జోన్ క్రాఫోర్డ్
అమెరికన్ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి / From Wikipedia, the free encyclopedia
జోన్ క్రాఫోర్డ్ (190?, మార్చి 23 – 1977, మే 10) అమెరికన్ నాటకరంగ, టెలివిజన్, సినిమా నటి. బ్రాడ్వే నాటకరంగంలోకి రావడానికి ముందు సంచార నాటక కంపెనీలలో డాన్సర్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. 1925లో మెట్రో-గోల్డ్విన్-మేయర్ సినిమా ద్వారా సినిమారంగంలోకి వచ్చింది. 1920ల చివరి నాటికి జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఫ్లాపర్గా ఒక సినిమాని నిర్మించింది. 1930ల నాటికి, క్రాఫోర్డ్ తన సహనటులు నార్మా షియరర్, గ్రెటా గార్బోలకు పోటీగా నిలిచింది. హాలీవుడ్ లో అత్యంత ప్రముఖ నటీమణులలో ఒకరిగా, యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక పారితోషికం పొందిన మహిళల్లో ఒకరిగా నిలిచింది.
జోన్ క్రాఫోర్డ్ | |
---|---|
జననం | లుసిల్లే ఫే లెసూర్ 190?, మార్చి 23[Note 1] |
మరణం | (aged 69–73) |
సమాధి స్థలం | ఫెర్న్క్లిఫ్ స్మశానవాటిక |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1924–1974 |
జీవిత భాగస్వామి | డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ జూనియర్
(m. 1929; div. 1933)ఫ్రాంచోట్ టోన్
(m. 1935; div. 1939)ఫిలిప్ టెర్రీ
(m. 1942; div. 1946)ఆల్ఫ్రెడ్ స్టీల్
(m. 1955; died 1959) |
పిల్లలు | 4 |
బంధువులు | హాల్ లెసూర్ (సోదరుడు) |
సంతకం | |
దాదాపు రెండు సంవత్సరాలు సినిమారంగానికి దూరంగా ఉన్న తరువాత 1945లో మిల్డ్రెడ్ పియర్స్ సినిమాలో నటించింది. ఈ సినిమాకు ఉత్తమ నటిగా అకాడమీ అవార్డును గెలుచుకుంది. 1960ల వరకు సినిమా, టెలివిజన్‌లో నటించింది. 1970లో ట్రోగ్ సినిమాలో చివరిసారిగా నటించింది. 1974లో ప్రజా జీవితం నుండి వైదొలిగింది. 1977లో మరణించే వరకు ఒంటరిగానే జీవించింది.