From Wikipedia, the free encyclopedia
జింకు బ్రోమైడ్ ఒక రసాయన సమ్మేళనం.ఇది ఒక అకర్బన సమ్మేళనపదార్థం.జింకు, బ్రోమిన్ మూలకాల సమ్మేళనం వలన ఏర్పడిన రసాయన పదార్థం.జింకు బ్రోమైడ్ రసాయనిక సంకేత పదంZnBr2.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Zinc bromide | |
ఇతర పేర్లు
Zinc(II) bromide, Zinc dibromide | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [7699-45-8] |
పబ్ కెమ్ | 24375 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | ZH1150000 |
SMILES | Br[Zn]Br |
| |
ధర్మములు | |
ZnBr2 | |
మోలార్ ద్రవ్యరాశి | 225.198 g/mol |
స్వరూపం | white crystalline powder hygroscopic |
సాంద్రత | 4.20 g/cm3 (20 °C) 4.22 g/cm3 (25 °C) |
ద్రవీభవన స్థానం | 394 °C (741 °F; 667 K) |
బాష్పీభవన స్థానం | 697 °C (1,287 °F; 970 K) |
నీటిలో ద్రావణీయత |
311 g/100 mL (0 °C) 447 g/100 mL (20 °C)[1] 538 g/100 mL (100 °C)[2] |
ద్రావణీయత | very soluble in alcohol, ether, acetone, tetrahydrofuran |
వక్రీభవన గుణకం (nD) | 1.5452 |
ప్రమాదాలు | |
భద్రత సమాచార పత్రము | External MSDS |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు |
Cadmium bromide, Mercury(II) bromide, Calcium bromide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
జింకు బ్రోమైడ్ రంగులేని ఘనపదార్థం. జింకు క్లోరైడ్ తో పలు గుణాలలో, లక్షణాలలో పోలిక కలిగి ఉంది.ఇది నీటిలోనూ, సేంద్రియ ద్రావణాలలో కరుగుతుంది.నీటిలో కరగడం వలన ఆమ్లద్రావణులను ఏర్పరచును.జింకు బ్రోమైడ్ అర్ద్రతాకర్షణ(hygroscopic) గుణం కలిగిన రసాయన సంయోగ పదార్థం. అర్ద్రతాకర్షణవలన రెండు జలాణువులనుకలిగిన జింకు బ్రోమైడ్ (ZnBr2• 2H2O) ను ఏర్పరచును.జింకు బ్రోమైడ్ అణుభారం 225.198 గ్రాములు /మోల్.20 °C వద్ద జింకు బ్రోమైడ్ సాంద్రత 4.20గ్రాములు/సెం.మీ3.జింకు బ్రోమైడ్ ద్రవీభవన స్థానం/ద్రవీభవన ఉష్ణోగ్రత 394 °C (741 °F; 667K)., బాష్పీభవన స్థానం 697 °C (1,287 °F; 970K).నీటిలో కరుగుతుంది. జింకు బ్రోమైడ్ 100 మి.లీ నీటిలో 20°Cవద్ద 447 గ్రాములు,100°Cవద్ద 538గ్రాములు కరుగుతుంది.అలాగే ఆల్కహాల్, ఈథర్, అసిటోన్, టెట్రాహైడ్రోఫురాన్ లలో కరుగుతుంది.బ్రోమైడ్వక్రీభవన గుణకం/ వక్రీభవనసూచిక 1.5452.
జింకు ఆక్సైడ్ లేదా జింకు లోహాన్ని హైడ్రోబ్రోమిక్ ఆమ్లంతో రసాయనికచర్య జరపరడం వలన రెండు జలాణువులను కలిగిన జింకు బ్రోమైడ్ ఏర్పడును.
ఇలా ఏర్పడిన ఆర్ద్ర జింకు బ్రోమైడ్ను కార్బన్ డైఆక్సైడ్ నిర్జలికరణ(dehydrate) చెయ్యడం వలన లేదా జింకు లోహంతో బ్రోమిన్మూలకాన్ని చర్య జరిపిం చడం వలన కూడా అనార్ద్ర జింకు బ్రోమైడ్ ఉత్పత్తి అగును.
అణునిర్మాణం సౌష్టవ పరంగా జింకు అయోడైడ్ను పోలి ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.