![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Trident_missile_launch.jpg/640px-Trident_missile_launch.jpg&w=640&q=50)
జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి
From Wikipedia, the free encyclopedia
జలాంతర్గాముల నుండి ప్రయోగించడానికి వీలయ్యే బాలిస్టిక్ క్షిపణిని జలాంతర్గామి నుండి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అంటారు. ఈ క్షిపణుల ఆధునిక రూపాలు మిర్వ్ సామర్థ్యం, అణు సామర్థ్యమూ కలిగి ఉంటాయి. మిర్వ్ సామర్థ్యంతో ఒకే ఒక్క క్షిపణి ప్రయోగంతో అనేక లక్ష్యాలను ఏక కాలంలో ఛేదించగలిగే అవకాశం ఉంటుంది. జలాంతర్గామి నుండి ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల కంటే ఇవి విభిన్నంగా ఉంటాయి.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/02/Trident_missile_launch.jpg/640px-Trident_missile_launch.jpg)
ఇవి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల (5,500 కి.మీ. పైబడిన పరిధి) లాగానే పనిచేస్తాయి. చాలా సందర్భాల్లో ఈ రెండు రకాల క్షిపణులు కూడా ఒకే క్షిపణి కుటుంబానికి చెంది ఉంటాయి.