జేమ్స్ కాగ్నీ
అమెరికన్ నటుడు, నర్తకుడు, సినిమా దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
జేమ్స్ ఫ్రాన్సిస్ కాగ్నీ జూనియర్ (1899, జూలై 17 – 1986, మార్చి 30)[1] అమెరికన్ నాటకరంగ సినిమా నటుడు, నర్తకుడు, దర్శకుడు. నాటకరంగంలో, సినిమారంగంలో మంచి నటనతో విలక్షణమైన స్వరశైలి, డెడ్‌పాన్ కామిక్ టైమింగ్‌కు గుర్తింపు పొందాడు. అనేక అవార్డులను గెలుచుకున్నాడు.[2] 1931లో ది పబ్లిక్ ఎనిమీ, 1932లో టాక్సీ!, 1938లో ఏంజిల్స్ విత్ డర్టీ ఫేసెస్, 1939 ది రోరింగ్ ట్వంటీస్, 1940లో సిటీ ఫర్ కాంక్వెస్ట్, 1949 వైట్ హీట్ వంటి సినిమాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులలో గుర్తుండిపోతాడు.[3] తన సినిమాలలో డ్యాన్స్ ను ఉపయోగించాడు. 1942లో వచ్చిన యాంకీ డూడుల్ దండి సినిమాలో పాత్రకు అకాడమీ అవార్డును గెలుచుకున్నాడు. 1999లో అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ హాలీవుడ్ స్వర్ణయుగం గొప్ప నటుల జాబితాలో ఇతనికి ఎనిమిదో స్థానం ఇచ్చింది.[4] ఓర్సన్ వెల్లెస్ "కెమెరా ముందు కనిపించిన గొప్ప నటుడు" అని వర్ణించాడు.[5]