రకాలుగా విభజించబడింది. సాధారణంగా పరిపక్వమైన టెరటోమాస్ బెనిగ్న్, డెర్మొయిడ్ సైస్ట్స్ (Dermoid cysts) ని కలిగి ఉంటుంది. అపరిపక్వమైన టెరటోమాస్ కాన్సర్ ని కలిగించవచ్చు. అధిక ఓవెరియన్ టెరటోమాస్ పక్వమైనది. పెద్దవాళ్లలో వచ్చే టెస్టిక్యూలర్ టెరటోమాస్ సాధారణంగా కాన్సర్ ని కలిగించవచ్చు. టిష్యూ భయాప్సీ (Tissue biopsy) ద్వారా రోగాన్ని నిర్ధారించవచ్చు.
టెయిల్ బోన్, టెస్టిక్యూలర్, ఓవెరియన్ టెరటోమాస్ యొక్క చికిత్స సాధారణంగా శస్త్రచికిత్స ద్వారా జరుగుతుంది. టెస్టిక్యూలర్, అపరిపక్వ టెరటోమాస్ తరచు కెమోథెరపీ ద్వారా చికిత్స చేస్తారు.
ప్రస్తుత కాలంలో జన్మించే శిశువులలో 30,000 లో ఒకరికి టెయిల్ బోనస్లో టెరాటోమాలు సంభవిస్తాయి. ఈ వయసులో అత్యంత సాధారణ సంభవించు కణితిలలో ఇది ఒకటి. ఈ వ్యాధికి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. అండాశయ కణితులలో నాలుగో వంతు అండాశయ టెరటోమాస్లలను సూచిస్తుంది. సాధారణంగా మధ్య వయసులో ఉండే వారిలో దీనిని గమనించవచ్చు. ఇవి పిల్లలు, పెద్దవారిలోను సంభవించవచ్చు.