![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/09/Shri_Gangapuram_Kishan_Reddy.jpeg/640px-Shri_Gangapuram_Kishan_Reddy.jpeg&w=640&q=50)
జి.కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి - భారత ప్రభుత్వం / From Wikipedia, the free encyclopedia
జి.కిషన్ రెడ్డి (G.Kishan Reddy) భారతీయ జనతా పార్టీకి చెందిన యువనేత. . 1964లో రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మార్చి 6, 2010న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[1] 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 2009లో అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికై [2] వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహించాడు. 2012 జనవరి 19న మహబూబ్నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భారతీయ జనతా పార్టీ పోరుయాత్ర ప్రారంభించాడు. 2019,2024 భారత సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాదు లోక్సభ నియోజకవర్గం నుండి రెండో సారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.ఆయన ప్రస్తుతం కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
గంగపురం కిషన్ రెడ్డి | |||
![]() తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు | |||
కేంద్ర సహాయక మంత్రి గా | |||
పదవీ కాలం 2019 మే 30 – 2024 ఫిబ్రవరి | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం మే 2019 – 2021 | |||
ముందు | బండారు దత్తాత్రేయ | ||
నియోజకవర్గం | సికింద్రాబాదు | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2004 – 2009 | |||
ముందు | శ్రీకృష్ణ యాదవ్ | ||
తరువాత | లేరు | ||
నియోజకవర్గం | హిమాయత్ నగర్ | ||
శాసనసభ్యుడు | |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | లేరు | ||
తరువాత | కాలేరు వెంకటేశ్ | ||
నియోజకవర్గం | అంబర్పేట | ||
అధ్యక్షుడు, భారతీయ జనతా యువమోర్చా | |||
పదవీ కాలం 2002 – 2005 | |||
ముందు | శివరాజ్ సింగ్ చౌహాన్ | ||
తరువాత | ధర్మేంద్ర ప్రదాన్ | ||
నియోజకవర్గం | సికింద్రాబాదు | ||
కేంద్రమంత్రి గా | |||
పదవీ కాలం జులై 8 2021 – ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1964-05-15) 1964 మే 15 (వయసు 60) తిమ్మాపూర్ గ్రామం, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | జి స్వామిరెడ్డి, ఆండాలమ్మ | ||
జీవిత భాగస్వామి | కావ్య | ||
సంతానం | వైష్ణవి, తన్మయి రెడ్డి | ||
నివాసం | హైదరాబాదు | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | Official site |
కిషన్ రెడ్డిని 2023 జూలై 4న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ కేంద్ర నాయకత్వం నియమించింది.[4][5][6]